వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"రోజా, జగన్ హీరో హీరోయిన్లుగా: అతిగా ఆవేశపడే ఆడది.. అతిగాఆశపడే మగాడు"

రోజా సినిమా భాషలో చెప్పాలంటే... అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదన్న డైలాగ్ గుర్తుంచుకోవాలని సూచించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామి ఏపీ రాజకీయాల్లో కావాల్సినంత హీట్ పుట్టించింది. తొమ్మిది ప్రజాకర్షక హామిలతో వచ్చే దఫా అధికారాన్ని టార్గెట్ చేసిన ఆ పార్టీకి ఇటు టీడీపీ కూడా ధీటుగానే బదులిస్తోంది. ప్లీనరీ వేదికగా ఆ పార్టీ సభ్యులు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు మూకుమ్మడిగా తిప్పికొడుతున్నారు.

తాజాగా ఏపీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్, టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ వైసీపీ అధినేత జగన్, ఎమ్మెల్యే రోజాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని బాగుచేస్తామంటూ జగన్ తొమ్మిది హామీలను ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని,డ్వాక్రా మహిళల గురించి మాట్లాడే నైతికత కూడా వారికీ లేదని ఆమె మండిపడ్డారు.

వ్యక్తిగతంగాను జగన్, రోజాలపై అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా సినిమా భాషలో చెప్పాలంటే... అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదన్న డైలాగ్ గుర్తుంచుకోవాలని సూచించారు. మీ నాయకుడేమో అత్యాశపరుడు.. మీకేమో ఎలాంటి భాష వాడాలో కూడా తెలియదంటూ రోజాను విమర్శించారు.

woman finance corporation chairman anuradha takes on jagan and roja

అంతేకాదు, రోజా, జగన్‌లు హీరో హీరోయిన్లుగా ఒక సినిమా తీస్తే బాగుంటుందని అనురాధ పేర్కొనడం గమనార్హం. ఆ సినిమాకు 'అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు' అని టైటిల్ పెట్టాలని ఎద్దేవా చేశారు. ఇక సినిమా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, మ్యూజిక్ వంటివి విజయసాయిరెడ్డికి అప్పగిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు.

మొత్తం మీద రెండు పార్టీల మధ్య మాటల యుద్దం మరింత ముదిరినట్లుగానే కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగానే.. పరిస్థితి ఇలా ఉంటే, ఇక మున్ముందు ఈ తీవ్రత ఇంకెంత హీట్ పుట్టిస్తుందో!.

English summary
Woman finance corporation chairman Anuradha was criticized YSRCP president Jagan and MLA Roja on election promises
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X