విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వంశీVsదాసరి, బాబుకు చిక్కులు: హరికృష్ణ తెరపైకి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harikrishna
విజయవాడ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం తెలుగదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ పేరు తెర పైకి వస్తుందా? అంటే అలాంటి అవకాశం లేకపోలేదంటున్నారు. గన్నవరం అసెంబ్లీ స్థానంపై ఆ పార్టీ సీనియర్ నేత వల్లభనేని వంశీ, సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన రావుల మధ్య పోటీ పోటీ నెలకొంది.

2009లో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సర్ది చెప్పి.. విజయవాడ లోకసభ స్థానం నుండి వల్లభనేనిని, గన్నవరం అసెంబ్లీ నుండి దాసరిని బరిలోకి దింపారు. ఇప్పుడు విజయవాడ లోకసభ స్థానానికి కేశినేని నాని పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం కోసం వల్లభనేని, దాసరిల మధ్య పోటీ ఏర్పడింది.

తాను సిట్టింగ్ ఎమ్మెల్యేను అయినందున మళ్లీ తనకే సీటు ఇస్తారని దాసరి చెబుతుండగా, తనకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తనకే టిక్కెట్ ఇస్తారని వల్లభనేని చెబుతున్నారు. దీంతో టిడిపి రాజకీయం ఆసక్తికరంగా మారింది. గన్నవరం టిక్కెట్ తనకేనని ధీమా వ్యక్తం చేస్తున్న వల్లభనేని ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారట. దాసరి కూడా అదే బాటలో వెళ్తున్నారు. గన్నవరం అంశం బాబుకు మరోమారు తలనొప్పిని తీసుకు రానుంది.

పిట్ట పోరు పిట్ట పోరు అన్న చందంగా... ఆఖరుకు వీరి పోరు వల్ల చివరకు హరికృష్ణ పేరు తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఒకరిని బరిలోకి దింపాలని చూస్తే మరొకరు హరికృష్ణను తెర పైకి తీసుకు వచ్చే అవకాశముందంటున్నారు. నందమూరి సెంటిమెంట్ దృష్ట్యా అభ్యర్థి ఎవరైనా వెనక్కి తగ్గాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందంటున్నారు. టిక్కెట్ రాని నేత హరికృష్ణను తెర పైకి తెచ్చి చెక్ చెబుతారా లేకా చంద్రబాబు వారి మధ్య సయోధ్య కుదుర్చుతారా అనేది చూడాలి.

English summary

 Verbal war between Telugudesam Party senior leaders Vallabhaneni Vamsi and Dasari Balavardhana Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X