విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుసుగా!...ఫుడ్ కి కూడా ట్రెండ్ ఉంటుంది:ఇప్పుడు 'మండీ' బిర్యానీదే హవా

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ:కాలగమనంలో మార్పు అనివ్యారమనే సంగతి అందరికీ తెలిసిందే...ఆ మార్పు కేవలం ఏ కొన్ని అంశాలకో కాదు...దుస్తులు, అభిరుచులు, టెక్నాలజీ... ఇలా చాలా విషయాల్లోనే ఛేంజ్ అనేది సంభవిస్తూనే ఉంటుంది.

అదే క్రమంలో నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాల్లో ఆహార అభిరుచులకు సంబంధించి సరికొత్త ట్రెండ్ చాపకింద నీరులా ప్రవేశించి ఇప్పుడు ఇక్కడ అంతటా అదే హల్ చల్ చేస్తోంది. మామూలుగానే బిర్యాని అంటే లొట్టలు వేసే ఆంధ్రావాసులు ఇప్పుడు 'మండీ' బిర్యానీ అనే కొత్త రకం డిష్ కు ఫిదా అయిపోతున్నారు. తయారీలోనే కాదు...తినే పద్దతిలో కూడా చాలా విలక్షణంగా ఉండే ఈ 'మండీ' బిర్యాని ఇప్పుడు ప్రత్యేకించి కుటుంబ సభ్యులకు, స్నేహ బృందాలకు హాట్ ఫేవరిట్ గా మారింది. 'మండీ' బిర్యానీ ఇలా గ్రూప్ లకే ఎందుకింత స్పెషల్ గా మారింది?..దాని వెనుక కథాకమామిషు...విశేషాలు...ఇప్పుడు మీకోసం...

కొత్త కొత్త సంస్కృతులు...కొత్త రుచులు

కొత్త కొత్త సంస్కృతులు...కొత్త రుచులు

అమరావతి నవ్యాంధ్ర రాజధానిగా మారిన తరువాత దాని ప్రభావిత జిల్లాలు కృష్ణా గుంటూరుతో సహా అమరావతిలోకి విభిన్న సంస్కృతులు ప్రవేశిస్తున్నాయి. ఆహార అభిరుచులకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ ‘మండీ' బిర్యానీదే తిరుగులేని హవా!...విజయవాడ, గుంటూరు నగరాల్లో ఇప్పుడు ఈ డిష్ ను ఫ్యామిలీలు, బంధువులు, స్నేహితులు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. బర్త్‌డే పార్టీలు, మ్యారేజ్‌ డేలు, వీకెండ్‌ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు...ఇలా పార్టీ ఏదైనా కానీ అక్కడ 'మండీ' బిర్యానీదే సందడి. కేవలం పార్టీలప్పుడే ఇతర ఆనంద సమయాల్లో మండీ బిర్యానీ తయారీ చేయించడం క్రేజ్ గా ఫీలవుతున్నారు.

‘మండీ’ బిర్యానీ...అందరూ ఒకే కంచంలో...

‘మండీ’ బిర్యానీ...అందరూ ఒకే కంచంలో...

సాధారణంగా మనం హెటల్ కెళ్లి బిర్యానీకి ఆర్డర్ ఇస్తే మనకు ఇష్టమైన ఆహారం వేడివేడిగా ప్లేట్లో తెచ్చి మనముందు ఉంచుతారు...అయితే ఇక్కడ కూడా అంతే వస్తుంది...అయితే తేడా ఒక్కటే...అక్కడ ఎంతమంది ఉంటే అన్ని ప్లేట్లలో బిర్యానిని సరఫరా చేయగా...ఇక్కడ ఎంతమంది ఉన్నా ఒకే ప్లేట్ లో మండి బిర్యాని సప్లయి చేస్తారు. అయితే భోజనానికి కూర్చున్న వారి సంఖ్యను బట్టి వారికి అనుగుణంగా బిర్యాని సప్లయి చేసే ప్లేట్ సైజ్ మారుతుంది. ఈ మండీ బిర్యానీ సప్లయికి సంబంధించి స్టార్‌ హోటళ్లు మొదలు చిన్నచిన్న రెస్టారెంట్ల వరకు ఎక్కడకు వెళ్లినా ఇదే పరిస్థితి. ఆ కంచం చుట్టూ అందరూ కూర్చుని కలిసి తినడమే దీని ప్రత్యేకత.

మండీ బిర్యానీ...సప్లయి ఇలా

మండీ బిర్యానీ...సప్లయి ఇలా

కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలసి గ్రూప్ గా వెళ్లి మండీ బిర్యానీకి ఆర్డర్ ఇచ్చినప్పుడు అందరికీ కలిపి ఒక ఎత్తుపీటపై ఒకే కంచంలో చికెన్‌, మటన్‌తో చేసిన ఆ స్పెషల్ బిర్యానీ వడ్డిస్తారు. చాలా రెస్టారెంట్లలో గరిష్టంగా ఆరుగురు కలిసి ఒకే కంచంలో తినేందుకు వీలుగా రెస్టారెంట్ల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఆహ్లాదకర వాతావరణంలో అందరూ ఆప్తులతో కలసి...వీనులవిందైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ...నచ్చిన విందును ఆస్వాదిస్తుంటే ఆ మజానే వేరంటూ అందరూ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా ఇక యూత్ లో ఈ మండీ బిర్యానీకి ఉన్న క్రేజ్ అంతాఇంతాకాదు.

