వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కాళ్లు మొక్కించుకున్నారంటూ..: ఆంధ్రజ్యోతిపై ఆగ్రహం వెనుక

గిరిజనుల మనోభావాలను కించపరిచారంటూ దెబ్బతీశారని, విలువలు దిగజార్చేలా ఆంధ్రజ్యోతి వార్తలు రాసిందని వైసిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బుధవారం మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: గిరిజనుల మనోభావాలను కించపరిచారంటూ దెబ్బతీశారని, విలువలు దిగజార్చేలా ఆంధ్రజ్యోతి వార్తలు రాసిందని వైసిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బుధవారం మండిపడ్డారు.

చదవండి: ఆంధ్రజ్యోతిపై గిడ్డి ఈశ్వరి నిప్పులు

ఆమె ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి పేరు చెప్పి నిప్పులు చెరిగారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ వచ్చినప్పుడు జగన్‌పై ఆ పత్రిక రాసిన కథనంపై ఈశ్వరి విమర్శలు గుప్పించారు.

అసలు ఏం జరిగింది?

అసలు ఏం జరిగింది?

హైదరాబాద్ హోటల్లో రామ్‌నాథ్ కోవింద్ కలిసిన సందర్భంగా వైసిపికి చెందిన దళిత, గిరిజన ఎమ్మెల్యేలకు జగన్ చివాట్లు పెట్టారని, కోవింద్‌తో వారు ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారని, ఆ తర్వాత వెంకయ్యనాయుడు వారిని పిలిచి ఫోటోలు దిగారని, దీంతో జగన్ ఆ ఎమ్మెల్యేలను లోటస్ పాండుకు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారని వార్త ఇచ్చింది.

అడ్డుకున్న భద్రతా సిబ్బంది... గమనించిన వెంకయ్య

అడ్డుకున్న భద్రతా సిబ్బంది... గమనించిన వెంకయ్య

రామ్‌నాథ్ కోవింద్ దళిత వర్గానికి చెందిన నాయకుడు. దీంతో ఆయనతో కలిసి ఫోటో దిగాలని వైసిపికి చెందిన దళిత, గిరిజన ఎమ్మెల్యేలు భావించారని, హోటల్లో మద్దతు కోసం సభ పూర్తయిన అనంతరం వారు ఫోటో దిగేందుకు ప్రయత్నించారని, కోవింద్ కారు వద్దకు వెళ్తుండగా, వారు కూడా ఆయనను అనుసరించారని, కానీ భద్రతా సిబ్బంది నిలువరించారని పేర్కొంది. ఇదంతా అక్కడే ఉన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గమనించారని పేర్కొంది.

 వెంకయ్యతో ఫోటో దిగడం మింగుడు పడలేదని..

వెంకయ్యతో ఫోటో దిగడం మింగుడు పడలేదని..

కోవింద్‌ను వారు ఎందుకు అనుసరించారో వెంకయ్య తెలుసుకున్నారని, కానీ అప్పటికే ఆయన వెళ్లిపోయారని పేర్కొంది. వెంకయ్య ఆ ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగారు. కోవింద్‌తో ఫోటోలు దిగాలనుకోవడం, చివరకు వెంకయ్యతో ఫోటో దిగడం జగన్‌కు మింగుడు పడలేదని, కానీ జగన్ అక్కడ ఏమీ అనలేదని పేర్కొంది.

ఆగ్రహం.. కాళ్లు మొక్కించుకున్నారని..

ఆగ్రహం.. కాళ్లు మొక్కించుకున్నారని..

అనంతరం వెంకయ్యతో ఫోటో దిగిన ఎమ్మెల్యేలను జగన్ లోటస్ పాండుకు పిలిపించుకున్నారని, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొంది. ఈ ఫోటోలోమిటని, వెంకయ్యతో ఫోటోలు అవసరమా అని మండిపడ్డారని తెలిసిందని పేర్కొంది. అసభ్యపదజాలం కూడా ఉపయోగించారని తెలిసిందని రాసింది. అంతేకాకుండా, ఆ ఎమ్మెల్యేలతో జగన్ సారీ చెప్పించుకున్నారని, కాళ్లు మొక్కించుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోందని రాసింది. చివరలో ఈ విషయాన్ని మాత్రం ఎవరూ ధ్రువీకరించలేదని పేర్కొంది. దళిత, గిరిజన ఎమ్మెల్యేలను జగన్ అవమానించారని పేర్కొంది. ఈ కథనంపై వైసిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రంగా మండిపడ్డారు.

English summary
Behind YSR Congress Party MLA Giddi Eswari fired at Andhra Jyothi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X