వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్, జేసీలపై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు: టిడిపికి ఆయన అవసరం!

ర్నూలు జిల్లా నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1994లో రిగ్గింగ్ చేయకపోతే వైయస్ రాజశేఖర రెడ్డి, జెసి దివాకర్ రెడ్డిలు కూడా ఓడిపోయేవారని సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

వైయస్, జేసీలపై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు, బలహీనంగా ఉన్న టిడిపిని బలోపేతం చేసా!

అమరావతి: కర్నూలు జిల్లా నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1994లో రిగ్గింగ్ చేయకపోతే వైయస్ రాజశేఖర రెడ్డి, జెసి దివాకర్ రెడ్డిలు కూడా ఓడిపోయేవారని సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.

నంద్యాలపై ఆ హామీని జగన్ నిలబెట్టుకుంటారా? ఇప్పటికే బాబు పైచేయినంద్యాలపై ఆ హామీని జగన్ నిలబెట్టుకుంటారా? ఇప్పటికే బాబు పైచేయి

వారితో మంచి సంబంధాలు

వారితో మంచి సంబంధాలు

1994లో ఎన్టీఆర్ తనను పిలిచి టిడిపిలో చేర్చుకున్నారని బైరెడ్డి తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్‌తో కలసి నిర్వహించిన సభకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబంతో కూడా తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అప్పట్లో ముచ్చుమర్రికి పీవీ రావడంతో జిల్లాకు చెందిన ఓ నాయకుడు ఓర్వలేక తనపై కక్షగట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తనను టిడిపిలోకి ఆహ్వానించారన్నారు.

మాకు బైరెడ్డి ఉన్నారని ఎన్టీఆర్ చెప్పారు

మాకు బైరెడ్డి ఉన్నారని ఎన్టీఆర్ చెప్పారు

కాంగ్రెస్ పార్టీలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి లాంటి నేతలున్నారని, మీకు ఎవరున్నారు? అని ఎన్టీఆర్‌ను ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులుగా... 'మాకు బైరెడ్డి ఉన్నారు బ్రదర్' అంటూ ఎన్టీఆర్ చెప్పారని బైరెడ్డి గుర్తు చేసుకున్నారు.

ప్రాధాన్యం ఇచ్చే పార్టీలోకి

ప్రాధాన్యం ఇచ్చే పార్టీలోకి

అవినీతికి తావు లేకుండా, నిస్వార్థమైన రాజకీయాలు చేశానని బైరెడ్డి చెప్పారు. ఆనాడు బలహీనంగా ఉన్న టిడిపిని బలోపేతం చేసి, అధికారంలోకి వచ్చామని తెలిపారు. 1994 ఎన్నికల్లో రిగ్గింగ్ చేయకపోతే వైయస్, జేసీలు కూడా ఓడిపోయేవారన్నారు. తనకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలోనే చేరుతానని చెప్పారు.

టిడిపిలో చేరుతారా?

టిడిపిలో చేరుతారా?

రాయలసీమ పరిరక్షణ పార్టీను క్లోజ్ చేయడం, మరో పార్టీలోకి చేరాలని బైరెడ్డి నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ సాగుతోంది. ఆయన టిడిపిలోనే చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

స్థానిక ఎన్నికలు

స్థానిక ఎన్నికలు

త్వరలో కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అదే పాణ్యం తదితర ప్రాంతాల్లో బైరెడ్డికి గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టిడిపికి కూడా ఆయన అసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. బైరెడ్డికి పార్టీ ఎంత ముఖ్యమో.. వరుస విజయాలదో దూకుడుగా ఉన్న టిడిపికి బైరెడ్డి అవసరం అంతే ఉందంటున్నారు.

English summary
It is said that Former Minister Byreddy Rajasekhar Reddy may join Telugu Desam Party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X