వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై అసంతృప్తి: టిడిపికి ఆనం వివేకా గుడ్‌బై, రంగంలోకి వైయస్ జగన్?

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగలనుందా? ఆ అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో యేరిన ఆనం వివేకానంద రెడ్డి ఇప్పుడు పసుపు జెండాను .

|
Google Oneindia TeluguNews

విజయవాడ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగలనుందా? ఆ అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో యేరిన ఆనం వివేకానంద రెడ్డి ఇప్పుడు పసుపు జెండాను వదిలేయాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

తమకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని ఆనం వివేకా ఆవేదనతో ఉన్నారని తెలుస్తోంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని వాపోతున్నారని తెలుస్తోంది. 15 నెలలుగా పార్టీలో ఇమడలేకపోయారని అంటున్నారు.

అవసరం లేదు, వెళ్లిపోండి: జగన్‌కు గ్రామస్తుల షాక్, 'సాక్షి' ఆగ్రహంఅవసరం లేదు, వెళ్లిపోండి: జగన్‌కు గ్రామస్తుల షాక్, 'సాక్షి' ఆగ్రహం

ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు గాలం వేస్తోందని తెలుస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి ఆనం వివేకాతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. నెల్లూరులో ఇప్పటికే వైసిపి బలంగా ఉంది. ఆనం కూడా వెళ్లిపోతే మరింత బలపడుతుంది.

టిడిపిలోకి సంవత్సరన్నర క్రితం..

టిడిపిలోకి సంవత్సరన్నర క్రితం..

ఆనం సోదరులు దాదాపు సంవత్సరంన్నర క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే జిల్లా టిడిపి నేతలతో వారికి పొసగడం లేదని తెలుస్తోంది. అయితే, ఆనం వివేకా సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం ఆత్మకూరు ఇంచార్జిగానే కొనసాగుతారని అంటున్నారు.

చంద్రబాబు హామీలు

చంద్రబాబు హామీలు

ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారని, ఆనం వివేకా మాత్రమే పార్టీని వీడే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఆనం సోదరులు టిడిపిలో చేరినప్పుడు చంద్రబాబు రెండు హామీలు ఇచ్చారు.

ఎమ్మెల్సీ లేనట్లే

ఎమ్మెల్సీ లేనట్లే

ఆనం రామనారాయణకు ఆత్మకూరు ఇంచార్జి, వివేకాకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. రామనారాయణను ఆత్మకూరు ఇంచార్జిగా నియమించారు. వివేకాకు మాత్రం ఎమ్మెల్సీ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఆనం సోదరులకు ఎమ్మెల్సీ పదవి లేనట్లేనని అంటున్నారు.

పార్టీని వీడేందుకు..

పార్టీని వీడేందుకు..


టిడిపిలో చేరినప్పటి నుంచి ఆనం రామనారాయణ ఆత్మకూరు ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. తనకు ఎమ్మెల్సీ రాకపోవడంతో.. వివేకా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. కనీసం తన పేరును కూడా పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన చెందుతున్నారు. దీంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. అయితే, వైసిపి నేతలు ఆయనతో ఫోన్ ద్వారా చర్చలు జరుపుతున్నారనే ప్రచారం సాగుతోంది.

నాడు వివేకా అసంతృప్తితోనే..

నాడు వివేకా అసంతృప్తితోనే..

కాగా, ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగారు. సొంత కేడర్‌తో వ్యవహారాలు సాగిస్తూ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ సంక్షోభంలో కూరుకున్నా అదే పార్టీలో కొనసాగారు.

ఆనం రామనారాయణ టిడిపిలో చేరాలని నిర్ణయించి సోదరుడు వివేకాతో చర్చలు జరిపినప్పుడు వివేకా పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదనే వాదనలు ఉన్నాయి. ఇప్పట్లో కాంగ్రెస్ బలపడే పరిస్థితి లేదని రామనారాయణ.. వివేకాను సముదాయించడంతో సైకిలెక్కారు.

English summary
It is said that Anam Vivekananda Reddy is unhappy with AP CM Chandrababu Naidu. he may leave TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X