వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: అరుదైన రికార్డు - 94.9శాతంతో దేశంలోనే టాప్ - మరింత తగ్గిన కొత్త కేసులు

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అరుదైన రికార్డు సాధించింది. కేసుల పరంగా దేశంలోనే టాప్-2 స్థానంలో ఉన్న ఏపీ.. రికవరీల్లో మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో మొదటి స్థానానికి చేరింది. అంతేకాదు, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది. మొత్తంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం వెలువరించిన బులిటెన్ లో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి..

కరోనా విలయంపై ప్రధాని మోదీ - లాక్‌డౌన్ ముగిసినా వైరస్ చావలేదు - అమెరికా కంటే మనమే బెటర్కరోనా విలయంపై ప్రధాని మోదీ - లాక్‌డౌన్ ముగిసినా వైరస్ చావలేదు - అమెరికా కంటే మనమే బెటర్

ఇంకా తగ్గిన కొత్త కేసులు

ఇంకా తగ్గిన కొత్త కేసులు

ఏపీలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రోజుకు 10వేలు తక్కువ కాకుండా కొత్త కేసులు వెలుగులోకి రాగా.. ప్రస్తుత అక్టోబర్ రెండో వారం నుంచి కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. రెండు నెలల కిందట ఎన్నైతే టెస్టులు నిర్వహించారో.. ఆ సంఖ్య ఏమాత్రం తగ్గకుండానే కొత్త ఇన్ఫెక్షన్లు అదుపులోకి రావడం శుభసూచికంగా మారింది. వైద్య శాఖ మంగళవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,503 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,89,553కు, మొత్తం మరణాల సంఖ్య 6,481కు పెరిగింది.

ఆ రెండు జిల్లాల్లోనే..

ఆ రెండు జిల్లాల్లోనే..

గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 28 మంది కరోనాకు బలైపోయారు. గత నాలుగు నెలల్లో ఇది అతితక్కువ సంఖ్య కావడం గమనార్హం. వారిలో చిత్తూరు జిల్లాలో 4, కడప 4, కృష్ణ 4, ప్రకాశం 4, గుంటూరు 3, అనంతపురం 2, తూర్పు గోదావరి 2, పశ్చిమ గోదావరి 2, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చనిపోయారు. అయితే, కొత్త కేసులకు సంబంధించి తొలి నుంచీ ప్రమాదకంగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో ఇప్పటికీ ఉధృతి కొనసాగుతున్నది. మంగళవారం వెలుగులోకి వచ్చిన కొత్త కేసుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 525, చిత్తూరు 459, తూర్పు గోదావరి 457, కృష్ణా 398, ప్రకాశం 308, విశాఖ 240, కడప 190, అనంతపురం 123, శ్రీకాకుళం 94, విజయనగరం 93, కర్నూలు జిల్లాలో 48 కేసులు వెలుగు చూశాయి. ఇక రికార్డు విషయానికొస్తే..

దేశంలోనే ఏపీ టాప్..

దేశంలోనే ఏపీ టాప్..

అత్యధిక కరోనా టెస్టులు జరుపుతోన్న టాప్ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ కొనసాగుండటం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో 69,095 శాంపిళ్లను పరీక్షించడంతో ఇప్పటిదాకా జరిపిన మొత్తం టెస్టుల సంఖ్య 71,96,628కు చేరింది. ఇక ఏపీ సాధించిన మరో ఘనత.. 94.9శాతం రికవరీ రేటు. అవును, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో కరోనా బారినపడ్డవాళ్లలో 94.9 శాతం మంది కోలుకున్నారు. మంగళవారం ఒక్కరోజే 5,144 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,49,676గా ఉంది. 94.9 శాతం రికవరీ రేటు మరే రాష్ట్రమూ సాధించలేదు. దీంతో ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 33,396కు పడిపోయింది.

పండుగ వేళ ప్రభుత్వ హెచ్చరిక..

పండుగ వేళ ప్రభుత్వ హెచ్చరిక..


దసరా, ఆ వెంటనే దీపావళి, ఈద్, గురునానక్ తదితర పండుగలను వరుసగా ఉండటంతో ఏపీ ఆరోగ్య శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ‘‘నవరాత్రులు నడుస్తున్నాయి కదా అని పండు, కాయ తో పాటు ఇంట్లోకి కావలసినవి కొనడానికి బయటకి వెళ్ళినప్పుడు మాస్క్ మర్చిపోకండి, వెళ్లిన తరువాత ఆరు అడుగుల భౌతిక దూరం అస్సలు మరచిపోకండి. కరోనా నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం విస్మరించకండి'' అని ఆరోగ్యాంధ్ర ట్విటర్ ద్వారా సర్కారు ప్రకటన జారీ చేసింది.

సీఎం రేసులో చిత్తూరు వైసీపీ నేత - జగన్‌పై 2లక్షల మెజార్టీ ఇలా - వాలంటీర్ల దుస్థితి:ఎంపీ రఘురామసీఎం రేసులో చిత్తూరు వైసీపీ నేత - జగన్‌పై 2లక్షల మెజార్టీ ఇలా - వాలంటీర్ల దుస్థితి:ఎంపీ రఘురామ

English summary
Coronavirus outbreak in Andhra Pradesh seems to have come under control. According to a bulletin released by the state health department on Tuesday, With 94.9% recovery rate, AP stands top among all the states in #India. today state reported 3503 new cases and 28 deaths in the past 24 hours. The total number of cases increased to 7,89,553 and the total number of deaths to 6,481.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X