సాధినేని యామిని రాజీనామా ! ...టీడీపీ వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ .. ఆసక్తికరంగా లేఖ
టీడీపీలో బలమైన మహిళా నేత టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చారు. గత ఎన్నికల ముందు వరకు అధికార పార్టీ నాయకురాలిగా, టీడీపీ అధికార ప్రతినిధిగా హల్ చల్ చేసిన యామిని బీజేపీలోకి జంప్ అంటున్నారు.

రాజకీయ అజ్ఞాతం వీడిన యామిని ... టీడీపీకి గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై మాటల తూటాలు పేల్చిన తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తుంది. గత కొంత కాలంగా ఆమె రాజకీయ అజ్ఞాతంలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆమె సైలెంట్ అయ్యారు.అయితే వ్యక్తిగత కారణాలతోనే సైలెంట్ గా ఉన్నట్టు యామిని పలుమార్లు చెప్పినప్పటికీ యామిని పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపించింది. ఇక ఫైనల్ గా ఆమె ఈ నెల 10న బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోవటానికి నిర్ణయం తీసుకున్నారు.

రాజీనామా లేఖను టీడీపీ వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన యామిని
ఈ క్రమంలోనే ఆమె తన రాజీనామా లేఖను టీడీపీ వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఎన్నికల ముందు వరకు టీడీపీకి బలమైన గొంతుకగా ఉన్న మహిళా నేత ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని టిడిపి యాక్టివిటీస్ కు దూరంగా ఉండటం వెనుక ఉన్న అసలు కారణాన్ని, తాను పార్టీకి రాజీనామా చెయ్యాలని తీసుకున్న నిర్ణయాన్ని తన రాజీనామా లేఖ ద్వారా యామిని తెలియజేశారు. రాజీనామా చేసి ఎన్నికల ముందు వరకు టీడీపీ తరఫున గట్టిగా మాట్లాడిన మహిళా నేత యామిని పార్టీకి వీడ్కోలు పలికారు.

పార్టీలో నేతల మధ్య సఖ్యత లేదన్న యామిని
ఇక తన రాజీనామా నిర్ణయం తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలోనేనని ఆమె పేర్కొన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెలకొన్న పరిస్థితులు, ఇతర పరిణామాలు బలంగా ప్రభావం చూపుతున్నాయని, అందుకే రాజీనామా చేయాల్సి వచ్చిందని యామిని పేర్కొన్నారు. ఇక పార్టీలోనూ నేతల మధ్య సఖ్యత లోపించిందని, అనేక సమస్యలు ఉన్నాయని ఆమె తన లేఖలో తెలిపారు. ఈ మేరకు యామిని తన రాజీనామా లేఖను టీడీపీ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు.

చంద్రబాబుకు యామిని ప్రశంసలు
ఇక స్వదస్తూరితో చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన యామిని టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. చంద్రబాబు నాయకత్వంలో రాజకీయంగా ఎన్నో మెళకువలు నేర్చుకున్నానని తెలిపారు. ఒక నాయకుడికి ఉండాల్సిన ఓర్పు, చాణక్యత, ప్రజల పట్ల అభిమానం ఇవన్నీ చంద్రబాబు నుండే నేర్చుకున్నానని యామిని తెలిపారు. బాబు దగ్గర నేర్చుకున్న విషయాలతోనే తనని తాను నాయకురాలిగా మలుచుకున్నానని యామిని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

10న బీజేపీలో చేరనున్న యామిని !
ఎన్నికల ఫలితాల తర్వాత నుండి సాధినేని యామిని సైలెంట్ గా ఉన్న నేపధ్యంలో ఆమె పార్టీ మారతారని చాలా సార్లు ప్రచారం జరిగింది. కానీ ఆమెతన వ్యక్తిగత కారణాల వల్లే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక ఫైనల్ గా టీడీపీ అధికార ప్రతినిధిగా టీవీ డిబేట్లలో బలమైన వాయిస్ వినిపించిన మహిళా నేత ఇక కమలం బాట పట్టనున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఇప్పటికే కన్నా తో తరచూ టచ్ లో ఉంటున్న యామిని ఈనెల 10 న కాషాయ దళంలో చేరనున్నారని తెలుస్తుంది.