వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద‌క్షిణ భార‌తంలో పాగా వేసేందుకు అమీత్ షా క‌స‌ర‌త్తు..! అందుకే ఏపీలో ఆ స‌ర్వే...!

|
Google Oneindia TeluguNews

ఆంద్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాలు రోజుకో రంగుపులుముకుంటున్నాయి. ఈ రోజు ఉన్న ప‌రిస్థితులు తెల్ల‌వారే లోపు మారిపోతున్నాయి. ఏ పార్టీని ఎవ‌రు విమర్శిస్తారో, ఏ పార్టీని ఎవ‌రు ప్ర‌శంసిస్తారో తెలియ‌ని ప‌రిస్థిలు నెల‌కొన్నాయి. ఏ పార్టీ ప‌రిస్తితి ఎలా ఉన్న‌ప్ప‌టికి ఏపిలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ప్ర‌భావాన్ని ఖ‌చ్చితంగా చూపాల‌నుకుంటోంది భార‌తీయ‌జ‌న‌తా పార్టీ. స్థానిక పార్టీల‌తో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి ధీటైన జ‌వాబు చెప్పాల‌ని ప్రణాళిక‌లు రచిస్తోంది. మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడిపి, బీజెపి పార్టీలు విభ‌జ‌న హామీల అమ‌లులో త‌లెత్తిన విభేదాల‌తో ప‌ర‌స్ప‌ర శ‌త్రువులుగా మారిపోయిన విష‌యం తెలిసింందే..! తెలుగుదేశం పార్టీ చూపిస్తున్న తెగువ‌కు అవాక్క‌వుతున్న బీజెపి అగ్ర‌నాయ‌క‌త్వం ఆంద్ర‌ప్ర‌దేశ్ లో బ‌లోపేతం అయ్యే అంశాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భావం చూపించ గ‌లిగితే ద‌క్ష‌ణ భార‌త‌దేశంలో స‌త్తాచూపిన‌ట్టేన‌ని బీజెపి భావిస్తోంది. అందుకోసం అమీత్ షా బ్రుందం ఓ ర‌హ‌స్య స‌ర్వేను కూడా నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది.

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తా చూపాలి.. అందుకోసం ఇప్ప‌టినుండే క‌ష్ట‌ప‌డాలంటున్న అమీత్ షా..!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తా చూపాలి.. అందుకోసం ఇప్ప‌టినుండే క‌ష్ట‌ప‌డాలంటున్న అమీత్ షా..!

విభజన హామీల విషయంలో మాట త‌ప్పిందనే కారణంతో ఏపీలో బీజేపీ దోషిలా మిగిలిపోయింది. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆ పార్టీ. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలపడాలని భావించింది. అయితే, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి బీజేపీకి కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన ద్రోహాన్ని వివరించడంలో సక్సెస్ అవడంతో ఆ పార్టీ మనుగడను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది.

తెలుగుదేశం పార్టీని ఎలాగైనా త‌రిమేయాలి..! అదే ల‌క్ష్యంగా ప‌ని చేయాలి..!

తెలుగుదేశం పార్టీని ఎలాగైనా త‌రిమేయాలి..! అదే ల‌క్ష్యంగా ప‌ని చేయాలి..!

కొన్నాళ్ల క్రితం రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగేలా ఆ పార్టీ నేతలను సన్నద్ధం చేసింది బీజేపీ అధిష్టానం. ఇందులో భాగంగానే కొన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంది ఆ పార్టీ. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాడంతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదుర‌య్యే పోటీని ధీటుగా ఎదుర్కోవాలని భావిస్తున్న ఆ పార్టీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం జాతీయ నేతలతో చర్చలు కూడా జరిపారని, అందులోని ముఖ్య నేతలు ఇచ్చిన సూచనల మేరకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

అమీత్ షా ర‌హ‌స్య స‌ర్వే ఏంచెబుతోంది..! నేత‌ల్లో ఎందుకు ఉత్కంఠ‌..!!

అమీత్ షా ర‌హ‌స్య స‌ర్వే ఏంచెబుతోంది..! నేత‌ల్లో ఎందుకు ఉత్కంఠ‌..!!

ఇందులో భాగంగానే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుందనే దానిపై ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఏపీలో రహస్య సర్వే నిర్వహించినట్లు సమాచారం. తాజా పరిస్థితులపై రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్ర మంత్రులు, టీడీపీ నాయకుల విమర్శలను పార్టీ నాయకులు ఎలా తిప్పికొడుతున్నారు? కేంద్ర పథకాల అమలుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు..? మీ నియోజకవర్గంలోని బీజేపీ నేత ఎలా పని చేస్తున్నారు..? వంటి తదితర అంశాలపై బీజేపీ అధినేత అమిత్‌షా కూడా ఓ రహస్య సర్వే చేయించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

 ఏపిలో పొత్తు ఉంటుంది..! టీడిపి కి చుక్క‌లు చూపిస్తామంటున్న బీజెపి నాయ‌కులు..!!

ఏపిలో పొత్తు ఉంటుంది..! టీడిపి కి చుక్క‌లు చూపిస్తామంటున్న బీజెపి నాయ‌కులు..!!

ఆ సర్వే ఆధారంగానే రాష్ట్రంలోని బీజేపీ పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ సర్వే ఫలితాల విషయంలో ఆ పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతలు తెగ టెన్షన్ పడుతున్నారట. సర్వే ఫలితాల్లో తమ పట్ల ఎటువంటి ఫీడ్‌బ్యాక్ వస్తుందోనని ఆ నేతలు భయపడిపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ ఏం చేసినా ఏపీలో నెగ్గుకురావడం కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. మరి భవిష్యత్‌లో ఆ పార్టీ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునే అవకాశాలూ లేకపోలేదని టాక్ వినిపిస్తుంది.

English summary
bjp national president amith shah focused on ap. amith planning in the next general elections bjp has to pickup and show its influence in ap. for that purpose he made a secret survey in ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X