వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసిపి ఆళ్ల కాదు.. మేమే అడుగుతున్నాం: చంద్రబాబుకు హైకోర్టు షాక్! ప్రశ్నల వర్షం

అధికార తెలుగుదేశం పార్టీ నేతల పైన ఉన్న కేసులను ఉపసంహరించుకునే అంశంపై తాము దిగువ కోర్టులకు వెళ్లమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు తెలిపింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

వైసిపి ఆళ్ల కాదు.. మేమే అడుగుతున్నాం : చంద్రబాబుకు హైకోర్టు షాక్!

హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీ నేతల పైన ఉన్న కేసులను ఉపసంహరించుకునే అంశంపై తాము దిగువ కోర్టులకు వెళ్లమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు తెలిపింది.

భూమా ఎఫెక్ట్: బెట్టింగుతో అతను కోటీశ్వరుడయ్యాడు!!భూమా ఎఫెక్ట్: బెట్టింగుతో అతను కోటీశ్వరుడయ్యాడు!!

టిడిపి నేతలపై ఉన్న కేసులను విత్ డ్రా చేసుకోవాలని తాము కింది కోర్టులను సంప్రదించమని తేల్చి చెప్పింది. ఈ మేరకు అడ్వోకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు హామీ ఇచ్చారు.

ఏం జరిగిందంటే?

ఏం జరిగిందంటే?

మంగళగిరి ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ మేరకు పబ్లిక్ ఇంటరెస్ట్ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. టిడిపి నేతలపై కేసుల విత్ డ్రా ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన కోర్టుకు వెళ్లారు. టిడిపి నేతలపై కేసులు ఎత్తివేసేందుకు జీవో ఇచ్చారని ఆయన అందులో పేర్కొన్నారు.

వీరిపై కేసులు ఎత్తివేశారని

వీరిపై కేసులు ఎత్తివేశారని

ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, స్పీకర్ కోడెల శివప్రసాద రావు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస రావులు సహా 273 మంది కేసులు విత్ డ్రా చేసేందుకు జీవో ఇష్యూ చేసినట్లు పేర్కొన్నారు. ఓ ఎమ్మెల్యేపై అత్యాచారం, హత్య ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోర్టు అడిగింది. దీంతో అన్ని వివరాలు ఇచ్చారు.

ఆ అధికారం లేదని హైకోర్టు

ఆ అధికారం లేదని హైకోర్టు

మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వడంతో న్యాయస్థానం స్పందించింది. క్రిమినల్ కేసులు క్లోజ్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు.. చంద్రబాబు ప్రభుత్వానికి షాకిచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ చట్టానికి లోబడి పని చేయాలని చెప్పింది.

సుప్రీం కోర్టు చెప్పిందని ప్రభుత్వ న్యాయవాది

సుప్రీం కోర్టు చెప్పిందని ప్రభుత్వ న్యాయవాది

దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది శ్రీనివాస్ గత మూడేళ్లుగా జారీ చేసిన జీవోలను కోర్టుకు సమర్పించారు. పిటిషనర్ రాజకీయ వైరుధ్యాల కారణంగా పిల్ వేసినట్లు చెప్పారు. అంతేకాదు, కేసులు విత్ డ్రా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని తెలిపారు.

మర్చిపోండి.. సుమోటోగా తీసుకుంటామని షాక్

మర్చిపోండి.. సుమోటోగా తీసుకుంటామని షాక్

ప్రభుత్వ లాయర్ వాదనపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. రాజకీయ కక్ష విషయం మరిచిపోవాలని, అలా అయితే ఈ విషయ తీవ్రతను బట్టి తాము దీనిని సుమోటోగా తీసుకుంటున్నామని తేల్చి చెప్పింది. దీంతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం అడిగారు.

ఆ లోగా ఉపసంహరణ అడిగితే లాభమేమిటి?

ఆ లోగా ఉపసంహరణ అడిగితే లాభమేమిటి?

కౌంటర్ అఫిడవిట్‌కు మీరు సమయం అడిగారని, అదే సమయంలో ప్రాసిక్యూటర్స్ ఫైల్ చేస్తే.. ట్రయల్ కోర్టులు కేసులను ఉపసంహరిస్తే ఈ పిటిషన్‌కు ఫలితం ఏముుంటుందని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. కేసుల ఉపసంహరణపై ప్రాసిక్యూటర్స్ వాయిదా అడుగుతారని చెప్పారు. దీంతో హైకోర్టు స్టేట్‌మెంట్ రికార్డు చేసి, కౌంటర్ అఫిడవిట్‌కు మూడు వారాల సమయం ఇచ్చింది.

English summary
The Andhra Pradesh government on Tuesday assured the High Court that the process of withdrawing criminal cases against TD leaders would not be taken forward in the lower courts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X