వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం వైఎస్ జగన్ కు స్టీఫెన్ రవీంద్ర షాక్ ఇస్తారా? ఏపీకి రావటానికి డైలమాలో .. రీజన్ ఇదేనా?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర షాక్ ఇవ్వనున్నారా ? తెలంగాణలో ఉన్న స్టీఫెన్ రవీంద్రను డిప్యుటేషన్ మీద ఏపీకి తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు ఏపీకి రావడానికి ఆసక్తి చూపించడం లేదా ? స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం డైలమాలో ఉన్నారా ? ఏపీ క్యాడర్లో ఉన్నత పదవిని ఇచ్చి స్టీఫెన్ రవీంద్ర తో పని చేయించుకోవాలి అనుకున్న జగన్ కు ఆయన తీరు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

స్టీఫెన్ కోసం సీఎం జగన్ ప్రయత్నం .. కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్

స్టీఫెన్ కోసం సీఎం జగన్ ప్రయత్నం .. కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ క్యాడర్ లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకురావడం కోసం సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. ఇక కేంద్రం నుండి ఆమోద ముద్ర వేయించుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నం చేశారు. వైసిపి ఎంపీలను రంగంలోకి దింపి అమిత్ షా తో మాట్లాడి తెలంగాణ కేడర్ లో పని చేస్తున్న స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మిని ఏపీ క్యాడర్ లో తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేశారు. అయితే మొత్తానికి సీఎం జగన్, వైసీపీ ఎంపీలు చేసిన ప్రయత్నానికి కేంద్ర సర్కార్ ఒక్క స్టీఫెన్ విషయంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌ గా స్టీఫెన్ అని ప్రచారం

ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌ గా స్టీఫెన్ అని ప్రచారం

తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించనున్నారు అని, కేంద్రం ఆమోదం తెలపడంతో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. త్వరలోనే స్టీఫెన్ రవీంద్ర ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారని భావించి నాలుగు నెలలు కావస్తున్నా స్టీఫెన్ రవీంద్ర రాకపై మాత్రం ఇంకా నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆయన రాక అనుమానమే అన్న భావన ఏపీ ఉన్నత వర్గాల్లో వ్యక్తం అవుతుంది .

స్టీఫెన్ రవీంద్ర రాకపై డైలమా

స్టీఫెన్ రవీంద్ర రాకపై డైలమా

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర, నాడు పరిపాలనలో ఉన్నతాధికారిగా తన మార్క్ చూపించారు. రాయలసీమలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక, జగన్ సీఎం అయినప్పటి నుంచి స్టీఫెన్ రవీంద్ర కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కేంద్రాన్ని కూడా ఒప్పించి, తీరా మార్గం సుగమం అయిన తర్వాత స్టీఫెన్ రాకపై డైలమా నెలకొనడంతో ఇప్పుడు ఏపీ ఉన్నతాధికార వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

జగన్ ఆఫర్ ని నిరాకరిస్తున్న స్టీఫెన్ రవీంద్ర ?

జగన్ ఆఫర్ ని నిరాకరిస్తున్న స్టీఫెన్ రవీంద్ర ?

తెలంగాణ క్యాడర్‌లో ఉన్న స్టీఫెన్ రవీంద్రతో పాటు, జగన్ అక్రమాస్తుల కేసుల్లో జైలు పాలైన శ్రీలక్ష్మిని కూడా ఏపీకి డిప్యూటేషన్‌పై ఏపీకి తీసుకోవాలని భావించి కేంద్ర డీవోపీటీ అనుమతి కోసం చాలా ప్రయత్నం చేసింది వైసిపి ప్రభుత్వం. కేంద్రం కూడా స్టీఫెన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక వివిధ కారణాలతో స్టీఫెన్ రవీంద్ర డిప్యూటేషన్‌కు నిరాకరిస్తున్నట్లుగా సమాచారం.తాను తెలంగాణ క్యాడర్‌లోనే ఉంటానని ఆయన చెప్తున్న పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి అంతుచిక్కడం లేదు. ఆయనకు కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ పోస్టు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించినా,స్టీఫెన్ రవీంద్ర మాత్రం అంత పెద్ద పదవిని కూడా వద్దని వెనక్కి తగ్గుతున్నారని సమాచారం.

జగన్ నిర్ణయాలతో ఏపీలో ఉన్నతాధికార వర్గాల్లో తీవ్ర ఒత్తిడే కారణమా ?

జగన్ నిర్ణయాలతో ఏపీలో ఉన్నతాధికార వర్గాల్లో తీవ్ర ఒత్తిడే కారణమా ?


ఇక స్టీఫెన్ రవీంద్ర తాజా నిర్ణయానికి అనేక కారణాలు ఉన్నట్టుగా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార యంత్రాంగం తాజా పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలావరకు వివాదాస్పదంగా మారడంతో అధికారులు కూడా కోర్టు మెట్లు ఎక్కవలసిన పరిస్థితి వస్తోంది. ఇక ఈ సమయంలో కీలకమైన పోస్టుల్లో ఉండకపోవడమే మంచిదని చాలా మంది అధికారులు భావిస్తున్న నేపథ్యంలోనే స్టీఫెన్ రవీంద్ర కూడా డిప్యుటేషన్ పై ఏపీకి రావడానికి ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

Recommended Video

Family Recovered From Corona Without Going To Hospital
 ఏపీలో అన్నీ వివాదాలుగా మారటమే స్టీఫెన్ డైలమా కు రీజన్ అని చర్చ

ఏపీలో అన్నీ వివాదాలుగా మారటమే స్టీఫెన్ డైలమా కు రీజన్ అని చర్చ

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా ఉంది. ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి తీసుకున్న నిర్ణయాలు, విడుదల చేస్తున్న జీవోలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీ నాయకులే కాకుండా, ఉన్నతాధికారులు కూడా టార్గెట్ గా మారుతున్నారు. ఒకవేళ స్టీఫెన్ రవీంద్ర ఏపీకి వస్తే ముఖ్యమంత్రిగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సి వస్తుంది. ఇక ఆ నిర్ణయాలతో లేనిపోని వివాదాలు నెలకొంటే ఉన్నతాధికారిగా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ క్యాడర్ లో ప్రశాంతంగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా మంచి అవకాశం ఇస్తున్నప్పటికీ డిప్యుటేషన్ పై రావడానికి ఆసక్తి చూపించడం లేదని, ప్రస్తుతం ఆయన డైలమాలో ఉన్నారని సమాచారం.

English summary
Telangana IPS Stephen Ravindra currently in the Dilemma? Jagan planned to work with Stephen Ravindra to give him a higher position as intelligence Chief in the AP cadre is now questionable with Stephen's decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X