వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యవసాయ సంక్షోభం వల్లే మహిళలు వ్యభిచారం చేస్తున్నారు .. లోక్ సభలో గోరంట్ల మాధవ్

|
Google Oneindia TeluguNews

అనంతపురం జిల్లాలో నెలకొన్న కరువు, రైతుల దుస్థితిపై లోక్ సభ వేదికగా మాట్లాడారు హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ . తీవ్ర కరువుతో కొట్టుమిట్టాడుతున్న అనంతపురం జిల్లాలో మహిళలు విధిలేని స్థితిలో ఒళ్ళు అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుందని ఆయన సభా ముఖంగా పేర్కొన్నారు. మహిళలు ఎంతో గౌరవింపబడుతున్న మన దేశంలో తీవ్ర కరువుతో పూటగడవక కొందరు వ్యభిచార గృహాలకు తరలిపోతున్నారని వారికి ఉపాధి కల్పించి కేంద్రం చొరవ చూపాలని మాధవ్ పేర్కొన్నారు.

టీడీపీ కార్యకర్తల కోసం లోకేష్ ఫేస్ బుక్ పేజ్ ... కార్యకర్తల రక్షణే ధ్యేయమన్న బాబు టెలీకాన్ఫరెన్స్టీడీపీ కార్యకర్తల కోసం లోకేష్ ఫేస్ బుక్ పేజ్ ... కార్యకర్తల రక్షణే ధ్యేయమన్న బాబు టెలీకాన్ఫరెన్స్

Recommended Video

ఢిల్లీ ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా మోదుగులను ఫిక్స్ చేసిన జగన్
చేయడానికి ఏ పనీలేక మహిళలు వ్యభిచారంలోకి దిగుతున్నారన్న ఎంపీ గోరంట్ల మాధవ్

చేయడానికి ఏ పనీలేక మహిళలు వ్యభిచారంలోకి దిగుతున్నారన్న ఎంపీ గోరంట్ల మాధవ్

కరువుతో కష్టాల్లో ఉన్న అనంత జిల్లాలో చేయడానికి ఏ పనీలేక మహిళలు వ్యభిచారంలోకి దిగుతున్నారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ లోక్ సభలో షాకింగ్ కామెంట్స్ చేశారు. లోక్ సభలో వ్యవసాయ సంక్షోభం గురించి మాట్లాడిన ఆయన పైవిధంగా కామెంట్స్ చేశారు. అనంత జిల్లాలో మహిళల దుస్థితికి కారణం పాలకులు కాదా అని మాధవ్ ప్రశ్నించారు. ఢిల్లీకి కూత వేటు దూరంలోనే వ్యభిచార గృహాలు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

వ్యవసాయ రంగం అభివృద్ధికి సహకరించాలని లోక్ సభలో ఎంపీ గోరంట్ల మాధవ్ విజ్ఞప్తి

వ్యవసాయ రంగం అభివృద్ధికి సహకరించాలని లోక్ సభలో ఎంపీ గోరంట్ల మాధవ్ విజ్ఞప్తి

వ్యవసాయ రంగం అభివృద్ధికి సహకరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. గురువారం లోక్‌సభ జీరోఅవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన గోరంట్ల మాధవ్ కరువు పరిస్థితులకు, మహిళలు వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్నారని పేర్కొన్నారు. మా ప్రాంతంలో వ్యవసాయంపై ఆదాయం వచ్చేదే తక్కువ. వ్యవసాయేతర రంగంలో ప్రస్తుతం పనులు లేవు. దాంతో మహిళలు ఒళ్లు అమ్ముకునే దుస్థితి నెలకొందని ఆయన అనంత పురం జిల్లాలో పరిస్థితిని వివరించారు . వ్యవసాయ సంక్షోభం వల్లే మహిళలు వ్యభిచారకూపంలోకి వెళ్తున్నారు. మహిళల అక్రమ రవాణా జరుగుతోంది. నా నియోజకవర్గంలోనే కాదు దేశమంతా ఇలాగే ఉందన్నది కొట్టివేయలేమని ఆయన పేర్కొన్నారు. ఉపాధికోసం గల్ఫ్‌ వెళ్తే భారత మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం' అని పేర్కొన్నారు.

 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలని కోరిన ఎంపీ మాధవ్

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలని కోరిన ఎంపీ మాధవ్

జిల్లాలో నెలకొన్న కరువు, రైతుల దుస్థితి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడిన ఆయన తీవ్ర కరువుతో కొట్టుమిట్టాడుతున్న అనంతపురం జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఉపయోకరంగా ఉంటుంది' అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. ఇక మాధవ్ లోక్ సభలో లేవనెత్తిన అంశం చాలా ప్రధానమైన అంశం .

English summary
The Hindupur MP spoke and highlighted drought conditions in Anantapur district and the pitiable plight of farmers. The YSRCP MP elaborated on the steps to be taken to alleviate the condition of farmers in Anantapur. He expressed his anguish at the condition of women in the drought-stricken areas. Gorantla Madhav said that while some women were forced into prostitution out of compulsion, in a country which respected women, others went to Gulf countries to eke out their living.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X