వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా బర్త్‌డే: మహిళా నేతల రక్తదానంపై కాంట్రోవర్సీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు చేసిన రక్తదానం వివాదానికి కేంద్ర బింధువు అయింది. డిసెంబర్ 9 సోనియా జన్మదినం సందర్భంగా సోమవారం పలువురు మహిళా నాయకులు గాంధీ భవన్‌లో రక్తదానం చేశారు.

అయితే వారు అందరూ రక్తదానం చేయలేదని, కేవలం పడుకొని మాత్రమే ఫోటోలకు ఫోజులిచ్చారని, ఆ తర్వాత రక్తదానం చేయకుండానే లేచారని విమర్శలు వినిపిస్తున్నాయి.

Women Congress leaders blood donation controversy

సోనియా జన్మదినం సందర్భంగా ఫోటోలకు ఫోజులిచ్చేందుకు మాత్రమే పడుకొని నవ్వారని, రక్త దానం పేరుతో హైడ్రామా నడిపారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా పడుకొని అలా లేచి వెళ్లిపోయారంటున్నారు. కొందరు ఫోటోలకు ఫోజులివ్వగా, మరికొందరు మాత్రమే రక్తదానం చేశారంటున్నారు.

కాగా, రక్తదానం కార్యక్రమం అనంతరం రాష్ట్ర మహిళా కాంగ్రెసు నేత ఆకుల లలిత మాట్లాడుతూ.. పదిహేను మంది రక్తదానం చేశారని చెప్పారు. రక్తదానం చేసి బర్కత్‌పురా రెడ్ క్రాస్ సొసైటీ అందించారు.

English summary
Andhra Pradesh Woman Congress President Akula Lalitha said that 15 party activists donated blood to mark the birth day of AICC president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X