వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరి చూపూ చంద్రబాబు వైపే: ఎన్టీఆర్ బయోపిక్‌లో అదికూడా ఉంటుందా లేదా..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు పొత్తు అంశం ? | Oneindia Telugu

నందమూరి బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో నందమూరి వారసులు కనిపించనున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ చిత్రం ప్రజలకు కనెక్ట్ అవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అలా కాకుంటే స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తారా... అనేది సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి 2019 ఎన్నికలకు ముందే ఈ సినిమా విడుదల చేసేందుకు యూనిట్ రంగం సిద్ధం చేస్తోంటే తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్‌ సినిమా అనుకున్నది అనుకున్నట్లుగానే రిలీజ్ చేస్తే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

కాంగ్రెస్ మూడవ జాబితా విడుదల: ఎట్టకేలకు పొన్నాల పేరు... అసంతృప్తితో మర్రిశశిధర్ రెడ్డి కాంగ్రెస్ మూడవ జాబితా విడుదల: ఎట్టకేలకు పొన్నాల పేరు... అసంతృప్తితో మర్రిశశిధర్ రెడ్డి

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు... సింపుల్‌గా ఎన్టీఆర్. తెలుగు చరిత్రను, తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన మహోన్నతుడు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తెలుగు ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన ఈ ఆజానుబాహుడు... నాడు రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో మగ్గుతుంటే, తెలుగు ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్. నాటి కాంగ్రెస్ పాలకులకు చరమగీతం పాడి తెలగునేలను ఢిల్లీ నిర్ణయాలు పరిపాలించకూడదని తెలుగుదేశం పేరుతో పార్టీని ప్రకటించారు. ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అనే సిద్ధాంతపై తెలుగు దేశం పార్టీని స్థాపించారు ఎన్టీరామారావు. పార్టీ స్థాపించిన 9నెలలకే అఖండ మెజార్టీతో విజయం సొంతం చేసుకున్నారు. తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ నేత నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కారు. ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ ఎవరైనా చేయాలంటే అది సాహసమే అవుతుంది. ఈ సాహసాన్ని ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ చేస్తున్నారు.

కాంగ్రెస్‌పై పరుషపదజాలం వినియోగించిన సీనియర్ ఎన్టీఆర్

కాంగ్రెస్‌పై పరుషపదజాలం వినియోగించిన సీనియర్ ఎన్టీఆర్


ఎన్టీఆర్ సినిమా జీవితం నాణేనికి ఒకవైపే అయితే... రాజకీయ జీవితం మరోవైపు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ పొలిటికల్ లైఫ్ ఈ సినిమా ద్వారా మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటికే దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో భాగంగా తను తెలుగుదేశం పార్టీ స్థాపించిందే కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా అనే లైన్‌పై చిత్రీకరించారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో బాలయ్యకు చిక్కులు తెచ్చి పెట్టింది. కొన్ని రాజకీయ పరిస్థితులు మారడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతో రాజకీయంగా ఆ పార్టీ చిక్కుల్లో కూరుకుని పోయే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే నాడు కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ తీవ్ర పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ పార్టీ దుష్ట కాంగ్రెస్ అని అనడంతో పాటు... కుక్క మూతి పిందెలు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక వాస్తవానికి షూటింగ్ ప్రారంభం అయ్యేవరకు తాము అనుకున్న లైన్‌లోనే సినిమాను చిత్రీకరిస్తూ వచ్చారు దర్శకుడు క్రిష్. అయితే ఒక్కసారిగా చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదురుకోక తప్పదని చిత్ర యూనిట్ భావించడంతో మళ్లీ స్క్రిప్ట్‌ను మార్చే పనిలో పడినట్లు సమాచారం.

టీడీపీ పొత్తు నేపథ్యంలో కథలో మార్పులు చేర్పులు?

టీడీపీ పొత్తు నేపథ్యంలో కథలో మార్పులు చేర్పులు?

కాంగ్రెస్‌ను దూషించాల్సి వచ్చిన చోట అంతా 'కేంద్రం ' అనే పదాన్ని చేర్చినట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధిచి మొదటి భాగం పూర్తిగా ఆయన సినిమా జీవితానికి సంబంధించి ఉంటే... రెండో భాగం ఆయన రాజకీయ జీవితానికి సంబంధించింది. రెండో భాగంలో నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్‌ను గద్దెదింపి తాను ముఖ్యమంత్రి అయ్యే సన్నివేశాలతో పాటు తిరిగి ఎన్టీఆర్ సీఎం అయ్యేవరకు సన్నివేశాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎంట్రీ, వైశ్రాయ్ హోటల్ వద్ద నాడు చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్టీఆర్‌ను చంద్రబాబు గద్దెదింపడంలాంటి సన్నివేశాలు ఇందులో కనిపించవు. బాలకృష్ణ మాత్రం సినిమా జీవితం నుంచి ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీకి తొలిసారిగా సీఎం అయ్యేవరకు సన్నివేశాలను తెరకెక్కించి సినిమాను ముగించేయాలని భావించారట. ప్రస్తుతం తాజా రాజకీయపరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం, పలువురు సీనియర్ నేతలు దీన్ని బాహాటంగానే విమర్శిస్తుండటం మధ్య సినిమా విడుదలైతే రాజకీయంగా చంద్రబాబుకు కష్టాలు తప్పవనే అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు.

 కాంగ్రెస్ టీడీపీ పొత్తును వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో తెరకెక్కిస్తారా...?

కాంగ్రెస్ టీడీపీ పొత్తును వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో తెరకెక్కిస్తారా...?


నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చేస్తుంటే... రాంగోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా ఎన్నికల సమయంలోనే విడుదల అవుతుందనే వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏమైతే అంశాలు లేదా సన్నివేశాలు ఉండవో వాటినే రాంగోపాల్ వర్మ తన సినిమాలో చేరుస్తున్నట్లు సమాచారం. అంటే లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకోవడం, వైశ్రాయ్ హోటల్ సన్నివేశం, ఎన్టీఆర్‌ను గద్దె దింపి చంద్రబాబు సీఎం పదవిని అధిష్టించడం, ఆ తర్వాత మానసికంగా వేదనకు గురైన ఎన్టీఆర్ మృతి చెందడంలాంటివి రామ్‌గోపాల్ వర్మ తన చిత్రంలో చూపించనున్నట్లు సమాచారం. అంతేకాదు చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం కూడా రామ్‌గోపాల్ వర్మ తన చిత్రంలో చూపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

 క్రిష్ వర్సెస్ వర్మ..ప్రజలు దేనికి కనెక్ట్ అవుతారు..?

క్రిష్ వర్సెస్ వర్మ..ప్రజలు దేనికి కనెక్ట్ అవుతారు..?


రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కూడా ఎన్నికల సమయంలోనే విడుదలవుతుందని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు దేనికి కనెక్ట్ అవుతారనేది చాలా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపించి ఎన్టీఆర్ తొలిసారి సీఎం అయ్యేవరకు చూపించే క్రిష్ సినిమాకు కనెక్ట్ అవుతారా... లేక ఎన్టీఆర్‌ను గద్దెదింపి చంద్రబాబు సీఎం అవడం.. తాజాగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వరకు చూపించనున్న వర్మ సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు కనెక్ట్ అవుతారా అనేది తెలుసుకోవాలంటే రెండు సినిమాలు విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

English summary
TDP founder NTR biopic is completing its shooting at jet speed. NTR's son Balakrishna is playing the lead role. Speculations are rife that the script is being changed as the TDP has entered into alliance with congress. Balakrishna is seeing this as a threat to the TDP as the party itself was formed against the policies of congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X