వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఎదురుదాడి, మెట్టు దిగిన మోడీ- అమిత్ షా, రంగంలోకి రామ్‌మాధవ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీతో దోస్తీని పోగొట్టుకోవద్దని బీజేపీ భావిస్తోందా? అంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే పలువురు మిత్రులు దూరమైన నేపథ్యంలో ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబును దూరం చేసుకోవద్దని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా భావిస్తున్నారు.

2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఢిల్లీ పీఠం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి సంస్కరణలు మంచివే అయినప్పటికీ, సాధారణ ప్రజలు అర్థం చేసుకోవడానికి, వాటి ఫలితాలకు సమయం తీసుకుంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఆసక్తికరం: ప్రధాని మోడీతో మళ్లీ చర్చలు, జగన్‌కు పీకే షాకిస్తారా?ఆసక్తికరం: ప్రధాని మోడీతో మళ్లీ చర్చలు, జగన్‌కు పీకే షాకిస్తారా?

ఇదీ వారి అభిప్రాయం

ఇదీ వారి అభిప్రాయం

ఇలాంటి తరుణంలో వాటిని జీర్ణించుకోలేని స్థితిలో ప్రజలు ఉంటారని, మరోవైపు కొందరు మిత్రులు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయేలో కీలక, అతిపెద్ద భాగస్వామి చంద్రబాబును దూరం చేసుకోకపోవడమే మంచిదని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారు.

Recommended Video

BJP's Second Thoughts On YS Jagan
మెట్టి దిగిన బీజేపీ, రంగంలోకి రామ్ మాధవ్

మెట్టి దిగిన బీజేపీ, రంగంలోకి రామ్ మాధవ్

టీడీపీతో దోస్తీని కొనసాగించే ఉద్దేశ్యంలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌ను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయనతో మాట్లాడించాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన మాట్లాడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

సమస్య సద్దుమణిగేలా

సమస్య సద్దుమణిగేలా

బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి టీడీపీ, బీజేపీ మధ్య ఏపీలో మాటల యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఒకరిపై మరొకరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ మాధవ్ వంటి నేతను రంగంలోకి దింపి, సమస్యను సద్దుమణిగేలా చేయాలని భావిస్తున్నారట.

సమస్య అలా పరిష్కారం

సమస్య అలా పరిష్కారం

ఈ మేరకు రామ్ మాధవ్ ఓ ఇంగ్లీష్ ఛానల్‌తో మాట్లాడుతూ.. టీడీపీ తమకు పాత స్నేహం ఉందని, ప్రస్తుతం కొనసాగుతున్న సమస్య రాజకీయపరమైనది కాదని, అభివృద్ధికి సంబంధించినది అని చెప్పారు. చర్చలతో సమస్య పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు ఆగ్రహం

చంద్రబాబు ఆగ్రహం

కాగా, సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్రంపై వరుసగా నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని తప్పుబట్టాలని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఓ మెట్టు దిగినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

English summary
Despite pressure from their respective state units to review their alliance, the BJP and TDP leadership is exploring ways to retain their alliance for the 2019 elections, sources said. With Prime Minister Narendra Modi and BJP chief Amit Shah said to be keen on continuing the alliance with the TDP led by AP Chief Minister N Chandrababu Naidu, BJP general secretary Ram Madhav has been in talks with TDP leaders during the weekend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X