గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆపరేషన్ చేసుకోవాలా ఆధార్ కార్డుతో ఉంటే చాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుంటూరు :ఆధార్ కార్డుతో రండి ఆపరేషన్ చేసుకొండి .డబ్బులు లేకున్నా ఫర్వాలేదు అంటూ గుంటూరుకు చెందిన ఓ డాక్టర్ అత్యవసర శస్త్రచికిత్స నిర్వహిస్తున్నాడు. పెద్ద నగదు నోట్లను రద్దుచేయడంతో అత్యవసర శస్త్రచికిత్స అవసరమైనవారికి డబ్బుల కోసం ఇబ్బందిపెట్టకుండా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అర్థంచేసుకొన్న గుంటూరుకు చెందిన డాక్టర్ డబ్బుల కోసం రోగులను ఇబ్బందులు పెట్టకుండా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాడు.

గుంటూరుకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ నరేంద్రరెడ్డి ఆధార్ కార్డుతో వచ్చిన వారికి ఆపరేషన్ చేస్తానని ప్రకటించారు. ఆపరేషన్ పూర్తైన తర్వాత డబ్బులు చెల్లించవచ్చని ఆయన సూచించారు. ఈ సౌకర్యాన్ని ఈ ఏడాది డిసెంబర్ 30వ, తేది వరకు కొనసాగిస్తామన్నారు.

without money come with any identitycard for treatment

గుర్తింపు కార్డు చాలు

ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగుల వద్ద రద్దు చేసిన నగదు నోట్లు మాత్రమే ఉంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెబుతున్నారు. అవుట్ పేషేంట్, ఇన్ పెషేంట్ విభాగాల్లో రోగులు చికిత్స కోసం తమ గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని కోరారు. గుర్తింపు కార్డుల ఆధారంగా చికిత్సి నిర్వహిస్తామని తర్వాత పీజు చెల్లించవచ్చని ఆయన సూచించారు. ఆన్ లైన్ ద్వారా ఆసుపత్రి పీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు చెక్ ల ద్వారా కూడ పీజును చెల్లించే అవకాశం ఉందన్నారు.

ఆన్ లైన్ తో పాటు ఆసుపత్రిలో ఫీజు చెల్లించే పద్దతులు రోగి వద్ద లేని సందర్భంలో తన గుర్తింపు కార్డును తెచ్చుకొని సేవలను పొందవచ్చని ఆయన సూచించారు.ఓపి సేవలకు ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం లేదని ఆయన సూచించారు. తమ వద్ద డబ్బులు వచ్చిన తర్వాతే ఆసుపత్రి పీజులు చెల్లించాలని ఆయన సూచించారు.

English summary
come with aadhar card for treatment in guntur hospital. banned currency effect on treatment of patients , so guntur orthopedic doctor decide to treatment with identity cards.online payments, cheques, debit, credit cards accepted said doctor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X