వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఈదురుగాలులు, జోరువాన : ఎండల వేడికి ఉపశమనం

|
Google Oneindia TeluguNews

అమరావతి : మండుటెండలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఠారెక్కిస్తోన్న ఎండలు, ఉక్కపొతతో అల్లాడిపోతున్నారు. భానుడి భగభగలతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఏపీలో కురిసిన వర్షతో ఉపశమనం కలిగింది. కర్నూలు, విజయనగరం జిల్లాలో వాతావరణ చల్లబడటంతో ప్రజలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

విరిగిపడ్డ చెట్లు, తెగిపడ్డ విద్యుత్ స్తంభాలు
ఏపీలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు తెగిపడ్డాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. కర్నూలు జిల్లా ఆత్మకూరు డివిజన్‌లోని కొత్తపల్లి పాములపాడు, వెలుగోడు, ఆత్మకూరు మండలా్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నంద్యాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో చెట్టు వెరిగిపడి రైల్వే విద్యుత్ తీగ మీద పడింది. రైల్వే ట్రాక్‌పై పడటంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. విద్యుత్ లైన్ ప్రమాదకరంగా మారటంతో రైల్వే అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

wind storm and rain in ap

విజయనగరం జిల్లాలోనూ ..
విజయనగరం జిల్లాలోనూ వర్షం కురిసింది. శృంగవరపుకోటలో భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఎండవేడికి అల్లాడుతున్న ప్రజలు వాతావరణం చల్లబడడంతో సేదతీరుతున్నారు. అయితే చెట్లు, విద్యుత్‌ స్తంభాలు ఎక్కడ విరిగి మీద పడతాయోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇటు మరో రెండురోజులు వాతావరణం చల్లగా ఉంటుందని అధికారులు తెలిపారు.

English summary
In AP, there was a lot of rain. Trees and electric poles have been struck by the windfall. This caused darkness in some areas. The Pallampadu, Velugodu, Atmakur Mandal, the thunderous rains in Kurnool district Athakuru division,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X