వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన.. జనం కోసం నిలబడుతుందా? పవన్ కి రహస్య ఎజెండా ఏమైనా ఉందా?

జనసేనలో అనుభవం ఉన్న నాయకులెవరూ ఈ పార్టీలో లేరు. పార్టీకి పనికొచ్చే నేతల కోసం ఉద్యోగస్తుల్లా ఇంటర్వ్యూలు, సెలక్షన్లు అంతే. ఓ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు ఇది సరిపోతుందా?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: జనసేన.. అది ఒక పార్టీ పేరుకాదు. వెల్లువెత్తిన ప్రజా ప్రభంజనం. ప్రజల భావోద్వేగాలతో ప్రతిధ్వనించే వేదిక. ఏ జిల్లాకు వెళ్లిన పవన్ కల్యాణే ప్రధాన పాత్రధారి.. సూత్రధారి. అనుభవం ఉన్న నాయకులెవరూ ఈ పార్టీలో లేరు. పార్టీకి పనికొచ్చే నేతల కోసం ఉద్యోగస్తుల్లా ఇంటర్వ్యూలు, సెలక్షన్లు అంతే. ఓ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు ఇది సరిపోతుందా? ఎన్నికల్లో పోటీ అధికారం గెలవటం వీటికిది చాల్తాయా?

జనసేన పార్టీ ఎటువైపు అడుగులు వేస్తోందో ఎవరికీ అర్థం కావడంలేదు.ఈ పార్టీ పెట్టి మూడేళ్లు అయినా ఇందులో అనుభవజ్ఞులు ఎవరూ కానరావడంలేదు. ఏం చేసినా అన్నీ పవన్ పేరిటే వస్తాయి. పార్టీ వ్యవహారాలు చూడ్డానికి అని కొంతమంది తప్పా, మరెవరూ ఈ పార్టీలో లేరు. ఈ స్థితిలో ఎన్నికలకు ఇప్పటినుంచే పవన్ సిద్ధమయ్యారు.

jenasena-pawan


ఓ పొలిటికల్ పార్టీలో చేరికకు ఎంట్రన్స్ టెస్టు పెట్టిన తొలి భారతీయ రాజకీయ నాయకుడు ఇయనే. మీడియాలో సబ్ ఎడిటర్లకు ఉండే లక్షణాలు ఉంటేచాలు.. ఈ పార్టీలో చేరిపోవచ్చు. అన్నగారి పార్టీ వ్యవహారం చూసిన పవన్...గోడ దూకే నాయకుల బెడద తప్పించుకోడానికి అప్రమత్తంగా ఉన్నారట. ఓ ప్రిన్స్‌పాల్లా అందరి బయోడేటాలు పరిశీలించి పార్లీలో అవకాశం ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వం పెట్టిన హైటెక్ నేత ఇయనే.

అయితే ఎన్నికలు వచ్చే వరకు ఇలాగే కాలయాపన చేసి, తీరా ఎన్నికలు వచ్చేసరికి పార్టీని అన్నగారి చేతిలో పెడతాడేమోనని కొందరి అనుమానం. లేదా లాభాన్ని ఇచ్చే పార్టీతో పొత్తు కుదుర్చుకుంటారా? అనేది మరో అనుమానం. మొత్తం మీద పవన్ రహస్య ఎజెండాపై అన్ని పార్టీలు తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.

English summary
Jena Sena party is still going under one man.. Pawan Kalyan. Except some meetings, some recruitments.. nothing is happening in this party. Is this exercise is enough for a political party which is going to prepare to contest it's candidates for the upcoming elections in 2019? Is this one man show will give best result to it's chief Pawan Kalyan? Or other wise is he had any secreat ajenda? In future what steps Pawan Kalyan is going to take to make strong his party?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X