• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తిరుప‌తి రాహుల్ గాంధీ స‌భ‌లో బాబు పాల్గొంటారా..? ఆస‌క్తి రేపుతున్న రాజ‌కీయం..!!

|
  Will Ap Cm Chandrababu Naidu Joins Rahul Gandhi's Meeting In Tirupati ?? | Oneindia Telugu

  అమరావతి/హైద‌రాబాద్ : ఏపీ రాజ‌కీయాలు ఎప్పుడూ ఆస‌క్తిక‌రంగా సాగుతాయి. ఒక సంఘ‌ట‌న త‌ర్వాత మ‌రో సంఘ‌ట‌న‌తో ఉత్సుక‌త‌ను రేకెత్తిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు జాతీయ స్థాయిలో ఉంటుంది త‌ప్ప ప్రాంతీయంగా పెద్ద‌గా ఉండ‌ద‌ని తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల త‌ర్వాత ఆ రెండు పార్టీలు ప‌ర‌స్ప‌రం ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చాయి. ఇందులో భాగంగా ఢిల్లీలో చంద్ర‌బాబు ధీక్ష చేసిన‌ప‌ప్పుడు రాహుల్ గాంధీ స్వ‌యంగా దీక్ష‌లో పాల్గొని బాబు- రాహుల్ బందం ఎంత ద్రుఢ‌మైందో చెప్పెక‌నే చెప్పారు. ఇక ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ తిరుప‌తిలో త‌ల‌పెట్టిన బ‌హిరంగ స‌భ‌కు రాహుల్ గాంధీ ముఖ్య అతిదిగా హాజ‌రౌతున్నారు. మ‌రీ ఎఐసీసీ అద్య‌క్ష హోదాలో తిరుప‌తి స‌భ‌లో అడుగు పెడుతున్న రాహుల్ స‌భ‌లో చంద్ర‌బాబు పాల్గొనే అంశం ఆస‌క్తిగా మారింది. కాంగ్రెస్, టీడిపి రెండు పార్టీల టార్గెట్ ప్ర‌త్యేక హోదా సాధ‌నే కాబ‌ట్టి, ఇదే అంశం పై భ‌రోసా ఇచ్చేందుకు ఏపి వ‌స్తున్న రాహుల్ స‌భ‌లో బాబు పాల్గొనే అంశంపై టీడిపి లో ఉంకా స్ప‌ష్ట‌త రాలేదు.

  తిరుప‌తి స‌భ‌కు రాహుల్ గాంధీ..! బాబు పాల్గొనే అంశంపై నెల‌కొన్న ఉత్కంఠ‌..!!

  తిరుప‌తి స‌భ‌కు రాహుల్ గాంధీ..! బాబు పాల్గొనే అంశంపై నెల‌కొన్న ఉత్కంఠ‌..!!

  ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌ల‌ది వింత ప‌రిస్థ‌తి. తాము మిత్రుల‌మా, లేక ప్ర‌త్య‌ర్థుల‌మా అనే సందిగ్ధ‌త‌లో కొట్టుమిట్టాడుతున్న‌ట్లు తెలుస్తోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల వేళ క‌ల‌సిన చంద్ర‌బాబు, రాహుల్ క‌ల‌యిక.. ఇటీవ‌ల ధ‌ర్మ‌పోరాట‌ దీక్ష‌తో తారాస్థాయికి చేరింది. ఈ మ‌ధ్య‌లో తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మి చిత్తుగా ఓడి పోవ‌డంతో పొత్తు పై ఆచి తూచి అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే.. సైకిల్‌, హ‌స్తం రెండూ జాతీయ స్థాయిలో మిత్రులుగా ఉంటూనే ప్రాతీయంగా మాత్రం ఎలాంటి పొత్తులు లేకుండా ముందుకు వెళ్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నాయి.

   జాతీయ స్థాయిలో స్నేహం..! స్థానికంగా మాత్రం త‌ట‌స్థం..!

  జాతీయ స్థాయిలో స్నేహం..! స్థానికంగా మాత్రం త‌ట‌స్థం..!

