• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జూ ఎన్టీఆర్ పై టీడీపీ టార్గెట్ ఫిక్స్ : కొడాలి నాని ట్రాప్ లో చిక్కారా- క్లారిటీ ఇచ్చారా : తారక్ అడుగులు ఎటు..

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఇప్పడు ఏపీలో అనూహ్యంగా రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. అటు టీడీపీ..ఇటు వైసీపీ రాజకీయాలు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీలో తన సతీమణి గురించి వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు. తిరిగి సీఎం అయిన తరువాతనే సభలో అడుగు పెడతానని స్పష్టం చేసారు. ఆ వెంటనే మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. దీని పైన పార్టీల నేతలు..నందమూరి కుటుంబ సభ్యులు సీరియస్ గా స్పందించారు. బాలయ్య తో సహా కుటుంబ సభ్యులు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

తారక్ ఇరకాటంలో పడ్డారా

తారక్ ఇరకాటంలో పడ్డారా

ఇక, జూనియర్ సైతం స్పందించాలంటూ సోషల్ మీడియా ద్వారా టీడీపీ శ్రేణులు డిమాండ్ చేసాయి. దీని పైన జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో సందేశం విడుదల చేసారు. అందులో చంద్రబాబు..భువనేశ్వరి పేర్లు ప్రస్తావించలేదు. టీడీపీతో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చిన విధంగా జూనియర్ రియాక్ట్ అవుతారని అంచనాలు వేసారు. కానీ, జూనియర్ ఆచితూచి స్పందించారు. పార్టీలు...వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండా తాను చెప్పదలచుకుంది చెప్పారు. దీని పైన టీడీపీ కేడర్ సోషల్ మీడియా వేదికగా జూనియర్ తీరును తప్పు బట్టింది.

టీడీపీ నేతలు జూనియర్ ను టార్గెట్ చేస్తూ

టీడీపీ నేతలు జూనియర్ ను టార్గెట్ చేస్తూ

ఇక, ఇప్పుడు తాజాగా టీడీపీ నేతలు వర్ల రామయ్య.. బుద్దా వెంకన్న డైరెక్ట్ గా జూనియర్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసారు. సొంత మేనత్త విషయంలో జూనియర్ ఫెయిల్ అయ్యాడంటూ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. సినిమాల కోసం విలువలు కోల్పోతారా అంటూ ప్రశ్నించారు. కొడాలి నాని..వంశీ కి ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదంటూ నిలదీస్తున్నారు. ఇదే సమయంలో మరో నేత బుద్దా వెంకన్న తాము సింహాద్రి..ఆది లాగా స్పందిస్తారనుకుంటే ప్రవచనాలు చెప్పారంటూ కామెంట్ చేసారు. దీని పైన జూనియర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

కొడాలి నాని సైతం సంబంధాలు లేవంటూ

కొడాలి నాని సైతం సంబంధాలు లేవంటూ

ఇక, మంత్రి కొడాలి నాని సైతం రియాక్ట్ అయ్యారు. తమకు జూనియర్ కు గతంలో సంబంధాలు ఉండేవని..ఇప్పుడు తాము జగన్ తో కలిసామని స్పష్టంగా చెప్పారు. తమకు జూనియర్ ఎన్టీఆర్ తో ఎటువంటి సంబంధాలు లేవని..ఆయన తమను కంట్రోల్ చేయటం ఏంటని..ఆయన చెబితే తాము వినటం ఏంటని ప్రశ్నించారు. చాలా రోజులుగా నాని- వంశీ ఇద్దరూ జూనియర్ మద్దతు దారులనే ప్రచారం ఉంది. ఈ సమయంలో వర్ల రామయ్య వ్యాఖ్యలు చేయగానే కొడాలి నాని స్పందించటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మంత్రి నాని క్లారిటీ ఇచ్చేందుకేనా

మంత్రి నాని క్లారిటీ ఇచ్చేందుకేనా

జూనియర్ ను టీడీపీ నేతలు విమర్శిస్తున్న సమయంలో వారి ట్రాప్ లో పడి కొడాలి నాని సైతం జూనియర్ పైన ఆ వ్యాఖ్యలు చేసారని చెబుతున్నారు. కాగా, కొడాలి నాని వ్యాహాత్మకంగానే క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలోనే అటువంటి వ్యాఖ్యలు చేసారనేది మరో వాదన. పదే పదే తమకు జూనియర్ తో సంబంధాలు ఉన్నాయంటూ చేస్తున్న వ్యాఖ్యల ద్వారా తాము..అటు జూనియర్ ఇబ్బంది పడాల్సి వస్తోందని, దీని కారణంగానే అసలు తమకు ఎటువంటి సంబంధం లేదని..జూనియర్ చెబితే తామెందుకు వినాలంటూ ప్రశ్నించటం ద్వారా వారి సంబంధాల పైన చర్చకు ముగింపు పలకారని చెబుతున్నారు.

జూ ఎన్టీఆర్ స్పందిస్తారా..ముగింపు ఇస్తారా

జూ ఎన్టీఆర్ స్పందిస్తారా..ముగింపు ఇస్తారా

అయితే, ప్రస్తుతం కుటుంబ సభ్యులతో సహా విదేశాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తిరిగి స్వదేశానికి రాగానే వీటన్నింటికీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, టీడీపీ నేతలు మాత్రం వ్యూహాత్మకంగానే ..జూనియర్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. జూనియర్ పైన వ్యాఖ్యలు చేసినా..అటు చంద్రబాబు...బాలయ్య స్పందంచకపోవటం పైన వారి మనసుల్లోనూ ఇదే అభిప్రాయం ఉందా అనే చర్చ మొదలైంది. దీంతో..ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అడుగులు ఏ రకంగా ఉంటాయి..ఆయన ఏ విధంగా వీటికి ముగింపు ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
AP politics are now centred at Junior NTRs Comments with both the ruling YCP and Opposition TDP targetting him. Will Chandrababu condemn this is what is making the episode interesting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X