విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టైమ్ బ్యాడ్?: రామ్ గోపాల్ వర్మకు మళ్లీ ఎదురుదెబ్బ.. ఏపీలోనూ కేసు నమోదు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విశాఖ: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లోనూ కేసు నమోదైంది. ఇటీవల పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో రామ్ గోపాల్ వర్మ 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' పేరుతో చిత్రాన్ని నిర్మించి దానిని ఆన్‌లైన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాదు, ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో పోర్న్ వీడియోలను ప్రమోట్ చేయడంతో పాటు మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి, ఆయన్ని అరెస్టు చేయాలంటూ మహిళా సంఘాలు నిరాహార దీక్షకు దిగాయి.

దిగి వచ్చిన ప్రభుత్వం...

దిగి వచ్చిన ప్రభుత్వం...

మహిళా సంఘాలు 48 గంటలపాటు దీక్షకు దిగగా ప్రభుత్వం దిగొచ్చింది. కాకినాడలో మహిళా సంఘాల ప్రతినిధులు హోంమంత్రి చినరాజప్పను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ హోమంత్రి చినరాజప్ప ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కించపరిచే వ్యక్తులను ఉపేక్షించం...

కించపరిచే వ్యక్తులను ఉపేక్షించం...

మహిళల్ని కించపరిచే వ్యక్తులను ప్రభుత్వం ఉపేక్షించబోదని, దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోమంత్రి చినరాజప్ప విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. స్పష్టంచేశారు.

తెలంగాణలో కేసు, విచారణ...

తెలంగాణలో కేసు, విచారణ...

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన జీఎస్‌టీ చిత్రం అసభ్యకరంగా, మహిళల్ని అవమానపరిచే విధంగా ఉందంటూ ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి దేవి హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికే ఒకసారి రాంగోపాల్‌ వర్మను హైదరాబాద్‌ పోలీసులు విచారించారు.

రామ్ గోపాల్ వర్మకు తప్పని కష్టాలు...

రామ్ గోపాల్ వర్మకు తప్పని కష్టాలు...

తెలంగాణలో నమోదైన కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఇంకా కొనసాగనున్న నేపథ్యంలోనే తాజాగా విశాఖలోనూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయింది. మహిళా సంఘాల ఫిర్యాదుపై హోంశాఖ మంత్రి చినరాజప్ప చర్యలకు ఆదేశించడంతో విశాఖ నగర పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో వర్మకు మరిన్ని కష్టాలు తప్పవనే వాదనలు వినబడుతున్నాయి.

English summary
Members of several women associations, led by All India Democratic Women Association (AIDWA), on Wednesday, staged a 48-hour hunger strike against Vizag police for not filing FIR against film-maker Ram Gopal Varma, over his latest film ' 'God, Sex And Truth'. The women-led group shouted slogans against the filmmaker and eight women associations members sat on 48-hours hunger strike at the GVMC Gandhi statue in Visakhapatnam. AIDWA member Mani, who had given written complaint against Ram Gopal Varma, last month said, when she spoke to Ram Gopal Varma in a tv-channel interview, the film-maker asked her to act in his next porn movie. Mani further said that she had given a written complaint against Ram Gopal Varma at MVP police station in Visakhapatanam, but the Vizag police didn't file an FIR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X