వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై సీఈసీకి ఫిర్యాదు: నంద్యాల ఉపఎన్నికపై హైకోర్టులో పిటిషన్

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని హైకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలైంది. కిరణ్ బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని హైకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలైంది. కిరణ్ బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి అధికార పార్టీ ప్రచారం నిర్వహిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ప్రలోభానికి గురిచేస్తోందని తెలిపారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

It is said that a writ petition filed in high court on nandyal bypoll.

జగన్‌పై ఈసీకి ఫిర్యాదు

ఢిల్లీ: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, నిమ్మల కిష్టప్ప, శ్రీరామ్‌ మాల్యాద్రి సీఈసీని కలిసి ఫిర్యాదు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, నిమ్మల కిష్టప్ప మీడియాతో మాట్లాడారు. సీఎంను నడిరోడ్డుపై కాల్చి చంపాలని ప్రతిపక్ష నేత జగన్‌ వ్యాఖ్యానించడం, జడ్‌ కేటగిరీ ఉన్న వ్యక్తికి సంబంధించిన వాహనాన్ని అడ్డుకోవడంపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెస్ నేతలు చేసే ఫిర్యాదులపై ఈసీ అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటున్నారని.. టీడీపీ చేసే ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదని సీఈసీకి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీలు వెల్లడించారు. అదేవిధంగా సాక్షి దినపత్రికలో వచ్చే పెయిడ్‌ న్యూస్‌ను ఎన్నికల ఖర్చుకిందే లెక్కగట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.

English summary
It is said that a writ petition filed in high court on nandyal bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X