వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతేనా, వస్తారా?: పవన్ కళ్యాణ్ టు వరుణ్‌లకు యువత హెచ్చరిక, సవాల్

తమిళనాడులోని జల్లికట్టు ఉద్యమ ప్రభావం ఏపీ పైన కూడా పడుతోంది. జల్లికట్టు స్ఫూర్తితో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని రాజకీయ నాయకులు, సినీ తారలు కోరుకుంటున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తమిళనాడులోని జల్లికట్టు ఉద్యమ ప్రభావం ఏపీ పైన కూడా పడుతోంది. జల్లికట్టు స్ఫూర్తితో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని రాజకీయ నాయకులు, సినీ తారలు కోరుకుంటున్నారు.

ఆర్కే బీచ్..

ఆర్కే బీచ్..

సోషల్ మీడియా వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ వస్తున్న డిమాండ్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ జనవరి 26న జరగబోతున్న యువత ఆందోళనకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు.

వరుణ్ తేజ్ ట్వీట్

వరుణ్ తేజ్ ట్వీట్

మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తెలుగు రాష్ట్రాలకు మంచి కోరుతూ జరిగే ఈ ఆందోళనకు మద్దతుగా ట్వీట్టర్లో ట్వీట్ చేశారు. హీరో సంపూర్ణేష్ బాబు, తనిష్‌లు కూడా మద్దతు పలికారు. ఒక్కొక్కరుగా 26న జరగబోతున్న దీక్షకు మద్ధతు తెలుపుతున్నారు.

 అంతేనా, వస్తారా?: పవన్ కళ్యాణ్ టు వరుణ్‌లకు యువత హెచ్చరిక, సవాల్

అంతేనా, వస్తారా?: పవన్ కళ్యాణ్ టు వరుణ్‌లకు యువత హెచ్చరిక, సవాల్

అయితే టాలీవుడ్ హీరోలకు ఈ దీక్ష నేపథ్యంలో యువత ఓ సూటి ప్రశ్నను సంధిస్తోంది. మద్ధతు తెలుపుతున్నట్లు ప్రకటిస్తే సరిపోదని, దీక్షకు హాజరై తమ సచ్చీలతను నిరూపించుకోవాలని ఏపీ యువత సవాల్ విసురుతోంది.

జల్లికట్టు ఆదర్శంగా..

జల్లికట్టు ఆదర్శంగా..

జల్లికట్టు నిషేధంపై తమిళనాడు ప్రజలు చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని ఏపీ యువత కదం తొక్కుతోంది. తమిళనాడులో జరిగిన జల్లికట్టు నిషేధ వ్యతిరేక ఉద్యమానికి అక్కడి తమిళ హీరోలంతా మద్ధతు తెలిపారు. అంతేకాదు, అగ్రహీరోలంతా ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

టాలీవుడ్ కదలి రావాలని..

టాలీవుడ్ కదలి రావాలని..

దీంతో ఏపీలో జరుగుతున్న ఈ ఉద్యమానికి కూడా టాలీవుడ్ కదలి రావాలని, ట్వీట్స్, ఫేస్‌బుక్‌లో పోస్టులు చేసి చేతులు దులుపుకుంటే ఊరుకునేది లేదని ఏపీ యువత హెచ్చరిస్తోంది. పవన్ కూడా ఈ ప్రత్యేక హోదా సాధన దీక్షలో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

English summary
AP youth saying that Stars must participate in Special Status protest on January 26.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X