ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ సీఎం జగన్ కు సవాల్ .. బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో వైఎస్సార్ తరహా నిర్ణయం తీసుకుంటారా?

|
Google Oneindia TeluguNews

ఏపీలో జగన్ ప్రభుత్వం పారదర్శకమైన పాలన సాగించాలని కృత నిశ్చయంతో ఉంది. ఇక శాంతి భద్రతల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టనుంది. అయితే జగన్ ప్రభుత్వానికి తాజాగా జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఒక సవాల్ గా మారింది. ఇలాంటి దారుణ సంఘటనలపై జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

బీజేపీ ఇచ్చిన ఆఫర్ కు నో చెప్పిన ఏపీ సీఎం వై ఎస్ జగన్ .. మా తోలి ప్రాధాన్యం అదే అని తేల్చేసిన జగన్ బీజేపీ ఇచ్చిన ఆఫర్ కు నో చెప్పిన ఏపీ సీఎం వై ఎస్ జగన్ .. మా తోలి ప్రాధాన్యం అదే అని తేల్చేసిన జగన్

ఒంగోలులో బాలికపై సామూహిక అత్యాచారం .. అత్యాచారం చేసినవారంతా విద్యార్థులే

ఒంగోలులో బాలికపై సామూహిక అత్యాచారం .. అత్యాచారం చేసినవారంతా విద్యార్థులే


ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గదిలో నిర్బంధించి పదహారేళ్ల బాలికపై ఆరుగురు యువకులు నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు.ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీవరకు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. . ఒక ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడిన అమ్మాయి అతడిని వెతుక్కుంటూ ఒంగోలు వచ్చిన నేపధ్యంలో ఓ వ్యక్తి ట్రాప్ చేశాడు. మిత్రుడి వద్దకు చేరుస్తానంటూ నమ్మించి తనతో తీసుకుని వెళ్లి ఆమెను ఒక గదిలో నిర్బంధించాడు. అతడితోపాటు మరో ఐదుగురు యువకులు ఆమెపై నాలుగు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం అనుమానాస్పద స్థితిలో కనిపించిన బాలికను ఒంగోలు పోలీసులు గుర్తించి ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులలో ఇరువురు ఇంటర్మీడియెట్‌ చదివిన యువకులని, మరో నలుగురు యువకులు ఇంజనీరింగ్‌ విద్యార్థులని ప్రాథమికంగా తెలుస్తోంది.

ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు .. బాలిక కు న్యాయం చెయ్యాలని డిమాండ్

ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు .. బాలిక కు న్యాయం చెయ్యాలని డిమాండ్


ఈ ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మాట్లాడుతూ ఇప్పటికే తమ సిబ్బందిని రంగంలోకి దించామని, ఆరుగురు నిందితులను గుర్తించామని వారిని అరెస్ట్ చేశామని వెల్లడించారు .నిందితుల్లో ముగ్గురు మైనర్లని ఆయన చెప్పారు. గ్యాంగ్ రేప్‌కు గురైన బాధితురాలిని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నాడు పరామర్శించారు. బాధితురాలికి అవసరమైన వైద్య సహాయం అందించాలని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.మరో వైపు ఈ ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ చెప్పారు. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తుంది.

Recommended Video

పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలి- జగన్
నాడు ఆసిడ్ దాడి కేసులో వై యస్సార్ సర్కార్ కీలక నిర్ణయం .. నేడు జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి

నాడు ఆసిడ్ దాడి కేసులో వై యస్సార్ సర్కార్ కీలక నిర్ణయం .. నేడు జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి


ఇక ప్రకాశం జిల్లాలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్‌పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామన్నారు.రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోపే స్పందించి నిందితులను అరెస్ట్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఒక పక్క బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన నేపధ్యంలో బాలికల రక్షణ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఇక ఈ నేపధ్యంలో జగన్ సర్కార్ ఎనిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. గతంలో వై ఎస్సార్ హయాంలో వరంగల్ లో స్వప్నిక ,ప్రణీతలపై జరిగిన యాసిడ్ దాడి కేసులో యాసిడ్ దాడి నిందితులను ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపధ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా జగన్ బాలికల మరియు మహిళల రక్షణ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతుంది.

English summary
The gangrape of a minor girl in Ongole has triggered huge debate yet again on the safety of young girls. Two persons named Balaji and Srikanth, along with their four other friends raped this 17-year-old girl from Nellapadu village of Guntur District for 7 days at a room in Ongole. With this being the major happening in YS Jagan's regime, everyone is looking forward to seeing what police will do to the offenders after they catch them. When the infamous acid hurling incident took place during the YSR regime, it is widely believed that the then AP CM got them killed in an encounter, though the official version has something else to say. So what will Jagan do now?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X