విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చండీపూజ చేసినా : ద‌క్కని ఎమ్మెల్యే సీటు : వైసిపి నుండి జ‌న‌సేన వైపు..!

|
Google Oneindia TeluguNews

ఏడాది గా త‌న‌కే సీటు అని న‌మ్మ‌కం పెట్టుకున్నారు. అభ్య‌ర్దుల జాబితాలో మాత్రం పేరు లేదు. దీంతో..ఆయ‌న చండీ యాగం చేసిన ఫలితం లేద‌ని ఆవేద‌న తో పార్టీ మారే అంశం పై ఆలోచ‌న చేస్తున్నారు. వైసిపి లో ఏడాది క్రితం చేరి త న‌కే సీటు అని చెప్పుకొని..ఇప్పుడు అనుచ‌రుల ద్ద ఆవేద‌న వెళ్ల‌గ‌క్క‌తున్నారు. వైసిపి ని వీడి జ‌న‌సేన వైపు చూస్తన్నా రు. విజ‌య‌వాడ న‌గ‌రంలో ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది..

వైసిపి ని వీడుతారా..
విజయ‌వాడ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి కొంత కాలం క్రితం వైసిపి లో చేరారు. విజ‌య‌వాడ ఈస్ట్ సీటు త‌న‌కు ఇస్తార‌ని ఆశించారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు చేసారు. అయితే, వైసీపీ ఆదివారం ప్రకటించిన జాబితాలో యలమంచిలి పేరు లేకపోవడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందారు. ఆ పార్టీ అధిష్ఠానం తీరుపై అభిమానులు ఆక్రోశంతో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ను దీటుగా ఎదుర్కోగలిగే సత్తా రవికి ఉన్నా.. గుర్తింపు లేని బొప్పన భవకుమార్‌కే టికెట్ ఇచ్చారంటూ ఆగ్రహంతో ఉన్నారు. యలమంచిలి రవి అయితే తీవ్ర మన స్తాపం చెందారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన పీవీపీ తనను కాదంటే .. నియోజకవర్గంలో ఇన్నాళ్లూ పనిచేసిన వారికి అన్యాయం చేస్తారా అని రవి అభిమానులు వాపోతున్నారు.

జ‌న‌సేన పార్టీః మ‌రో 32 మంది అభ్య‌ర్థుల జాబితా వెల్ల‌డి..అయిదు లోక్ స‌భ స్థానాలు కూడా!జ‌న‌సేన పార్టీః మ‌రో 32 మంది అభ్య‌ర్థుల జాబితా వెల్ల‌డి..అయిదు లోక్ స‌భ స్థానాలు కూడా!

Yalamanchili Ravi may join in Janasena : He did not get seat from YCP

చండీ పూజ‌లు త‌రువాత జ‌న‌సేన వైపు..
కొన్ని రోజుల కిందట తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా 'తూర్పు' నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా నని తన అభి మానులు, కార్యకర్తలకు రవి చెప్పారు. రవికి టికెట్‌ విషయంలో జగన్‌ మొండి చెయ్యి చూపడంతో ఆయన కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ప్రత్యామ్నాయ అవకాశాలను చూడాల్సిందేనని కార్యకర్తలు పట్టుబడుతున్నారు. చండీ పూజలు ముగిసిన తర్వాతే తన నిర్ణయం ప్రకటిస్తానని , అప్పటి వరకు ఓపిక పట్టాలని రవి కార్యకర్తలతో చెప్పా రు.

ఇప్ప‌టికే జ‌న‌సేన నేత‌లు ర‌వితో ట‌చ్ లోకి వెళ్లారు. ఆయ‌న‌ను త‌మ పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించారు. గ‌తంలో ప్ర‌జారాజ్యం నుండి ఎమ్మెల్యేగా గెల‌వ‌టంతో..ఆయ‌న‌కు ప‌వ‌న్ తో నేరుగా సంబంధాలు ఉన్నాయి. దీంతో..తిరిగి ప‌వ‌న్ నాయ‌క‌త్వంలో ప‌ని చేయ‌ట‌మా..లేక స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా బరిలోకి దిగ‌ట‌మా అనే మీమాంస‌లో ర‌వి ఉన్నారు.

English summary
Vijayawada East ex Mla and Ycp leader Yalamanchili Ravi may join in janasena shortly. He expected seat from YCP but he did not get. No his followers pressuring him to contest as independent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X