వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై ప్రపంచ బ్యాంక్ నమ్మకం!: పెట్టుబడులపై ఎవరేం చేశారు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పెట్టుబడులకు మంచి అవకాశం ఉన్న రాష్ట్లాలుగా తెలుగు రాష్ట్రలైన ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. దీనిపై చంద్రబాబు సహా ఏపీ మంత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

13 స్థానంపై తెలంగాణ ప్రభుత్వం ఒకింత అసంతృప్తితోనే ఉందని చెప్పవచ్చు. అయితే, కొత్త పరిశ్రమలు, పెట్టుబడుల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రలు పలు చర్యలు తీసుకున్నాయి.

ఏపీ చేపట్టిన చర్యలు.... పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ విండో విధానం. వివిధ రిజిస్ట్రేషన్లకు వెంటనే అనుమతులు ఇవ్వడం. సెల్ఫ్ సర్టిఫికేట్‌తో ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్‌కు అనుమతి. తనిఖీలకు ఆన్ లైన్ రిస్క్ అసెస్‌మెంట్ ఆధారిత వ్యవస్థ. వివిధ కార్మిక చట్టాలకు రిజిస్ట్రేషన్లు. రెన్యూవల్స్‌కు ఇబ్బందులు లేకుండా ఆన్ లైన్ విధానం అమలు.

పారిశ్రామిక భూములు, మార్గాలు, అనుసంధానం, మౌలిక సదుపాయాలను గుర్తించేందుకు అడ్వాన్స్‌డ్ విధానం. వ్యాట్, ఇతర రాష్ట్ర పన్నుల చెల్లింపుకు, రిజిస్ట్రేషన్లకు ఆన్ లైన్ విధానం.

World Bank state rating: Andhra Pradesh 2, Telangana at 13

తెలంగాణ చేపట్టిన చర్యలు.... నిర్ణీత గడువులో పర్యావరణ అనుమతులు. 17 విభాగాల నుంచి పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు నిర్ణీత గడువులోగా టిఎస్ ఐపాస్ సింగిల్ విండో విధానం. వ్యాట్, ఇతర రాష్ట్ర పన్నుల రిజిస్ట్రేషన్‌కు, రిటర్న్‌ల దాఖలుకు ఆన్ లైన్ విధానం.

ఎలక్ట్రిసిటీ కనెక్షన్, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్లు పొందేందుకు రెండు డాక్యుమెంట్లు మాత్రమే చాలు. పర్యావరణ సహిత పరిశ్రమలకు దేశంలో తెలంగాణ సహా 5 రాష్ట్రాలు పరిశ్రమ పెట్టేందుకు ముందే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి పొందడాన్ని మినహాయింపు.

విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం అనుమతులు ఇవ్వడం. కనెక్షన్లు ఇవ్వడంలో తెలంగాణ సహా 8 రాష్ట్రాలు నిర్మీత గడువు విధించాయని నివేదిక పేర్కొంది. కాగా, ఏపీకి రెండో స్థానం దక్కడం పైన మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు పైన నమ్మకంతోనే ఏపీకి ప్రపంచ బ్యాంక్ రెండోస్థానం ఇచ్చిందని చెప్పారు.

English summary
AP has been ranked number two in the country, after Gujarat, in the World Bank’s “Assessment of State Implementation of Business Reforms”, with a score of 70.12 per cent. Telangana state has been ranked 13, with a 42.45 per cent score.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X