తయారీ కూడా...విభిన్నమే

తయారీ కూడా...విభిన్నమే


'మండీ' బిర్యానీ తయారీ సాధారణ, ధమ్ బిర్యానీలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. బొగ్గుల పొయ్యి మీద చికెన్‌ (కోడి తొడ)ను వెన్నతో కాలుస్తూ బాగా రోస్ట్‌ చేస్తారు. అలా బొగ్గులపై కాల్చడం వల్ల దాని రుచే వేరుగా ఉంటుంది. అలాగే కాజు పేస్ట్‌తో మటన్‌ను కూడా అంతే ప్రత్యేకంగా తయారుచేస్తారు. బాసుమతి బియ్యంతో విడిగా బిర్యానీని తయారుచేస్తారు. దీని తయారీలోనూ ఎలాంటి నూనెలు వినియోగించడమే పోవడమే ఈ మండీ బిర్యాని తయారీ లో అదో విశేషం. ప్రత్యేకంగా చేసిన మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతో చేసిన మండీ బిర్యానీ టేస్టే వేరు. ఇలా విడివిడిగా చేసిన బిర్యానీ, చికెన్‌, మటన్‌, పేద్ద ప్లేటులో పెట్టి...సన్నగా తరిగిన కీరా, క్యారెట్‌, ఆనియన్‌ స్లైస్‌లతో గార్నిషింగ్ చేసి సప్లయి చేస్తారు. ఈ బిర్యానీ తింటున్నప్పుడు చేతికి అంటుకోదని ఆరోగ్యపరంగా కూడా మంచిదని అందరూ లొట్టలువేసుకుంటూ లాగిస్తున్నారు. అంతేకాదు అందరూ కలిసి తినడం వల్ల ఆహార పదార్థాల వృథా తగ్గుతుందని...ఆత్మీయులతో కలిసి తిన్నామన్న సంతృప్తి మిగులుతుందని ఆహార ప్రియులు అంటున్నారు.

అరబిక్‌ సంప్రదాయం...ఇక్కడ వీళ్లే ఆద్యులు

అరబిక్‌ సంప్రదాయం...ఇక్కడ వీళ్లే ఆద్యులు

‘మండీ' అనేది అరబిక్‌ పదం...అందరూ కలిసి ఒకే కంచంలో కలసి తినడం అనేది కూడా అరబిక్‌ సంప్రదాయంలో ఒక భాగం. యెమన్‌, సౌదీ అరేబియా, ఒమన్‌, సోమాలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ తదితర ప్రాంతాల్లో ఈ సంప్రదాయం నేటికి వాడుకలోనే ఉంది...అరబ్‌లో ఎక్కువగా మటన్‌తో మండీ బిర్యానీ తయారుచేస్తారు. ఇక్కడ మటన్‌, చికెన్‌లతో కూడా తయారు చేస్తున్నారు. క్రమంగా ఇది అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తోంది. కారణాలేమైనా నవ్యాంధ్రలోనూ మండీ బిర్యానీ బాగా పాపులర్ అయి అనూహ్యమైన క్రేజ్ తెచ్చుకుంది. ఏడాదిన్నర క్రితం విజయవాడలోని టిక్కిల్‌ రోడ్డులో ఏర్పాటుచేసిన బార్కాస్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులు తొలిసారిగా ఈ మండీ బిర్యానీ డిష్‌ను నగరవాసులకు పరిచయం చేసినట్లు చెబుతున్నారు. క్రమంగా ఇది క్రేజీగా మారడంతో విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాల్లో విస్తరించింది.

వాళ్లు...ఏం అంటున్నారంటే?

వాళ్లు...ఏం అంటున్నారంటే?

మండీ బిర్యానీ గురించి ఆ రెస్టారెంట్ నిర్వాహకులు ఏం అంటున్నారంటే..."దుబాయ్‌ వెళ్లినప్పుడు మేము తొలిసారి మండి బిర్యానీ గురించి తెలుసుకున్నాం... రుచిచూశాం...అద్భుతంగా ఉన్న ఈ ప్రత్యేకమైన బిర్యానీని నవ్యాంధ్ర ప్రజలకు రుచి చూపించాలనుకున్నాం...ఆ ఉద్దేశంతో ఏడాదిన్నర క్రితం విజయవాడలో మా రెస్టారెంట్‌ ప్రారంభించాం. ఆ తరువాత నగరంలో మరిన్ని రెస్టారెంట్లు వెలిశాయి. ఆరోగ్యానికి హానిచేసే నూనెలను వినియోగించకుండా...ప్రకృతి నుంచి లభించే సహజసిద్ధమైన మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు, వెన్నను మాత్రమే వినియోగిస్తూ మండి బిర్యానీని తయారుచేయడం జరుగుతుంది...ప్రజల నుంచి మంచి ఆదరణ లభించడంతో గుంటూరు జిల్లా మంగళగిరిలో మరో బ్రాంచిని ప్రారంభించాం. త్వరలో బెంగళూరు, కాకినాడ, రాజమండ్రిలోనూ బార్కాస్‌ రెస్టారెంట్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం"...అని చెప్పారు.

English summary
Vijayawada:The people of Navyandhra are going 'fidaa' for a special dish. Its name 'mandy' biryani ...this dish has all the specialties from making to supply.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X