వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రహ్మానందం పొలిటికల్ ఎంట్రీ, పవన్ కళ్యాణ్‌తో చర్చలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Brahmanandam
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం రాజకీయాల వైపు చూస్తున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. త్వరలో బ్రహ్మానందం రాజకీయ ఆరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని వినికిడి.

తన రాజకీయ ఆరంగేట్రం పైన బ్రహ్మానందం జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో రెండుసార్లు చర్చించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో టాలీవుడ్ టాప్ నటులు రాజకీయాల వైపు ఎక్కువగా చూస్తున్నారు. అందులోను గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవా కారణంగా ఆ పార్టీ వైపు ఎక్కువగా చూస్తున్నారు.

అయితే, తన రాజకీయ ఆరంగేట్రం పైన బ్రహ్మానందం చెప్పాల్సి ఉంది. అది ఎంత వరకు నిజమో ఎంత వరకు అబద్దమో తెలియాల్సి ఉంది. ఇటీవల పలువురు రాజకీయాల వైపు చూస్తున్నందున నటుల ప్రతి అడుగును మీడియా క్షుణ్ణంగా గమనిస్తోంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి.. బిజెపికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. మరో టాప్ హీరో నాగార్జున కూడా సోమవారం సాయంత్రం మోడీతో భేటీ అయ్యారు. కాగా, తాను రాజకీయాల్లో ప్రవేశించనని గతంలో బ్రహ్మానందం చెప్పారు.

English summary
Will Tollywood comedian Brahmanandam enter politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X