• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబు ఔట్, నేనే!: జగన్, రోజా ముచ్చట్లు(పిక్చర్స్)

By Srinivas
|

మంగళగిరి: సమర దీక్ష ముగింపు సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.

ప్రజా కెరటంలో కనుమరుగై కొట్టుకుపోతారన్నారు. బాబు ఏడాది కిందడ ఏం చెప్పారో, ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారన్నారు.

సమర దీక్ష ముగింపు సభలో జగన్.. సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు, టీవీల్లో ఇచ్చిన ప్రకటనలను ఎల్ఈడీ స్క్రీన్ల పైన చూపించారు. తాము అధికారంలోకి వస్తే రాజధాని కోసం టీడీపీ తీసుకున్న రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తామన్నారు.

 సమర దీక్ష

సమర దీక్ష

చంద్రబాబు మెడలు వంచైనా ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలుచేయిస్తామని జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. మంగళగిరి వై-జంక్షన్‌లో జగన్ చేపట్టిన రెండు రోజులు సమరదీక్ష గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

సమర దీక్ష

సమర దీక్ష

సమరదీక్ష చేస్తున్న జగన్‌కు పలువురు రైతులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడారు. చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో యాదృచ్ఛికంగా వ్యక్తంచేసిన మాటలను జగన్ ప్రజలకు వివరించారు.

సమర దీక్ష

సమర దీక్ష

సమైక్యాంధ్రలో ఇచ్చిన వాగ్దానాలను ప్రస్తుతం అమలుచేసే పరిస్థితి లేదని బాబు చెప్పడంపై మండిపడ్డారు. ప్రతి ఇంటికీ ఉద్యోగం, లేని పక్షంలో 2,500 రూపాయల భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో బాబు వాగ్దానం చేశారన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల సమయంలో రెండు మేనిఫెస్టోలు విడుదల చేశారన్నారు.

 సమర దీక్ష

సమర దీక్ష

ప్రజలకు ఇస్తున్న హామీలను పూర్తి అవగాహనతోనే చేసినట్లు ఎన్నికల కమిషన్‌కు లిఖితపూర్వకంగా లేఖ రాశారన్నారు. ఎన్నికల తర్వాత అధికారం కైవసం చేసుకుని ప్రస్తుతం ప్రజలు, రైతులు, మహిళలు, యువతతో నాకేం పని అన్నట్లు వ్యవహరించడాన్ని తప్పుబట్టారు.

సమర దీక్ష

సమర దీక్ష

ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతా వలయం దాటి ప్రజల్లోకి వెళితే రాళ్లతో కొట్టే రోజులు వచ్చాయని జగన్ అన్నారు. సెక్యూరిటీని వదిలి గ్రామాల్లో తిరగాలంటూ జగన్ సవాల్ విసిరారు.

 సమర దీక్ష

సమర దీక్ష

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సిఎం చంద్రబాబుకు 90 కోట్ల రూపాయలు ఎక్కడినుండి వచ్చాయని జగన్ ప్రశ్నించారు. తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఐదు కోట్లకు బేరం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ పట్టుబడిన వ్యవహారం అందరికీ తెలిసిందేనన్నారు.

 సమర దీక్ష

సమర దీక్ష

బాస్‌తో మాట్లాడమని ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడించడం కూడా ప్రజలందరూ గుర్తించారన్నారు. ఇంకా ఎక్కువ కావాలంటే నగదు ఇస్తామని చెప్పడం కూడా ఈ సందర్భంగా ప్రజలు గుర్తించాలన్నారు. 18 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక్కొక్కరికీ 5 కోట్లు చొప్పున 90 కోట్లు అవుతుందని, ఈ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని సూటిగా ప్రశ్నించారు.

 సమర దీక్ష

సమర దీక్ష

ప్రత్యేకహోదాపై మాట్లాడే సమయంలో సిఎం చంద్రబాబు ఇంగ్లీషులో, హిందీలో తిట్టడని జగన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీకి వినపడితే ఎక్కడ ఇబ్బంది పెడతారో అనే భయంతో ప్రజలకు చెప్పిన మాటలను మరచి సిఎం వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

సమర దీక్ష

సమర దీక్ష

రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని జగన్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఉన్న ఇళ్లు, స్థలాలు లాక్కుంటే ఎలా ఉంటుందో గుర్తించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే రెండు మూడేళ్లకు మించి ముఖ్యమంత్రి అధికారంలో కొనసాగే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. ఎన్నికలు జరిగితే మేమే అధికారంలోకి వస్తామని, అప్పుడు రైతులకు భూములు తిరిగి ఇస్తామన్నారు.

సమర దీక్ష

సమర దీక్ష

ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. పైనుంచి దేవుడు చూస్తున్నాడని, ప్రజల నుంచి ఒక కెరటం లేచి అధికారంలో ఉన్న చంద్రబాబును బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు.

English summary
Launching a scathing attack on TDP government as it completes a year in office, YSR Congress president YS Jaganmohan Reddy on Thursday asserted that the wave of popular upsurge against the government would drown Chief Minister Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X