విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి గుడ్‌బై..ఇక ఎప్పటికీ పెట్టుబడులు పెట్టం: యూఏఈ సంస్థ, కారణమేంటి..?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రాజెక్టులు రావా..? గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుతం జగన్ సర్కార్ రద్దు చేయడమే ఇందుకు కారణమా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన ప్రముఖ సంస్థ లులూ గ్రూప్. ఇంతకీ లులూ గ్రూప్ చెప్పిందేమిటి..? రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది..?

'సింగపూర్’ వెళ్లిపోవడం ఏపీకి శరాఘాతమే: జగన్ నిరంకుశపాలన వల్లేనంటూ చంద్రబాబు ఫైర్'సింగపూర్’ వెళ్లిపోవడం ఏపీకి శరాఘాతమే: జగన్ నిరంకుశపాలన వల్లేనంటూ చంద్రబాబు ఫైర్

పెట్టుబడులు వెనక్కు వెళ్లేందుకు కారణం ఏమిటి..?

పెట్టుబడులు వెనక్కు వెళ్లేందుకు కారణం ఏమిటి..?

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల విషయంలో ఆయా సంస్థలు వెనక్కు తగ్గుతున్నాయి. ఇందుకు కారణం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలే అని సమాచారం. చంద్రబాబు హయాంలో జరిగిన కొన్ని ఒప్పందాలను ఇప్పటికే జగన్ సర్కార్ రద్దు చేసింది. ఇందులో ప్రధానంగా అమరావతి అభివృద్ధికి సీఆర్‌డీఏ- సింగపూర్ కన్సార్టియం మధ్య జరిగిన ఒప్పందం రద్దు చేయడం జరిగింది. దీంతో సింగపూర్‌ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పేసినట్లయ్యింది. ఇక తాజాగా యూఏఈ కి చెందిన లులూ గ్రూప్ సంస్థ ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టమని తేల్చి చెప్పింది.

విశాఖలో లులూ గ్రూప్‌కు భూమి కేటాయింపు

విశాఖలో లులూ గ్రూప్‌కు భూమి కేటాయింపు

ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ ఏర్పాటుకు లులూ గ్రూప్ సంస్థకు విశాఖపట్నంలో భూమి కేటాయించింది చంద్రబాబు సర్కార్. అయితే భూమి కేటాయింపును రద్దు చేసింది ప్రస్తుత జగన్ ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో భూకేటాయింపు పారదర్శకంగానే జరిగిందని ఇప్పుడు జగన్ ప్రభుత్వం రద్దు చేయడం సరికాదని లులూ గ్రూప్ యాజమాన్యం వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి తాము అంగీకరిస్తామని చెబుతూనే... భవిష్యత్తులో ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టమని తేల్చి చెప్పింది.

ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లకు డబ్బులు చెల్లించాం

ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లకు డబ్బులు చెల్లించాం


భూకేటాయింపుకు పారదర్శకతతో కూడిన బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నామని చెప్పిన లులూ యాజమాన్యం తమకే ఆ భూమి లీజుపై దక్కిందని చెప్పింది. ఇప్పటికే ప్రాజెక్టు పనుల కోసం తాము ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లకు డబ్బులు చెల్లించామని, దీనివల్ల చాలా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు లులూ గ్రూప్ ఇండియా డైరెక్టర్ అనంత్ రామ్. ప్రభుత్వం చూపుతున్న కారణాలతో తాము అంగీకరిస్తున్నామని చెప్పిన అనంతరామ్ భవిష్యత్తులో ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని స్పష్టం చేశారు.

 2,200 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని భావించాం

2,200 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని భావించాం

యూఏఈ ప్రధాన కేంద్రంగా తమ కంపెనీ పనిచేస్తోందని ఏపీలో రూ.2,200 కోట్లు పెట్టుబడులు పెట్టి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావించినట్లు చెప్పారు అనంతరామ్. ఇందులోనే షాపింగ్ మాల్, ఫైవ్ స్టార్ హోటల్ కూడా నిర్మించి తద్వారా విశాఖపట్నంకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని భావించినట్లు అనంతరామ్ చెప్పారు. అంతేకాదు ఈ ప్రాజెక్టులు కార్యరూపందాల్చినట్లయితే 7వేల మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభించేవని గుర్తుచేశారు. ఇదిలా ఉంటే ఏపీ నుంచి నిష్క్రమిస్తున్న తాము తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, కేరళలో తమ ప్రాజెక్టులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని వెల్లడించారు.

13.83 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు సర్కార్

13.83 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు సర్కార్

అక్టోబర్ 30వ తేదీన ఏపీ ప్రభుత్వం లులూ గ్రూప్‌కు విశాఖపట్నంలో కేటాయించిన భూమిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 13.83 ఎకరాలను లులూ గ్రూప్‌కు కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు ఆ భూమిని వెనక్కు తీసుకుంది జగన్ సర్కార్. సముద్రంకు ఎదురుగా ఉన్న ఈ స్థలంలో ఒక కన్వెన్షన్ సెంటర్‌తో పాటు షాపింగ్ హబ్ నిర్మించాలని భావించింది. అయితే ఈ భూమి కేటాయింపుల్లో అవకతవకలు జరిగినందున రద్దు చేయాలని కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయించడం జరిగిందని సమాచారా పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు.

Recommended Video

AP Government Said A Good News For Farmers,Here Is the Full Details ! || Oneindia Telugu
 భూకేటాయింపుల్లో అవకతవకలు: పేర్నినాని

భూకేటాయింపుల్లో అవకతవకలు: పేర్నినాని

భూమికేటాయింపు సందర్భంగా గ్లోబల్ టెండర్లను పిలువకుండా విలువైన భూమిని చంద్రబాబు తనకిష్టమైన వారికి కట్టబెట్టారని పేర్నినాని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను ఉల్లంఘిస్తూ భూకేటాయింపు జరిగిందని నాని వివరించారు. ఎకరం రూ.4లక్షలకు లులూ గ్రూపు సంస్థకు కట్టబెట్టారని వాస్తవానికి మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉందని గుర్తు చేశారు పేర్ని నాని. ఇదిలా ఉంటే లులూ గ్రూపు సంస్థ ఆ స్థలంలో విలాసవంతమైన హోటల్, ఎగ్జిబిషన్ హాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం గత ఫిబ్రవరిలో శంకుస్థాపన కూడా చేసింది.

English summary
Snubbing the YSRCP government in Andhra Pradesh, UAE based Lulu Group Tuesday said that it will never invest in the state again after the government cancelled the allotment of land in Visakhapatnam to build an international convention centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X