వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: నేను అలా అనలేదు, మాలలకే పెద్దపీట:రావెల

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు వ్యవహరశైలిపై టిడిపి నేతలు తీవ్రంగా స్పందించారు. రావెలపై మంత్రి జవహర్, టిడిపి నేత వర్ల రామయ్యలు సీరియస్ అయ్యారు. పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు స్పందంచారు.చంద్రబాబును, టిడిపిని విమర్శించలేదని రావెల కిషోర్‌బాబు ప్రకటించారు.

కొంత కాలంగా రావెల కిషోర్‌బాబు అనుసరిస్తున్న వైఖరి వివాదాస్పదంగా మారుతోంది. మంత్రి పదవి నుండి రావెలను తప్పించడంతో ఆయన పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని టిడిపిలో ప్రచారం సాగుతోంది.

ట్విస్ట్: బాబుపై రావెలపొగడ్తలు, మందకృష్ణ మీటింగ్ ఉద్దేశ్యమిదేట్విస్ట్: బాబుపై రావెలపొగడ్తలు, మందకృష్ణ మీటింగ్ ఉద్దేశ్యమిదే

గుంటూరు జిల్లాలో ఎంఆర్‌పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నిర్వహించిన మాదిగ కురుక్షేత్ర మహసభకు రావెల కిషోర్‌బాబు పరోక్షంగా సహకరించాడనే విమర్శలు కూడ వచ్చాయి. అయితే పార్టీకి నష్టం కల్గించే ప్రయత్నాలు చేయడం లేదని రావెల కిషోర్‌బాబు ప్రకటించారు.

జాషువా జయంతి సభలో మాజీ మంత్రి రావెల సంచలన వ్యాఖ్యలుజాషువా జయంతి సభలో మాజీ మంత్రి రావెల సంచలన వ్యాఖ్యలు

మంత్రి పదవి కోల్పోయిన తర్వాత రావెల కిషోర్‌బాబు వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నష్టం చేస్తోందని కొందరు పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే రావెల కిషోర్‌బాబు మాత్రం పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించడం లేదంటున్నారు.

రావెలలో మార్పు ఎందుకు?

రావెలలో మార్పు ఎందుకు?

మంత్రివర్గంలో స్థానం కోల్పోయిన తర్వాత రావెల కిషోర్‌బాబు వ్యవహరశైలిలో మార్పులు చోటుచేసుకొన్నాయనే అభిప్రాయాలు లేకపోలేదు. మంత్రి పదవిని కోల్పోయినందున కొంత కాలంగా పార్టీని ధిక్కరించే కార్యక్రమాలకు రావెల కిషోర్‌బాబు పాల్పడుతున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. అయితే రావెల మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. పార్టీకి నష్టం కల్గించేలా తాను ఏ కార్యక్రమానికి పూనుకోలేదని రావెల కిషోర్‌బాబు ప్రకటించారు.

నా వ్యాఖ్యలను వక్రీకరించారన్న రావెల

నా వ్యాఖ్యలను వక్రీకరించారన్న రావెల

తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి జవహర్,టిడిపి నేత వర్ల రామయ్యలు పూర్తిగా వక్రీకరించారని ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక వర్గాన్ని కించపరిచేటట్లు ఉన్నాయన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు రావెల కిషోర్‌బాబు. మంత్రి జవహర్‌తో పాటు వర్ల రామయ్య తనపై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు ఖండిం చారు.

కురుక్షేత్ర సభను ప్రభుత్వం అడ్డుకొందనే భావన ఉంది

కురుక్షేత్ర సభను ప్రభుత్వం అడ్డుకొందనే భావన ఉంది

కురుక్షేత్ర మహాసభను ప్రభుత్వం అడ్డుకుందన్న విషయం మాదిగల్లో బాగా నాటుకుపోయిందని చెప్పారు. తమను అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాదిగలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. వర్గీకరణ జీవో-25ను ప్రభుత్వం అమలుచేయడంలేదని మాదిగలు ఆవేదన చెందుతున్నారని చెప్పారు రావెల కిషోర్‌బాబు. ఇటీవల సంక్షేమ శాఖలో కీలకమైన పదవులన్నీ మాలలకే ఇచ్చారని మాదిగలు భావిస్తున్నారన్నారు.

 బాబును విమర్శించలేదు

బాబును విమర్శించలేదు

ప్రత్తిపాడులో గురువారం జరిగిన గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభలో తానుగానీ, మందకృష్ణ మాదిగగానీ ముఖ్యమంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని రావెల స్పష్టంచేశారు. పార్టీని వీడతానని ప్రజల్లో అపోహలు కలిగేలా అధికార పార్టీ నేతలే తన గురించి వ్యాఖ్యానించడం విచారకరమన్నారు.

English summary
Former minister Ravela Kishore babu said that Ap minister Jawahar and Tdp leader Varla Ramaiah wrong allegations on him.Ravela explained about Mandha Krishna meeting held at Prattipadu on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X