• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరోనాను పంపమని భార్యలు దేవుణ్ణి ప్రార్థించారు.. భూమ్మీద పెద్ద వైరస్ మనుషులే : వర్మ

|

కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్న వైరస్ . ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ .. ఇక దీంతో ప్రజలు ఆందోళన చెందుతుంటే ప్రజల్లో అవగాహన కల్పించటానికి, కరోనా నుండి కాపాడటానికి సర్కార్ నడుం బిగించింది . ఇక వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మాత్రం కరోనా వైరస్ విషయంలో మొదట నుండి తనదైన స్టైల్ లో స్పందిస్తున్నారు .

పెరుగుతున్న కరోనా కేసులు... ఆ పని చెయ్ సుబ్బారావ్ అంటూ కేఏ పాల్ ని టార్గెట్ చేసిన వర్మ

కరోనా వైరస్ పై విభిన్నంగా స్పందిస్తున్న రాం గోపాల్ వర్మ

కరోనా వైరస్ పై విభిన్నంగా స్పందిస్తున్న రాం గోపాల్ వర్మ

మొన్నటికి మొన్న కరోనాకు పెద్ద చిన్నా అనే తేడా లేదని ఈ వైరస్‌ దెబ్బకు దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూడా మూసేశారని పేర్కొన్న వర్మ కరోనా మామూలు ప్రజలతో పాటు దేవుళ్లకు కూడా పెద్ద గుణపాఠం నేర్పిందంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక తాజాగా మనుషులే పెద్ద వైరస్ అంటూ సంచలన ట్వీట్ చేశారు రాం గోపాల్ వర్మ. ఇక కేపాల్ కు కూడా మీ దేవుడికి చెప్పి కరోనాను తగ్గించు లేదా నాకు కరోనాను రప్పించు అని సెటైర్లు వేశారు. ఇక పోలీసులు బాధ్యతా యుతంగా వ్యవహరించాలని, సంపూర్ణేష్ బాబులా ప్రవర్తించకూడదని అన్నారు.

భూ గ్రహానికి పట్టిన వైరస్‌ మనుషులని షాకింగ్ కామెంట్స్

భూ గ్రహానికి పట్టిన వైరస్‌ మనుషులని షాకింగ్ కామెంట్స్

తాజాగా మనుషులను ఉద్దేశించి ట్వీట్ చేసిన వర్మ భూ గ్రహానికి పట్టిన వైరస్‌ మనుషులని షాకింగ్ కామెంట్స్ చేశారు . కరోనా వైరస్‌పై మొదట నుండి తనదైన శైలిలో స్పందిస్తున్న ఆయన భూమిపై ఉన్న జీవుల్లో మనుషులు మాత్రమే తమ సొంత ప్రాంతంలో ఉండకుండా ఎల్లప్పుడూ సంచారం చేస్తుంటారన్నారు. ఇక ఉన్నదాన్ని రెట్టింపు చేసుకోవాలని ఎల్లప్పుడు ప్రయాణిస్తూ భూమికి సంబంధించిన సహజ వనరులను నాశనం చేస్తుంటాడు అని మనిషి నైజాన్ని చెప్పారు.

భూ గ్రహానికి పట్టిన జబ్బు మానవులు.. మానవులకు పట్టిన రోగం వైరస్‌

భూ గ్రహానికి పట్టిన జబ్బు మానవులు.. మానవులకు పట్టిన రోగం వైరస్‌

ఇక అంతే కాదు ఇదే రకమైన పని చేసే మరో జీవి వైరస్‌ మాత్రమేనన్నారు. భూ గ్రహానికి పట్టిన జబ్బు మానవులు అయితే మానవులకు పట్టిన రోగం వైరస్‌ అని రాం గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎవరికి వారు స్పందిస్తున్నారు. కొందరు మానవ తప్పిదాల వల్లే ఇదంతా జరిగిందని చెప్తూ వర్మ అభిప్రాయానికి మద్దతు పలికితే కొందరు వర్మ చేసిన కామెంట్ ను వ్యతిరేకిస్తున్నారు.

 కరోనాను పంపమని భార్యలు దేవుణ్ణి ప్రార్థించారని అనుమానం

కరోనాను పంపమని భార్యలు దేవుణ్ణి ప్రార్థించారని అనుమానం

ఈ వైరస్ పంపమని కొందరు భార్యలు దేవుణ్ణి ప్రార్థించారని అనుమానం అంటూ వర్మ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు . ఇక అందుకు ఆయన చెప్పిన కారణాలు-. 1. స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు చేయబడ్డాయి 2.బార్లు మరియు పబ్బులు మూసివేయబడ్డాయి 3. స్నేహితులతో కలిసి తిరగటం రద్దు చేయబడింది 4. కార్యాలయంలో పని ఉందని అబద్ధం చెప్పటం కూడా కుదరదు కనుక భార్యతో మాత్రమే సమయం గడపవలసిన తరుణం అంటూ భార్యలు భర్తల మీద కక్ష సాధించేందుకే ఈ వైరస్ ను పంపమని అడిగారని నా అనుమానం అని ఆయన పేర్కొన్నారు.

English summary
Ramgopal Varma, sensational director and care of adress to controversies has been tweeting about his style following the outbreak of coronavirus. Unlike any animal,humans are the only beings who never stay in their own place but keep travelling, multiplying and destroying the Planets natural resources..The only other being which does this is the VIRUS..HUMANS are as much a disease to the PLANET as the VIRUS is to HUMANS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more