• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రూం బుక్ చేశా, వచ్చెయ్: మహిళకు సీఐ వేధింపులు, వారి సంభాషణ ఇదీ, సీఎం ఆగ్రహం

|

చిత్తూరు: తిరుమలలో విధులు నిర్వహిస్తున్న సీఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిని సస్పెండ్ చేశారు. సదరు సీఐ పేరు సిద్ధతేజామూర్తి. చిత్తూరు జిల్లా వాల్మికీపురం సీఐగా ఏప్రిల్ నెలలో బాధ్యతలు చేపట్టారు. ఆగస్ట్ 10వ తేదీన పీలేరు సర్కిల్‌కు ఇన్స్‌పెక్టర్ లేకపోవడంతో అక్కడ ఇంచార్జిగా విధులు నిర్వర్తించారు.

స్నేహితుడి కొడుకుతో పెళ్లి చేయాలని: అమృత, తెరపైకి కొత్త పేర్లు, అతనే రంగంలోకి దిగాడు

ఈ సమయంలో పీలేరుకు చెందిన ఓ భార్యాభర్తల మధ్య గొడవలు ఆయన వరకు వచ్చాయి. బాధిత మహిళ భర్తపై ఫిర్యాదు చేశారు. అప్పటి ఆ బాధిత మహిళ నెంబర్ సీఐ సిద్ధతేజామూర్తి వద్ద ఉంది. తన నెంబర్‌కు అసభ్యకర సందేశాలు పంపిస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని బాధితురాలు తాజాగా ఫిర్యాదు చేశారు.

రూం బుక్ చేశానని చెప్పాడు

రూం బుక్ చేశానని చెప్పాడు

ఆమె మాట్లాడుతూ... తిరుమల కొండపై తనకు రూం బుక్ చేశానని చెప్పాడని, రూం నెంబర్ కూడా చెప్పాడని, తనను రమ్మని పిలిచాడని, మరుసటి రోజు తెల్లవారున తనకు ఫోన్ చేసి ఎందుకు రాలేదని అడిగాడని బాధితురాలు వాపోయారు. అతను తనతో వల్గర్‌గా మాట్లాడిన సందేశాలు, అసభ్యకరంగా పంపిన సందేశాలు ఉన్నాయని తెలిపారు. అతనికి రాజకీయంగా కూడా మద్దతు ఉన్నట్లు కనిపిస్తోందని, తనకు బెదిరింపులు కూడా వస్తున్నాయన్నారు.

గదికి రమ్మన్నాడు

గదికి రమ్మన్నాడు

తన భార్య ఊరికి వెళ్తుందని, తనను గదికి రమ్మని చెప్పాడని, తాను డ్యూటీలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వచ్చి వెళ్తానని చెప్పాడని బాధితురాలు వాపోయారు. సీఐ తనతో మాట్లాడుతుండగా బాధితురాలు దానిని రికార్డ్ చేశారు. న్యాయం కోసం గతంలో స్టేషన్‌కు వెళ్లిన ఆ మహిళను ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. దీనిపై విచారణ జరిపిన కర్నూలు రేంజ్ డీఐజీ అతనిని సస్పెండ్ చేశారు.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందామని ప్రయత్నం

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందామని ప్రయత్నం

రెండు రోజుల కిందట అతను ఫోన్ చేసి తనను రమ్మని చెప్పాడని, నందకం రెస్ట్ హౌస్‌లో గదిని బుక్ చేశానని చెప్పాడని బాధితురాలు ఆరోపించారు. ఆమె మహిళా సంఘాలతో కలిసి తిరుపతి అర్బన్ ఎస్పీని కలిసే ప్రయత్నం చేశారు. అంతేకాదు, మహిళా సంఘాలతో కలిసి సీఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అతను తప్పించుకున్నారని చెబుతున్నారు. కాగా, ఆమె ఆరోపణలను సిద్ధ తేజామూర్తి కొట్టి పారేశారని తెలుస్తోంది. ఆ గదిని కూడా మరో వ్యక్తి పేరిట ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆమె చెబుతున్న రికార్డింగ్‌లో ఇలా ఉంది...

ఆమె చెబుతున్న రికార్డింగ్‌లో ఇలా ఉంది...

అతను: నువ్వు ఎన్ని గంటలకు బయలుదేరుతావు?

బాధిత మహిళ: నేనా.. ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అన్నారు కదా.. అదే టైంకు బయలుదేరుతా

అతను: ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తావు చెప్పు. ఎందుకంటే నేను వన్స్ ఏడున్నరకు అలా లోపలకు వెళ్తా. డ్యూటీకి వెళ్తా. మధ్యలో వచ్చి వెళ్తా.

బాధిత మహిళ: ఎక్కడ మీకు డ్యూటీ వేస్తున్నారు?

