• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వర్మకు జగన్ మద్దతుపై ఫైర్ అయిన యామిని, దివ్య వాణి... వర్మ సైకో , బూతు డైరెక్టర్ అని మండిపాటు

|

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, మహిళా అధికార ప్రతినిధి సాధినేని యామిని రాం గోపాల్ వర్మకు జగన్ మద్దతు ఇవ్వటంపై జగన్ పై విమర్శలు గుప్పించారు. ఇక దివ్య వాణి సైతం జగన్ పై తనదైన స్టైల్ లో మండిపడ్డారు . ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో ముందు జగన్ నేర్చుకోవాలని చెప్పారు.

మరో బావిలో కల్పన మృతదేహం తాలూకు అవశేషాలు లభ్యం .. ఉద్రిక్తంగా హాజీపూర్ గ్రామం

వర్మ ఓ సైకో డైరెక్టర్ .. జగన్ మద్దతివ్వటం సిగ్గు చేటు .. యామిని ఫైర్

వర్మ ఓ సైకో డైరెక్టర్ .. జగన్ మద్దతివ్వటం సిగ్గు చేటు .. యామిని ఫైర్

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సైకో దర్శకుడు అని టీడీపీ మహిళా నేత సాధినేని యామిని ఆరోపించారు. ఆర్జీవీ ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట సినిమాని తెరకెక్కించి ఏపీలో విడుదల చెయ్యాలని చూస్తున్న వర్మ ఏపీలో మూవీ రిలీజ్ కి ముందు ప్రెస్ మీట్ పెట్టాలని భావించారు. దానిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఆర్జీవీని అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించటం అని జగన్ స్పందించారు. ఇక దీనిపై స్పందించిన యామిని వర్మ లాంటి సైకోకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

రాష్ట్రంలో సమస్యలేమీ లేవా? బూతు డైరెక్టర్ కు మద్దతిస్తారా .

రాష్ట్రంలో సమస్యలేమీ లేవా? బూతు డైరెక్టర్ కు మద్దతిస్తారా .

ఇక ఇదే విషయంలో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై టీడీపీ నేత దివ్యవాణి విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడిన దివ్యవాణి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మద్దతుగా జగన్ ట్వీట్ చేయడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో ఓవైపు ఎండలు మండిపోతున్నాయని, నీటిఎద్దడితో అల్లాడిపోయే పరిస్థితి నెలకొందని, మరోవైపు తెలంగాణలో 20 మందికి పైగా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో సమస్యలేమీ లేనట్టు ఓ బూతు డైరక్టర్ కు ప్రతిపక్ష నేత మద్దతివ్వడం ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటర్ విద్యార్థుల సమస్య పై స్పందించలేదు .. బూతు డైరెక్టర్ కోసం స్పందిస్తారా అని మండిపాటు

ఇంటర్ విద్యార్థుల సమస్య పై స్పందించలేదు .. బూతు డైరెక్టర్ కోసం స్పందిస్తారా అని మండిపాటు

ఓవైపు తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల సమస్య తీవ్రరూపం దాల్చితే జగన్ దానిపై స్పందించకుండా, బూతు సినిమాలు తీసుకునే దర్శకుడి కోసం ట్విట్టర్ లో స్పందించడాన్ని ఏమనాలో అర్ధం కావటం లేదన్నారు దివ్య వాణి. జగన్ ప్రతిపక్ష నేతగా ఎలా ఉండాలో నేర్చుకోవాలని, మంచి మనసుతో ఆలోచించడం అలవర్చుకోవాలని దివ్యవాణి జగన్ కు హితవు పలికారు .

 యామిని, దివ్య వాణిల వ్యాఖ్యలపై వర్మ, జగన్ ల రియాక్షన్ ఏంటో

యామిని, దివ్య వాణిల వ్యాఖ్యలపై వర్మ, జగన్ ల రియాక్షన్ ఏంటో

తనపై ఎవరైనా ఒక్క కామెంట్ చేసినట్లు తెలిసినా.. కౌంటర్ ఇచ్చే వర్మ.. యామిని, దివ్య వాణిల మాటలకు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇదిలా ఉండగా... రేపు కూడా సినిమా విడుదల కష్టమనే వాదనలు వినపడుతున్న నేపధ్యంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎపిసోడ్ లో ముందు ముందు ఏం జరగనుందో మరి .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party Fire Brand Sadhineni Yamini and Divya vani fired on Jagan.Jagan has been criticized for giving Jagan's support to Ram Gopal Varma, the Telugu Desam Party Fire Brand and Women's Representative. Divya vani also blamed Jagan. The Jagan should learn before how the opposition leader should be. Yamini questioned in what way Jagan was supporting Varma a Psycho's director. Divya Vain said that Varma was a abusive director.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more