• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పవన్ కళ్యాణ్ కూడా, నేను గెలిస్తే: 'అమరావతి'పై జగన్ ఓపెన్ ఆఫర్, మోడీ-బాబు పొత్తుపై

|

అమరావతి: తాను అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిని మార్చే ప్రసక్తి లేదని వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఓ అంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై స్పందించారు.

  YS Jagan on Paradise Papers leak:ఇలాంటి cm ఉంటే ఎంత ఊడితే ఎంత? 15రోజుల టైమిస్తున్నా| Oneindia Telugu

  అదే నిజమైతే 'భారతి' మాటేమిటి: పాదయాత్ర, జగన్‌కు దిమ్మతిరిగే ప్రశ్నలు!

  రాజధాని మార్పు, బీజేపీతో పొత్తు, 2014లో తెలుగుదేశం పార్టీ గెలుపు, 2019లో గెలుపు తదితర అంశాలపై ఆ ఇంటర్వ్యూలో స్పందించారు. బీజేపీకి తాము పూర్తిగా మద్దతివ్వలేదని, అంశాల వారీగా మద్దతిచ్చినట్లు స్పష్టం చేశారు.

  జగన్ యాత్ర, ప్రత్యేక కెమెరాలతో పోలీసుల వీడియో: మహిళల కోసం సెక్యూరిటీని దాటి మరీ

  పాదయాత్ర టైంలో కోర్టు హాజరు మినహాయింపుపై

  పాదయాత్ర టైంలో కోర్టు హాజరు మినహాయింపుపై

  పాదయాత్ర సమయంలో కోర్టుకు హాజరు మినహాయింపుపై వ్యతిరేక తీర్పు రావడంపై జగన్ స్పందించారు. ఇందులో బీజేపీ పాత్ర ఉంటుందని తాను భావించడం లేదని అభిప్రాయపడ్డారు. ఏపీలో బీజేపీ లేదా కాంగ్రెస్ అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే ప్రత్యేక హోదాకు బీజేపీ మద్దతు అవసరమని చెప్పారు.

  నా పాదయాత్ర బీజేపీలో మార్పు తెప్పించొచ్చు

  నా పాదయాత్ర బీజేపీలో మార్పు తెప్పించొచ్చు

  ఏపీకి ప్రత్యేక హోదా చాలా ముఖ్యమని జగన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దక్షిణాది రాష్ట్రాలతో పోటీ పడాలంటే ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని చెప్పారు. 2014లో ప్రధాని మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలన్నారు. అదే సమయంలో హోదాపై టీడీపీ తన వైఖరిని మార్చుకుందని, ఇది బాధాకరమన్నారు. అయితే తన పాదయాత్ర బీజేపీ వైఖరిలో మార్పు తెస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

   నా పాదయాత్ర అందుకే

  నా పాదయాత్ర అందుకే

  బీజేపీకి తాను అంశాల వారీగా మద్దతిస్తున్నానని జగన్ తేల్చి చెప్పారు. అదే సమయంలో ప్రత్యేక హోదా, భూసంస్కరణలకు తాము వ్యతిరేకమని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనాలు తెలుసునని చెప్పారు. తన పాదయాత్ర కేవలం ప్రత్యేక హోదా గురించి మాత్రమే కాదని, పలు అంశాల్లో ఇది కూడా ఒక అంశమని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలకు హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు.

  అధికారంలోకి వస్తే రాజధాని ప్రాంత మార్పుపై

  అధికారంలోకి వస్తే రాజధాని ప్రాంత మార్పుపై

  2019లో తాము అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి ప్రాంతాన్ని మార్చేది లేదని జగన్ చెప్పారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కున్న భూములను తిరిగి తీసుకునే పూర్తి స్వేచ్ఛ రైతులకు, రాజధాని ప్రాంత ప్రజలకు ఇస్తానని చెప్పారు. చంద్రబాబు ఈ మూడు నాలుగేళ్లలో రాజధాని ప్రాంతంలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నారు. తాము ప్రాధాన్యతా క్రమంలో భవనాలు నిర్మిస్తామని చెప్పారు.

   చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఐదు కారణాలు

  చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఐదు కారణాలు

  2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఐదు ముఖ్య కారణాలు ఉన్నాయని జగన్ చెప్పారు. ఇష్టారీతిన హామీలు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. అలాగే, దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ వేవ్ అప్పుడు ఉందన్నారు. మరోవైపు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు మద్దతు పలికారని చెప్పారు. తన అనుభవం పనికి వస్తుందని చెప్పారన్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ప్రజా వ్యతిరేకత లేదన్నారు.

   ఇప్పుడు మాత్రం ఇలా

  ఇప్పుడు మాత్రం ఇలా

  చంద్రబాబు నాయుడు పాలనపై ఇప్పుడు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని జగన్ అన్నారు. తనకు ఎంతో అభివృద్ధి ఉందని చెప్పుకున్నాడని, కానీ ఈ మూడేళ్ల పాలనలో ఆయన చేసిందేమీ లేదని జనాలకు అర్థమైందన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అబద్దాలాడారని ప్రజలు గుర్తించారన్నారు.

   బాబుతో బీజేపీ పొత్తుపై

  బాబుతో బీజేపీ పొత్తుపై

  ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం 2014లో బాగా ఉందని జగన్ అన్నారు. అది 2019లో ఎలా ఉంటుందో తెలియదన్నారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో మోడీ పొత్తు కొనసాగిస్తారో లేదో తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో మూలాలు కోల్పోయిందన్నారు.

  English summary
  'I am going to build my house in the Amaravati region and we don’t plan to change the location of capital city if voted to power. However, we will give an open option to the farmers to claim back their land if it was acquired coercively by the government authorities.' says YS Jagan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X