విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెంట్రల్ ముసలం, వైసీపీకి షాక్: జగన్‌పై ఆగ్రహం.. పార్టీకి వంగవీటి రాజీనామా!

|
Google Oneindia TeluguNews

Recommended Video

వైసిపి కి తలనొప్పిగా మారిన విజయవాడ సెంట్రల్ సీటు

విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవా సెంట్రల్ సీటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ రోజు (17-09-2018) నుంచి గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధిష్టానం పిలుపునిచ్చింది. సెంట్రల్లో కార్యక్రమం చేయనని మల్లాది విష్ణు చెప్పారు. దీంతో మరోసారి రగడ ప్రారంభమైంది.

విజయవాడ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో గడపగడపకూ వైసీపీ కార్యక్రమం ప్రారంభమైంది. సెంట్రల్ కార్యక్రమానికి మల్లాది విష్ణు, వంగవీటి రాధాకృష్ణలు దూరంగా ఉన్నారు. దూరం జరగడానికి ఇరువురు నేతలు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. రాధాని ఎంపీగా పోటీ చేయమని చెప్పడంతో అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. వంగవీటి రాధాకృష్ణను బుజ్జగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. బెజవాడ రాజకీయం అప్పుడే వేడెక్కుతోంది.

మల్లాది విష్ణుకు సంకేతాలు, అలిగివెళ్లిన వంగవీటి రాధా: అధిష్టానం హెచ్చరిక మల్లాది విష్ణుకు సంకేతాలు, అలిగివెళ్లిన వంగవీటి రాధా: అధిష్టానం హెచ్చరిక

వైసీపీలో ముసలం, టిక్కెట్ ఇవ్వలేదని పార్టీకి రాజీనామా

వైసీపీలో ముసలం, టిక్కెట్ ఇవ్వలేదని పార్టీకి రాజీనామా

బెజవాడ సెంట్రల్ సీటు కారణంగా వైసీపీలో ముసలం ప్రారంభమైంది. వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఉయ్యూరు కౌన్సెలర్, జిల్లా ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. ఈ రెండు పదవులకు ఆయన రాజీనామా చేశారు. విజయవాడ సెంట్రల్ టిక్కెట్ రాధాకృష్ణకు ఇవ్వకపోవడంపై అసంతృప్తికి లోనై పార్టీకి రాజీనామా చేశారు.

జగన్‌పై అసంతృప్తి

జగన్‌పై అసంతృప్తి

సెంట్రల్ టిక్కెట్ విషయంలో పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై అసంతృప్తితో ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు. మరోవైపు తనకు సెంట్రల్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో వంగవీటి రాధాకృష్ణ తన కుటుంబ సభ్యులు, అనుచరులు, పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.

మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారా

మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారా

వంగవీటి రాధాకృష్ణను మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని వైసీపీ యోచిస్తోంది. అలాగే బ్రాహ్మణులకు రెండు టిక్కెట్లు ఇవ్వాలని జగన్ చూస్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మళ్లీ పోటీ చేయనున్నారు. విజయవాడ సెంట్రల్‌ను కూడా బ్రాహ్మణులకు ఇవ్వాలని యోచిస్తున్నారు. మల్లాది విష్ణుకు టిక్కెట్ ఇస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

లోకసభ వద్దంటే

లోకసభ వద్దంటే

వంగవీటి రాధాకృష్ణ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి లేకుంటే విజయవాడ తూర్పు నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోందని తెలుస్తోంది. 2004లో ఆయన తూర్పు నుంచి గెలిచారు. వంగవీటి మోహన్ రంగా, ఆయన సతీమణి రత్నకుమారిలు కూడా ఇక్కడి నుంచి గెలిచారు. 2009లో వంగవీటి రాధాకృష్ణ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

English summary
Will YSR Congress Party leader Vangaveeti Radhakrishna contest from Mahilipatnam Lok Sabha constituency?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X