• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చెత్త రాజకీయాలు ..బెదిరిస్తే భయపడను : వైసీపీ నేతలకు బైరెడ్డి శబరి వార్నింగ్

|

ఏపీని కరోనా వైరస్ టెన్షన్ వెంటాడుతున్న సమయంలో కరోనాపై రాజకీయ వర్గాల వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఏపీలో ఇప్పటికే మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యా సంస్థలు ,ఆలయాలు మూసివేసి కరోనా కంట్రోల్ కోసం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మరో ఉన్నతాధికారి రమేష్ కరోనాకు పారాసిటామల్ అంటూ చేసిన వ్యాఖ్యలపై బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె డాక్టర్ శబరి స్పందించటం ఆమెపై ట్రోల్స్ కు కారణంగా మారింది.

బెజవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనాలు నిలిపివేత .. నిత్య పూజలు యధాతధం

650 గ్రాముల పారాసిటమాల్ అంటూ జగన్ ను టార్గెట్ చేసిన బైరెడ్డి శబరి

650 గ్రాముల పారాసిటమాల్ అంటూ జగన్ ను టార్గెట్ చేసిన బైరెడ్డి శబరి

పారాసిటమాల్‌తో కరోనా తగ్గతుందనే అర్ధం వచ్చేలా సీఎం జగన్ , అలాగే ఉన్నతాధికారి రమేష్ మాట్లాడటంపై డాక్టర్ గా స్పందించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి కరోనా బారిన పడకుండా సూచనలు చెయ్యటంతో పాటు ముఖ్యమంత్రి జగన్ , అలాగే రమేష్ చేసిన పారాసిటామల్ వ్యాఖ్యలపై స్పదించారు. 650 గ్రాముల పారాసిటమాల్ ఆరు గంటలకు ఒకసారి వేసుకోవాలా.. రోజుకు రెండున్నర కేజీల పారాసిటమాల్ వేసుకోమన్నారు. అది స్వీటా అలా తినడానికి అంటూ ఆమె సెటైర్లు వేశారు . పెద్ద పదవిలో ఉండి మాట్లాడటం సబబు కాదనేది తన ఉద్దేశం అన్న ఆమె వ్యాఖ్యలను వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు .

బైరెడ్డి శబరి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్

బైరెడ్డి శబరి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్

ఇదిలా ఉంటే మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్‌‌రెడ్డి కుమార్తె శబరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. 650 గ్రాములంటే అరకేజీ కంటే ఎక్కువ . అంతేకాదు పెద్ద యాపిల్ అంత సైజు ఉండాలి . 650మిల్లీ గ్రాములు పారాసిటామల్ కు బదులు 650 గ్రాములంటే ఇక ఆమె వైద్యం గురించి ఆమెకే తెలియాలంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. కరోనాకు సంబంధించి బైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతల కౌంటర్‌తో రాజకీయం హీటెక్కింది. తాను ఓ డాక్టర్‌గా కరోనా బారిన పడకుండా ప్రజల కోసం కొన్ని సూచనలు చేశానని ఆ క్రమంలోనే ప్రస్తావించానని చెప్పిన శబరి బెదిరిస్తే భయపడేది లేదని చెప్పారు.

బెదిరిస్తున్నారని, కొడతామని చెప్తున్నారన్న శబరి

బెదిరిస్తున్నారని, కొడతామని చెప్తున్నారన్న శబరి

ముఖ్యమంత్రి జగన్ కరోనాకు పారాసిటమాల్ తో ట్రీట్మెంట్ చెయ్యొచ్చు అన్నారని కానీ పారాసిటమాల్‌తో జ్వరం మాత్రమే తగ్గుతుంది అన్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్ తగ్గదని దానికి వేరే ట్రీట్మెంట్ ఉందని మాత్రమే ఆ వీడియోలో చెప్పానని ఆమె పేర్కొన్నారు . అయితే తప్పు మాట్లాడితే ప్రశ్నించకూడదని ఏమైనా ఉందా అని వ్యాఖ్యానించిన శబరి తనను కొంతమంది ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. బయటకు వస్తే కొడతామని చెప్తున్నారని, మీ సంగతి చూస్తాం, చెప్పులతో కొట్టిస్తామంటున్నారని వ్యాఖ్యానించారు.

  PM Modi Telugu Speech On Coronavirus | 'Janata Curfew' Why Only One Day ? | Oneindia Telugu
   వైసీపీ నేతల ఇళ్ళలో ఆడవాళ్ళు లేరా ? భయపడను అంటూ ఫైర్

  వైసీపీ నేతల ఇళ్ళలో ఆడవాళ్ళు లేరా ? భయపడను అంటూ ఫైర్

  ఇక మహిళ అని కూడా చూడకుండా ఇంత అసభ్యంగా మాట్లాడుతున్న వారు మీ వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లలో మహిళలు ఉన్న సంగతి మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. వాళ్ల ఇళ్ళలో కూడా భార్య, అక్కాచెల్లెళ్లు ఉన్నారని గుర్తు పెట్టుకోవాలని ఈ తరహా ట్రోల్స్ మంచిది కాదని ఆమె హితవు పలికారు . ఇక వైసీపీ నేతలను ఉద్దేశించి పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యం అన్నారు. కొంతమంది రౌడీలకు పెత్తనం ఇస్తే ఇలానే ఉంటుందని మండిపడిన శబరి మంచి చెబుతుంటే తప్పంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇక ఈ చెత్త రాజకీయాలకు భయపడను అని ఆమె పేర్కొన్నారు.

  English summary
  Former Minister Byreddy is countering the comments made by Rajasekhar Reddy's daughter, Sabari. Byreddy Sabari's comments on Corona have been heated by the YSRCP leaders counter. Shabari said that she had made some suggestions to the public not to get corona infected as a doctor. but ycp leaders are trolling in social media to create fear .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more