• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యాస్ ముంచుకొస్తోంది.!అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం జగన్‌.!

|

అమరావతి/హైదరాబాద్: తౌట్కే తుపాను గండం గట్టెంక్కిందని ఊపిరి పీల్చుకునే లోపు మరో తుపాన్ యాస్ రూపంలో ఏపిని వణికిస్తోంది. మరో ఇరవై నాలుగు గంటల్లో యాస్ తుపాను ప్రభవంతో భరీ వర్షాలతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతాదికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను కారణంగా ఎటువంటి ప్రాణ హాననీ గానీ ఆస్థినష్టం గాని కలగకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.

  #TOPNEWS: #Krishnapatnam Medicine | Producer BA Raju | CHINA | Air India || Oneindia Telugu
  యాస్ తుపాన్ పట్ల అలర్ట్ గా ఉండాలి.. కోవిడ్ బాదితులకు ఇబ్బంది కలిగకుండా చూడాలన్న ఏపీ సీఎం..

  యాస్ తుపాన్ పట్ల అలర్ట్ గా ఉండాలి.. కోవిడ్ బాదితులకు ఇబ్బంది కలిగకుండా చూడాలన్న ఏపీ సీఎం..

  యాస్‌ తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. తుపాను వల్ల కోవిడ్‌ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్తగా వారిని తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

  యాస్ తుపానుపై ఉన్నతాదికారులతో సీఎం సమీక్షా సమావేశం.. అలసత్వం వద్దన్న జగన్..

  యాస్ తుపానుపై ఉన్నతాదికారులతో సీఎం సమీక్షా సమావేశం.. అలసత్వం వద్దన్న జగన్..

  ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆక్సిజన్‌ సిలెండర్లకు రీఫిల్లింగ్‌ చేసే ప్లాంట్లకూ విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా డీజిల్‌ జనరేటర్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా విద్యుత్‌ సిబ్బందిని ఆయా ఆస్పత్రులకు కేటాయించాలని సీఎం ఆదేశించారు. తుపాను కారణంగా ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ సేకరణకు ఇబ్బందులు వస్తే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలన్నారు. తగినంత నిల్వలు పెట్టుకోవాలని అధికారులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

  విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి.. ప్రత్యామ్నాయాలు సిద్దం చేయాలన్న జగన్..

  విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి.. ప్రత్యామ్నాయాలు సిద్దం చేయాలన్న జగన్..

  తుపాను ప్రభావిత రోజుల్లో ఆక్సిజన్‌ కొరత రాకుండా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం అన్నారు. ఆక్సిజన్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తుపాను పరిణామాలను ఊహించి ఆ మేరకు సిద్ధం కావాలని సీఎం సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కోవిడ్‌ పేషెంట్లను అవసరమనుకుంటే, తరలింపు ఇప్పుడే పూర్తికావాలని తెలిపారు. కోవిడ్‌ కేంద్రాలకు కరెంటు సప్లైకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకటికి రెండు సార్లు పూర్తి స్థాయిలో ఆలోచనలు చేసి సమర్థవంతగా చర్యలు తీసుకోవాలని, అవసరమైన సాంకేతిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల లోతట్టు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించాలని, సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

  తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరికలు..

  తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరికలు..

  ఇదిలా ఉండగా ఐఎండి సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా‌ కొనసాగుతున్న యాస్, ఆ తరువాత 24 గంటల్లో‌ అతి తీవ్ర తుఫానుగా‌ మారనుందనే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్, పారాదీప్ మరియు సాగర్ ద్వీపాల మధ్య మే 26 మధ్యాహ్నం యాస్ తీరం దాటే అవకాశం ఉందని, దీంతో ఈ రోజు, రేపు అక్కడక్కడ, ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. యాస్ తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

  English summary
  The IMD has warned of heavy rains and gusts of winds in the next 24 hours. In this context, CM YS Jaganmohan Reddy held a review meeting with his superiors on the situation arising out of the yaas cyclone.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X