  ఏపీలో హ‌స్తం, టీడీపీ క‌ల‌యిక‌పై ఇప్ప‌టికీ అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. ఎందుకంటే, పీసీసీ అధ్య‌క్షుడు ఎన్. ర‌ఘువీరారెడ్డి దీన్ని మొద‌టి నుంచి వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. టీడీపీలోనూ మంత్రులు సీహెచ్. అయ్య‌న్న‌పాత్రుడు, కేఈ.కృష్ణ‌మూర్తి ఇద్ద‌రూ పొత్తు మంచిది కాదంటూ కొట్టిపారేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 22న తిరుప‌తిలో నిర్వ‌హించే కాంగ్రెస్ స‌భ‌కు చంద్ర‌బాబు వెళ‌తారా అనే అశంపై ఇంత‌వ‌ర‌కూ స్ప‌ష్ట‌త రాలేదు. జాతీయ స్థాయిలో బాబు, రాహుల్ మ‌ద్య మంచి స‌యోద్య కుదిరిన నేప‌థ్యంలో రాహుల్ ఏపి ప‌ర్య‌ట‌న ప‌ట్ల బాబు ఎలా స్పందిస్తార‌నేది ఉత్కంఠ‌గా మారింది.

   హోదా భ‌రోసా యాత్ర‌..! టీడిపి ని ఇబ్బంది పెడుతున్న రాహుల్ ప‌ర్య‌ట‌న‌..!!

  హోదా భ‌రోసా యాత్ర‌..! టీడిపి ని ఇబ్బంది పెడుతున్న రాహుల్ ప‌ర్య‌ట‌న‌..!!

  15 రోజుల బ‌స్సు యాత్ర‌లో భాగంగా రాహుల్‌గాంధీ ఏపీకు రాబోతున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌లు జ‌న‌స‌మీక‌ర‌ణ‌పై దృష్టిసారించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ వైసీపీ నుంచే చేరిక‌లు ఉంటాయ‌నుకున్నారు. కానీ, కోట్ల జయ సూర్య‌ప్ర‌కాశ్‌ రెడ్డి వంటి సీనియ‌ర్ నేత‌లు కాంగ్రెస్‌ను వీడ‌టం కూడా ఆ పార్టీని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తుంది. టీడీపీ నుంచి వ‌ల‌స‌లు పెర‌గ‌టంతో పార్టీ శ్రేణులు ఒకింత అభ‌ద్ర‌తా భావానికి గుర‌వుతున్నాయి.

  బాబుకు త‌ల నొప్పిగా మారిన వ‌ల‌స‌లు..! కాంగ్రెస్ విష‌యంలో ఆచితూచి అడుగేస్తున్న బాబు..!!

  బాబుకు త‌ల నొప్పిగా మారిన వ‌ల‌స‌లు..! కాంగ్రెస్ విష‌యంలో ఆచితూచి అడుగేస్తున్న బాబు..!!

  రోజుకో నేత ఫ్యాన్‌ కింద‌కు చేరుతుండ‌టంతో వాటిని స‌రిదిద్దుకునేందుకు చంద్ర‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఇటువంటి వేళ రాహుల్ స‌భ‌కు చంద్ర‌బాబు వెళితే ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌నే ఆందోళ‌న కూడా తెలుగు త‌మ్ముళ్ల‌తో లేక‌పోలేదు. పైగా ర‌ఘువీరారెడ్డి విమ‌ర్శ‌లు ఇరు పార్టీల మ‌ద్య వేడిని పెంచాయి. ఏపీకు అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీ లేన‌ని విరుచుకు ప‌డుతున్నారు. ఇటు విమ‌ర్శ‌లు, అటు వ‌ల‌స‌ల మ‌ధ్య న‌లుగుతున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ స‌భ‌కు వెళ్లాలా ? వ‌ద్దా ? అనే సందిగ్దంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

  English summary
  In the early elections of Telangana, Mahakuthami seems to be losing over the alliance. That's why the tdp and congress were both national level alliance and in the locally hope that they would move forward neutrally.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X