అతను: నాకా.. నాట నీరాజనం.

బాధిత మహిళ: ఓహ్.. ఇక్కడ టెంపుల్‌కు ఆపోజిట్లో కదా.

అతను: ఆపోజిట్లోనే..

బాధిత మహిళ: అక్కడున్నారా?

అతను: ఆ...

బాధిత మహిళ: సరే.. సరే.

అతను: సరే.. మరి ఎందుకంటే, రూం నీకు సపరేట్‌గా తీసిపెట్టినా ఒకటి.

బాధిత మహిళ: ఓకే. అంటే మీరు ఉండేచోటు.

అతను: నీకు నాకు కలిపి ఒక రూం తీసుకున్నాను.

బాధిత మహిళ: ఒకే ఓకే.

అతను: నమ్మకంగా తీసుకున్నాను. యాక్చువల్‌గా వేరే వాళ్లని అడిగి రూం ఉంటే పడుకున్నాను.

బాధిత మహిళ: హుం..

అతను: ఈ రోజు వచ్చి ఉంటే చాలా హ్యాపీగా ఉండేది యాక్చువల్‌గా

ఆమె: హూ.. హూం..

అతను: హూం..

ఆమె: మీరు డ్యూటీకీ పోతారేమో కదా.. ఒకవేళ ఈ రోజు వచ్చినా.

అతను: ఏంలేదు ఖాళీ ఇక.

ఆమె: అవునా.. రేపు

అతను: నువ్వు బయల్దేరి ఎర్లీ మార్నింగ్ వస్తే నీకు రూం ఇస్తారు.

ఆమె: హూం.. హూం..

మధ్యలో వెళ్లి వస్తా.. నీకు ఏ ప్రాబ్లం రానీయను

మధ్యలో వెళ్లి వస్తా.. నీకు ఏ ప్రాబ్లం రానీయను

అతను: నమ్మకంగా నువ్వు రూంలోనే ఉండు. నేను పోయి మధ్యలో వచ్చి పోతుంటా. వన్ హవర్.. టూ హవర్స్‌కు వస్తుంటా. ఎన్ని గంటలకు బయలుదేరుతావు.

ఆమె: అంటే నాకేమంటే.. అక్కడ మీ పోలీసోళ్లు ఎక్కువ మంది ఉంటారేమో కదా.. మీ ఫ్రెండ్సంతా.. వాళ్లు రూంకు వస్తారేమో కదా.

అతను: నేనున్నా ఏరియాలో అలాంటి ఆలోచన ఉంటుందనే పోలీసులోళ్ల వద్ద తీసుకోలేదు. ప్రయివేటుగా నేను డబ్బులు పెట్టి తీసుకున్నా.

ఆమె: మీ ఫ్రెండ్స్ అంతా ఉన్నారా అక్కడ?

అతను: ఎవ్వరు లేరు.

ఆమె: అంటే, తెలిసిన వాళ్లయినా, వర్క్ చేసే వాళ్లయినా హాయ్ అంటూ వచ్చి మాట్లాడుతారు కదా.

అతను: ఎవ్వరు రారు, మా డ్రైవర్ కూడా రాడు

ఆమె: హూం.. ఎందుకంటే నేను ఫ్యామిలీలో ఉన్నాను కదా..

అతడు: అరే నీకు అలాంటి ప్రాబ్లమ్ రానీయను. సరేనా.

ఆమె: లేదు నా భయం ఏమంటే. ఇఫ్పుడు నాకు హస్బెండ్ లేడు. నేను ఎంత కరెక్టుగా ఉన్నా కూడా నన్ను చూసేవాళ్లు ఏదో మాట అనుకుంటారు. అందులోను నాకు ఆడబిడ్డ ఉంది. మగపిల్లోడన్నా ఉంటే ప్రాబ్లం లేదు. ఫలానా ఆమె ఇట్లా అంటే నాతో పాటు పాపకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా ఫ్యూచర్లో. అదే ఆలోచిస్తున్నా. అదొక్కటే నా భయం.

అతను: నాతో ఉంటే నీకు అట్లాంటివి ఏమీ రావులే.

ఆమె: హుం..

అతను: హూం.. అందుకే ఈ రోజు రాలేదా.

ఆమె: ఆహా అట్లని కాదు.. భయాలు ఎక్కువగా ఉన్నాయి నా మనసులో.

అతను: నువ్వు ఒక్కసారి వచ్చిపో. నువ్వు అనుకుంటావు కదా.. నేను ఏమిటో.

ఆమె: హుం.. హుం.. ఒకే.

చంద్రబాబు ఆగ్రహం

వాయల్పాడు సీఐ లైంగిక వేధింపులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. సీఐ పైన తక్షణమమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

English summary
Sexual harassment. Women complaint against CI in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X