వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడపలో జగన్‌కు షాక్: డిఎల్ రవీంద్రారెడ్డితో బాబు చెక్? టిడిపిలో మరో చిచ్చు

మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలలో ఎవరి వైపు చూస్తున్నారనే చర్చ సాగుతోంది. గత కొద్ది రోజులుగా ఆయన భవిష్యత్తు నిర్ణయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

Recommended Video

DL Ravindra Reddy may join TDP జగన్‌కు షాక్: డిఎల్ రవీంద్రారెడ్డితో బాబు చెక్? | Oneindia Telugu

కడప: మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలలో ఎవరి వైపు చూస్తున్నారనే చర్చ సాగుతోంది. గత కొద్ది రోజులుగా ఆయన భవిష్యత్తు నిర్ణయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

డబ్బులిచ్చాం కానీ: నంద్యాల ఉప ఎన్నికలపై టిడిపి ట్విస్ట్డబ్బులిచ్చాం కానీ: నంద్యాల ఉప ఎన్నికలపై టిడిపి ట్విస్ట్

విభజన అనంతరం, గత ఎన్నికల నుంచి ఆయన సైలెంట్‌గా ఉన్నారు. 2019 ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన ఏం చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటిదాకా ఆయన మౌనంగానే ఉన్నారు.

ఆయన కోసం రెండు పార్టీల ప్రయత్నం

ఆయన కోసం రెండు పార్టీల ప్రయత్నం

2019 ఎన్నికల్లో వైసిపి అధినేత జగన్ సొంత ఇలాకా కడపలో ఆయనకు చుక్కలు చూపించాలని టిడిపి భావిస్తోంది. ఇందులో భాగంగా సాధ్యమైనంత వరకు కడప జిల్లా కీలక నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వైసిపి కూడా డిఎల్ కోసం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. దీంతో డిఎల్ ఏ పార్టీ వైపు వెళ్తారనేది ఆసక్తిగా మారింది.

వైయస్ వివేకానంద మాట్లాడారని ప్రచారం

వైయస్ వివేకానంద మాట్లాడారని ప్రచారం

డిఎల్ రవీంద్రా రెడ్డితో ఇరు పార్టీలకు చెందిన పలువురు నేతలు చర్చలు జరుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. మూడు రోజుల క్రితం వైసిపి నేత, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కూడా ఆయనతో మాట్లాడారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబుతో భేటీ అని ఊహాగానాలు

చంద్రబాబుతో భేటీ అని ఊహాగానాలు

మరోవైపు, డిఎల్‌తో టిడిపి నేతలు కూడా మాట్లాడారని, సాధ్యమైనంత త్వరగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీకి ఆయనకు అపాయింటుమెంట్ ఖరారైందనే ప్రచారం కూడా సాగుతోంది. మరో నాలుగైదు రోజుల్లో చంద్రబాబును కలిసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారా

టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారా

నాలుగైదు రోజుల్లో హైదరాబాదులో ఓ వివాహ వేడుక ఉందని, అక్కడ చంద్రబాబు-డిఎల్‌లు కలుసుకునే అవకాశముందని అంటున్నారు. ఇదే నిజమైతే డిఎల్ రవీంద్రా రెడ్డి భవితవ్యం మరికొద్ది రోజుల్లో తేలనుందని చెబుతున్నారు. చంద్రబాబుతో కలిసేందుకు డిఎల్ సుముఖత వ్యక్తం చేయడం అంటే టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే విషయం అర్థమవుతోందంటున్నారు.

టిక్కెట్ నాకే వస్తుందని సుధాకర్

టిక్కెట్ నాకే వస్తుందని సుధాకర్

డిఎల్ రవీంద్రా రెడ్డి వైసిపిలో చేరినా, టిడిపిలో చేరినా కడప రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. మరోవైపు, మైదుకూరు టిడిపి ఇంచార్జ్ పుట్టా సుధాకర్ మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ ఖాయమంటున్నారు.

కడప టిడిపిలో మరో చిచ్చుకు కారణమవుతుందా?

కడప టిడిపిలో మరో చిచ్చుకు కారణమవుతుందా?

డిఎల్ టిడిపిలో చేరితే.. చంద్రబాబుకు మరో తలనొప్పి తప్పదని అంటున్నారు. ఇప్పటికే జమ్మలమడుగులో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇప్పుడు డిఎల్ చేరితే ఆయనతో సుధాకర్ కలిసి ముందుకు సాగుతారా అనే చర్చ సాగుతోంది. డిఎల్ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి ఎంతోకొంత సానుకూలమేనని, టిడిపిలో చేరితే కడపలో జగన్‌కు చెక్ చెప్పే అంశంలో మరో ముందడుగు పడినట్లేనని అంటున్నారు.

English summary
It is said that Former Minister and Mydukur former MLA DL Ravindra Reddy may join YSR Congress or Telugu Desam Party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X