వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌ పోటీ చేసేది పశ్చిమ గోదావరి నుంచా?...రాజకీయ పరిశీలకుల విశ్లేషణ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయమై రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశం అయింది. పవన్ పోటీ చేస్తే స్థానాన్ని బట్టి ఆ ప్రాంతంలో పవన్ ప్రభావం మరింత బలంగా ఉండొచ్చని ప్రత్యర్థి పార్టీలు అంచనా వేస్తున్నాయి.

Recommended Video

క్వారీ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

ఈ క్రమంలో సహజంగానే పవన్ పోటీ చేసే స్థానంపై అటు జనసేన పార్టీలోనే కాకుండా పవన్ ప్రత్యర్థి పార్టీల్లోనూ ఆసక్తి చోటుచేసుకుంది. అయితే ఇటీవలి కొన్ని పరిణామాలను బట్టి చూస్తే పవన్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారేమో అనే అభిప్రాయం రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పవన్‌ కల్యాణ్‌ కు సంబంధించి ఈ జిల్లాతో ముడిపడిన రెండు కీలక అంశాలను బట్టి అలా జరిగేందుకే అవకాశాలున్నాయనేది వీరి విశ్లేషణ.

ఆ రెండు...కీలక పరిణామాలు

ఆ రెండు...కీలక పరిణామాలు

పవన్ ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే ఏలూరు పోస్టల్‌ కాలనీలో ఓ ఇల్లును పవన్‌ పేరిట జనసేన నాయకులు అద్దెకు తీసుకున్నారు. తాజాగా ఇప్పుడు అదే ఇంటి చిరునామాతో పవన్ కళ్యాణ్ ఓటుహక్కు పొందారు. దీంతో పవన్‌ కళ్యాణ్ పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేస్తారనే విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఒక వేళ పశ్చిమ గోదావరి నుంచి పవన్ పోటీ చేస్తే ఏ నియోజకవర్గం నుంచి చేస్తారనే విషయమై ఆసక్తి నెలకొంది.

 పరిణామాలు..ప్రసంగం...ఊహాగానాలు

పరిణామాలు..ప్రసంగం...ఊహాగానాలు

అసలు ఈ ఊహాగానాలు, విశ్లేషణలు తెరమీదకి రావడానికి ఆయన గతనెల 27న భీమవరంలో జరిగిన పోరాట యాత్ర బహిరంగ సభలో చేసిన ప్రసంగం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో పవన్ ఏలూరులో అద్దె ఇల్లు తీసుకోవడం, ఓటు హక్కు పొందడంతో జనసేనలో, రాజకీయ శ్రేణుల్లో ఈ చర్చ ఊపందుకుంది.
పవన్ తన ప్రసంగంలో ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్న అనుబంధం, ఇక్కడి జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తు చేయడంతో పాటు...ఇక్కడే ఉండాలనిపిస్తోందనే ఆకాంక్షను వ్యక్తం చేయడం కూడా ఈ విశ్లేషణలకు కారణమైంది.

పవన్ కళ్యాణ్...ఏమన్నారంటే?

పవన్ కళ్యాణ్...ఏమన్నారంటే?

పవన్ కళ్యాణ్ భీమవరం బహిరంగ సభలో ఏమన్నారంటే..."మా తాత పెనుగొండలో పోస్టుమేన్‌గా పనిచేశారు...మా నాన్న మొగల్తూరులో కానిస్టేబుల్‌గా పనిచేశారు...మా నాన్న మాకున్న రెండెకరాల భూమిని ఆడపిల్లల పెళ్లిళ్లకోసం అమ్మేశారు...ఆ భూమి ఉంటే ఇక్కడే ఉండిపోయేవాడిని...మా పూర్వీకులు ఇక్కడే నివసించినా... నేనున్నది తక్కువ...చిన్నప్పుడు రెండు సార్లు వచ్చా. నరసాపురంలో తప్పిపోయా...అప్పట్లో కానిస్టేబుల్‌ రక్షించి మా నాన్నకు అప్పగించారు...మొగల్తూరులో చెట్టెక్కి జామకాయలు కోసిన తీపి జ్ఞాపకం ఇప్పటికీ గుర్తుంది...ఈ పచ్చని జిల్లాను చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తోంది. మా పూర్వీకుల మూలాలున్న ప్రాంతంగా ఈ జిల్లా అంటే ఎంతో అభిమానం. దీన్ని జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటా"...అని చెప్పారు.

 ఇక్కడి నుంచే...పోటీ చేయాలి

ఇక్కడి నుంచే...పోటీ చేయాలి

దీంతో పవన్‌ ఈ జిల్లా నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు ఊహగానాలు, విశ్లేషణలు చేస్తున్నారు...తమ విశ్లేషణలకు మద్దతుగా అనేక సమీకరణాలు చెబుతున్నారు. ఇదిలావుంటే పవన్ ను పాలకొల్లు నుంచి పోటీ చేయించాలని ఇక్కడి జనసేన అభిమానులు గట్టి పట్టుదలతో ఉన్నారు. కారణం గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అధినేత చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. అయితే అందుకు పరిహారంగా అదే స్థానం నుంచి పవన్‌ కల్యాణ్‌ను పోటీ చేయించి గెలిపించి తీరాలనే కసితో ఇక్కడి వారున్నట్లు తెలుస్తోంది. అలాగే సామాజిక వర్గం పరంగా కూడా పవన్‌ కల్యాణ్‌కు అండగా ఉండే ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో ఈ జిల్లాలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయమనే భావనలో ఆ నాయకులు ఉన్నారు.

అయితే గతంలో...అలా అన్నారు

అయితే గతంలో...అలా అన్నారు

అయితే కొందరు మాత్రం పవన్‌కల్యాణ్‌ అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే పవన్ తాజాగా ఏలూరులో ఓటుహక్కు నమోదు చేయించుకోవడంతో ఇక ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికలకు గడువు ఇంకా చాలా రోజులు ఉన్న నేపథ్యంలో అప్పటి రాజకీయ సమీకరణాలను బట్టి...అధినేత అంతరంగాన్ని బట్టి తుది నిర్ణయం ఉండవచ్చని మళ్లీ వాళ్లే సమాధానపడుతున్నారు. అయితే పవన్ పోటీ చేసే స్థానంపై వీలైనంత త్వరగా స్పష్టత వస్తే బాగుండని ఇతర పార్టీల నేతలు కోరుకుంటున్నట్లుగా తెలిసింది.

English summary
West Godavari:Interest in political circles about where Janasena's chief Pawan Kalyan will contest from...Political observers are analyzing that Pawan Kalyan will contest from West Godavari District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X