• search
 • Live TV
నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

'తల్లిదండ్రులులేని బిడ్డలపై పోటీయా, ఎవరో చెబితే వినేవాడు నాయకుడా'?

By Narsimha
|

నంద్యాల: తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలపై వైసీపీ పోటీపెట్టడం నైతికమేనా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రాజకీయ సంప్రదాయాలు, నైతిక విలువలకు వైసీపీ తిలోదకాలు ఇస్తోందని ఆయన విరుచుకుపడ్డారు.

నంద్యాలలో రెండురోజులపాటు ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు పర్యటించారు.ఆదివారంనాడు ఆయన నంద్యాలలో టిడిపి మున్సిఫల్‌కౌన్సిలర్లు, సర్పంచులు, జడ్‌పిటిసి సభ్యులు, ఎంపీటీసీలు, టిడిపి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

నంద్యాలలో పోటీకి దూరంగా ఉండాలని రాజకీయ సంప్రదాయాన్ని వైసీపీ తిలోదకాలు ఇవ్వడమే చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. సంప్రదాయాలను విస్మరించడం సహేతుకం కాదని ఆయన విమర్శించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఏపీలో కూడ గతంలో కూడ చోటుచేసుకొన్న ఘటనలను ఆయన ప్రస్తావించారు. ఎవరో ఏదో చెబితే వినేవాడు నాయకుడా అంటూ బాబు దుయ్యబట్టారు.

తల్లిదండ్రులు లేని పిల్లలపై పోటీ చేయడం న్యాయమా

తల్లిదండ్రులు లేని పిల్లలపై పోటీ చేయడం న్యాయమా

ఏడాదిన్నర పదవి కోసం తల్లిదండ్రులులేని బిడ్డలపై పోటీ చేయడం న్యాయమేనా అని బాబుు ప్రశ్నించారు. రాజకీయ సంప్రదాయాలు, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వకూడదని ఆయన మండిపడ్డారు. 2014లో ఆళ్ళగడ్డలో ఎన్నికల ప్రచార సమయంలో శోభానాగిరెడ్డి చనిపోయిన సమయంలో ఐదేళ్ళ సమయం ఉన్నా పోటీపెట్టకుండా ప్రతిపక్షానికే అవకాశం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలను కూడ ఆయన ప్రస్తావించారు. వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో కూడ పులివెందులలో కూడ పోటీకి పెట్టలేదన్నారు.

  Nandyal By-poll : Chandrababu Naidu Tense Over Elections | Oneindia Telugu
  50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాలి

  50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాలి

  నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మనందరెడ్డిని 50 వేల ఓట్లతో గెలిపించి వైసీపీకి బుద్దిచెప్పాలని చంద్రబాబునాయుడు కార్యకర్తలను కోరారు. ఈ ఉప ఎన్నికలు దేశంలో చర్చకు దారితీయాలన్నారు. 2019 ఎన్నికలకు ఈ ఉపఎన్నికలు దిక్సూచిగా పనిచేయాలని బాబు సూచించారు. తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలపై పోటీ పెడుతున్నారని వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పేలా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.

  ఎవరో చెబితే వినేవాడు నాయకుడా

  ఎవరో చెబితే వినేవాడు నాయకుడా

  ఎవరో చెబితే వినేవాడు నాయకుడా అంటూ వైఎస్ జగన్‌పై ఆయన నిప్పులు చెరిగారు.ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేస్తున్న ఓ కన్సల్టెన్సీకి రూ.50 కోట్లు ఇస్తున్నారట. కన్సల్టెన్సీ చెప్పిందని, తల్లిని, చెల్లిని ప్రచారానికి పంపిస్తారు ఇది ఆయన చేసే పని అంటూ జగన్‌పై విమర్శనాస్త్రాలను సంధించారు.అయితే ఈ అంశాలన్నింటిని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.

  అర్దరాత్రివరకు జనం మద్యనే

  అర్దరాత్రివరకు జనం మద్యనే

  కర్నూల్ జిల్లా నంద్యాలలో రెండురోజుల పర్యటనకు వచ్చిన బాబు శనివారం అర్ధరాత్రి 12.30 గంటలవరకు జనం మద్యే గడిపారు. ఉప ఎన్నికలను పురస్కరించుకొని నంద్యాలలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన ఆరాతీశారు. జనం మద్యే ఆయన గడిపారు. ఆదివారం నాడు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ysrcp chief Ys Jagan misleading political traditions in Ap said Chandrababu Naidu in Nandyal on Sunday. He participated Tdp leaders meeting in Nandyal.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more