అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ఇల్లును కూడ తొలగిస్తాం: మంత్రి నారాయణ షాకింగ్ కామెంట్స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి అడ్డంకులు తొలగిపోయాయి. అమరావతి నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యులన్ ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తామని ఏపీ రాష్ట్ర మంత్రి పి.నారాయణ ప్రకటించారు. కృష్ణా నదికి వంద మీటర్ల లోపు సీఎం ఇల్లు ఉంటే తొలగిస్తామని ఆయన ప్రకటించారు.

Recommended Video

AP CM Chandrababu Naidu Fired At Leaders For Intintiki Telugudesam Issue | Oneindia Telugu

రాజధాని నిర్మాణానికి సంబందించి శుక్రవారం నాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి అనుమతులు మంజూరు చేసింది. అమరావతిలో రాజధాని నిర్మాణం పేరుతో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

రాజధాని నిర్మాణంపై ఇప్పటికే డిజైన్లకు ఏపీ సీఎం ఆమోదముద్ర వేశారు. లండన్‌కు వెళ్ళి డిజైన్లను పరిశీలించి వచ్చారు. చంద్రబాబునాయుడు ఈ డిజైన్లకు ఆమోదం తెలిపినందున పనులు కూడ త్వరలోనే ప్రారంభమయ్యేలా సర్కార్ చర్యలు చేపట్టనుంది. అయితే సింగపూర్ సర్కార్‌తో ఒప్పందం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం అనుమతుల మేరకు పనులు జరగనున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై మంత్రి నారాయణ శుక్రవారం సాయంత్రం స్పందించారు.

సీఎం ఇల్లున్నా తొలగిస్తాం

సీఎం ఇల్లున్నా తొలగిస్తాం


అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు మంజూరు చేసింది. రాజధాని నిర్మాణంపై ఎన్జీటీ ఆదేశాలు పాటిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కృష్ణా నదికి 100 మీటర్ల లోపు ఉన్న భవనాలు తొలగిస్తామని, నదికి 100 మీటర్ల లోపు సీఎం ఇల్లు ఉంటే తొలగిస్తామని చెప్పారు. స్టార్టప్‌ ఏరియాలో 1691 ఎకరాల్లో ప్లాట్ల అమ్మకం చేపట్టామన్నారు.

రోడ్ల నిర్మాణం చేపడుతాం

రోడ్ల నిర్మాణం చేపడుతాం


కేపిటల్‌ సిటిలో ఏడాదిలో రహదారుల నిర్మాణం చేపడుతామని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. పర్యావరణానికి హాని కలుగుతుందన్న పిటిషన్‌ను ఎన్జీటీ తోసిపుచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖ విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే.. జప్తు చేసేందుకు రూ. కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతుల పట్ల హర్షం

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతుల పట్ల హర్షం

ఎన్జీటీ నుంచి రాజధానికి అనుమతులు రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి నారాయణ. ట్రిబ్యునల్ తీర్పుతో రాజధానికి అడ్డంకులు తొలగి పోయాయని మంత్రి నారాయణ అభిప్రాయపడ్డారు. పర్యావరణ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటామని చెప్పారు.

త్వరితగతిన పనులు

త్వరితగతిన పనులు

రాజధాని నిర్మాణానికి ఇబ్బందులు తొలగిపోయాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అమనుతులు మంజూరు చేసింది. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన సూచనలను పాటిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సూచనల మేరకు పనులు ప్రారంభించకపోతే జరిమానాను విధిస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. అయితే ఈ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు సర్కార్ చర్యలను తీసుకొంటుంది.

English summary
The State government would abide by the terms and conditions put down in the detailed project report (DPR) of the 217-square kilometre capital meticulously as instructed by the National Green Tribunal, Minister for Municipal Administration P. Narayana said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X