తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేరళ నుంచి వచ్చిన మహిళా డాక్టర్, తిరుపతిలో నిపా వైరస్ కలకలం, చంద్రబాబు ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో నిపా వైరస్ కలకలం చెలరేగింది. కేరళ నుంచి వచ్చిన ఓ భక్తురాలికి నిపా ఉందనే అనుమానంతో ఆమెను అబ్జర్వేషన్లో ఉంచారు. ఆమె డాక్టర్ కూడా. ఆమె రుయా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షలో ఉన్నారు. నిపా వైరస్ కారణంగా కేరళలో పలువురు మరణించిన విషయం తెలిసిందే.

తొలుత గబ్బిలాలు, పందుల కారణంగా ఈ వైరస్ వ్యాప్తిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించినప్పటికీ, ఆపై వైరస్ వ్యాప్తికి అదొక్కటే కారణం కాదని, కలుషిత నీరు కూడా కారణమవుతోందని తేల్చారని తెలుస్తోంది. జ్వరం, తలనొప్పి, విరోజనాలు వంటి సమస్యతో బాధపడుతూ ఐదారు రోజులైనా తగ్గకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Woman Doctor Have Symptoms of Nipah virus in Tirupati?

బాధితురాలిని పరామర్శించిన కలెక్టర్, చంద్రబాబు ఆరా

రుయా ఆసుపత్రిలో ఉన్న బాధిత వైద్యురాలిని కలెక్టర్ పరామర్శించారు. వైద్య పరీక్షల అనంతరం మహిళా వైద్యురాలికి నిపా వైరస్ లేదని వైద్యులు తేల్చారు. కేరళ ప్రభుత్వం సూచన మేరకే ఆమెను ఐదు రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు నిపా కేసు నమోదు కాలేదన్నారు.

ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిపా వైరస్ పైన చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. తిరుపతిలో నిపా వైరస్ వదంతులపై చంద్రబాబా ఆరా తీశారు. దీనిపై నిజాలు వెల్లడించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నిపా వైరస్ అనేది కేవలం వదంతులేనని కలెక్టర్ సీఎంకు నిధులు ఇచ్చారు.

English summary
Woman Doctor Have Symptoms of Nipah virus in Tirupati? Chandrababu Naidu akes district collector over Nipah virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X