శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కడే కొడతా..: మరోసారి ఇలా జరిగితే: అధికారికి స్పీకర్ తమ్మినేని హెచ్చరిక..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక అధికారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. స్పీకర్ సొంత జిల్లాలో పని చేస్తున్న బీసీ సంక్షేమ శాఖాధికారి పైన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. జ్యోతిరావు పూలే వర్దంతి సందర్బంగా ప్రోటోకాల్ పాటించలేదంటూ ఆయన ఆ అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. అంబేద్కర్..పూలే వంటి మహనీయుల వర్దంతి వేడకులకు తనను పిలవాలనే తెలివి లేదా అంటూ ఫైర్ అయ్యారు. అదే సమయంలో ఆయన చేసిన హెచ్చరిక పైన జిల్లా స్థాయిలోనే కాదు..పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీని పైన రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్పీకర్ గా ఉండి అధికారి పైన ఆ రకంగా చేసిన వ్యాఖ్యల గురించి చర్చ సాగుతోంది.

స్పాట్ లోనే కొడతా...
స్పీకర్ తమ్మినేని సీతారం శ్రీకాకుళం జిల్లా బీసీ సంక్షేమ అధికారి పైన ఆగ్రహం వ్యక్తం చేయటం..ఆయన పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జ్యోతీరావు పూలే..అంబేద్కర్ వంటి మహనీయు ల వర్దంతులకు పిలావాలని తెలియదా అంటూ ఆ అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ ..దీనికి కొనసాగింపుగా మరోసారి ఇటువంటి తప్పు చేస్తే స్పాట్ లోనే కొడతా అంటూ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో బిత్తరపోయిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిని మందలించారు.

will Beat You:Speaker Tammineni Threatens Officials..

చుప్..నోరు మూసుకోండి..
స్పీకర్ ఆగ్రహం గమనించిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఆయన్ను శాంతింపచేయటానికి ప్రయత్నించారు. అదే సమయంలో స్పీకర్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ చుప్.. నోరు మూసుకోండి అంటూ గట్టిగా మందలించారు. సమయం లేక సమాచారం ఇవ్వలేకపోయామని అధికారులు చెప్పే ప్రయత్నం చేసారు. అధికారుల వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నా.. స్పీకర్ ఆగ్రహం మాత్రం తగ్గలేదు. ఉద్యోగాలు సరిగ్గా చేసుకోండి అంటూ మండి పడ్డారు. దీంతో..అక్కడ అధికారులు విస్తుపోయారు. స్పీకర ఆగ్రహంతో వారు మిన్నకుండిపోయారు.

English summary
Speaker tammineni Seeta Ram warned BC welfare officers that if such mistakes re-occurred in future then he will beat them up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X