• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మేడిన్ ఏపి: తొలి స్వదేశీ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ, సెల్ఫీ తీసుకున్న చంద్రబాబు(ఫొటోలు)

|

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని, ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ పరిశ్రమలకు అవసరమైన పూర్తి స్థాయి సహకారాన్ని ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో చైనా కంపెనీ జియామీ తయారు చేసిన దేశీయ స్మార్ట్‌ఫోన్‌ ‘రెడ్‌మి 2 ప్రైమ్‌'ను సోమవారం ఉదయం విశాఖపట్నంలో ఆయన ఆవిష్కరించి మార్కెట్‌లోకి విడుదల చేశారు.

ఆ తర్వాత నోవాటెల్‌ హోటల్‌లో ఓ టీవీ ఛానల్‌, జియామీ సంయుక్తంగా నిర్వహించిన విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్థులతో ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడారు. ఆయా సందర్భాల్లో సీఎం మాట్లాడుతూ.. చైనా పర్యటనలో భాగంగా ఏపీకి రావాలని తాను చేసిన విజ్ఞప్తి మేరకు జియామీ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పిందన్నారు.

కేవలం నెలల వ్యవధిలోనే తొలి ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకురావడం విశేషమన్నారు. నాలుగేళ్ల కిందట స్టార్టప్‌గా ప్రారంభమైన జియామీ నేడు ప్రపంచంలోని టాప్‌ టెన్‌ మొబైల్‌ కంపెనీల్లో నాలుగో స్థానంలో ఉందన్నారు. గత నాలుగేళ్లలో ఆరు కోట్ల మొబైల్‌ ఫోన్లను విక్రయించిందని, కంపెనీకి 46 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఉందని చెప్పారు. నాణ్యమైన ఫోన్లను తక్కువ ధరకు అందించడం దీని ప్రత్యేకత అని, రెడ్‌మి 2 ప్రైమ్‌ కూడా అలాంటిదేనని చెప్పారు.

భారతదేశం తయారీరంగ హబ్‌గా మారబోతోందని అన్నారు. చమురు దిగుమతుల తరువాత అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని భారత్‌ ఎలక్ట్రానిక్‌ వస్తువుల, చిప్‌ల కోసమే వినియోగించాల్సి వస్తోందని గుర్తు చేశారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే దేశంలోనే ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఉత్పత్తి భారీగా జరగాలని ఆకాంక్షించారు.

భారత్‌ తయారీ'లో భాగంగా దేశాన్ని ఎలక్ట్రానిక్స్‌ హార్డ్‌వేర్‌ హబ్‌గా మార్చాలని ప్రధాని మోడీ భావిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ను కూడా అదే పంథాలో నడపడానికి తాను కృషి చేస్తున్నానని వివరించారు.

పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారికి మూడు వారాల్లో అనుమతులివ్వడం, సింగిల్‌డెస్క్‌ విధానంలో ఒకేచోట దరఖాస్తులు ఆన్‌లైన్లో పెట్టుకునేలా చర్యలు తీసుకోవడం, అద్భుతమైన పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం లాంటి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామన్నారు. విశాఖ-చెన్నై, బెంగళూరు-చెన్నై పారిశ్రామిక నడవాలతో భవిష్యత్తులో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని వివరించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని, ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ పరిశ్రమలకు అవసరమైన పూర్తి స్థాయి సహకారాన్ని ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో చైనా కంపెనీ జియామీ తయారు చేసిన దేశీయ స్మార్ట్‌ఫోన్‌ ‘రెడ్‌మి 2 ప్రైమ్‌'ను సోమవారం ఉదయం విశాఖపట్నంలో ఆయన ఆవిష్కరించి మార్కెట్‌లోకి విడుదల చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆ తర్వాత నోవాటెల్‌ హోటల్‌లో ఓ టీవీ ఛానల్‌, జియామీ సంయుక్తంగా నిర్వహించిన విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్థులతో ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడారు. ఆయా సందర్భాల్లో సీఎం మాట్లాడుతూ.. చైనా పర్యటనలో భాగంగా ఏపీకి రావాలని తాను చేసిన విజ్ఞప్తి మేరకు జియామీ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పిందన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu will launch India’s first Xiaomi-manufactured phone in Visakhapatnam on Monday, under the Make in India, Made in Andhra Pradesh programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more