సమంత- నాగచైతన్య మళ్లీ కలుస్తారా : సామ్ తాజా నిర్ణయం వెనుక - ఏం జరుగుతోంది..!!
ఆ ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారా. అది జరిగే అవకాశం ఉందా. అసలు ఈ చర్చ ఇప్పుడు ఎందుకు మొదలైంది. అవును. సమంత - నాగచైతన్య మళ్లీ కలిసే అవకాశం ఉందా అనే చర్చ టాలీవుడ్ సర్కిల్స్ లో మొదలైంది. వీరిద్దరి డైవర్స్ వ్యవహారానికి ముందు పెద్ద ఎత్తున కథనాలు బయటకు వచ్చాయి. ఆ తరువాత జరిగిన ప్రచారాన్ని నిజం చేస్తూ సమంత - నాగచైతన్య అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ దారులు వేరని, ఇకమీదట తాము దంపతులుగా జీవించబోమని వెల్లడిస్తూ అభిమానులకు షాకిచ్చారు.

టాలీవుడ్ లో కొత్త చర్చ
ఆ తరువాత పలు ఇంటర్వ్యూలకు హాజరైన సమంత బాగా ఎమోషనల్ గా కనిపించారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లి వచ్చారు. ఇక, కొద్ది రోజుల క్రితం బంగార్రాజు మూవీ విడుదలకు ముందు నాగ చైతన్య సైతం తామిద్దరం విడిపోయినా.. ఎవరికి వాళ్లు బాగానే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. వరుస ఆఫర్లతో ఇద్దరూ ఆ బాధను మరచి..ఇద్దరూ మామూలవటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది. తిరిగి సమంత - చైతన్య ఒక్కటి అయ్యే అవకాశం ఉందనేది దాని సారాంశం. తాజాగా సామ్ ఇన్స్టాగ్రామ్ నుంచి విడాకుల ప్రకటనను తొలగించింది.

సమంత ఆ పోస్టు డిలేట్ చేయటంతో
దీంతో అభిమానుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. అసలు వీరిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం మొదలవ్వటానికి కారణం కూడా వారి సోషల్ మీడియా ఖాతాలే. సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు పక్కన అక్కినేని అనే ఇంటి పేరు తొలిగించటంతో ఆ చర్చ మొదలైంది. ఇక, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి విడాకుల ప్రకటనను తొలగించిటంతో తిరిగి కలుస్తున్నారా అంటూ ఆసక్తి కర చర్చకు తెర లేచింది. అసలు సమంత ఆ పోస్టును ఎందుకు డిలీట్ చేసారంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. తిరిగి కలిసేందుకు ఇద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారా..లేక, మరేదైనా కారణంతో ఆ పోస్టు డిలేట్ చేసారా అనేది ఇప్పుడు చర్చ సారాంశం.

తిరిగి కలుస్తారా - అదే జరిగితే
నిజంగానే వీళ్లకు కలిసిపోయే ఉద్దేశ్యం ఉంటే చైతూ కూడా ఆ పోస్ట్ డిలీట్ చేసే వాడంటూ మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత పొరపాటునో..ఇంకా ఎక్కువ కాలం ఆ పోస్టు ఉంచాల్సిన అవసరం లేదనే ఆ పోస్టింగ్ డిలేట్ చేసి ఉంటారంటూ మరి కొందరు తమ వాదన వినిపిస్తున్నారు. అయితే, నిజంగా వాళ్లిద్దరూ తిరిగి ఒక్కటయితే..వారి కుటుంబ సభ్యుల కంటే వారి అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతారు.

కొత్త సినిమాలతో ఇద్దరూ బిజీగా
తాజాగా.. సమంత 'పుష్ప'లో స్పెషల్ సాంగ్ చేసి అదరహో అనిపించింది. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా మూవీ యశోద, శాకుంతలం సినిమాలతో పాటు ఓ హాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో కూడా మూడు చిత్రాలు చేసేందుకు సైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ సమయంలోనే వారిద్దరి కలిసి చూడాలనేది అభిమానుల ఆశ. మరి..ఇప్పుడు మొదలైన ప్రచారం వాస్తవ రూపం దాల్చుతుందా.. లేక, ప్రచారానికే పరిమితం అవుతుందా అనేది వేచి చూడాల్సిందే.