వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విష‌యం ముదురుతోంది: ఎన్నిక‌ల ముందు నిర్ణ‌యాల పై ఎల్వీ స‌మీక్ష‌: మ‌ంత్రుల ఫైర్‌..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత ఏపి ప్ర‌భుత్వంలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌టిగా ఉండాల్సిన క్యాబినెట్‌..ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌ధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఎన్నిక‌ల ముందు నిధుల స‌మీక‌ర‌ణ‌..విడుద‌ల పైన ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం స‌మీక్ష చేయ‌టం..కొన్ని కామెంట్లు చేయ‌టం పైన మంత్రులు ఫైర్ అవుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఆర్దిక శాఖ కార్య‌ద‌ర్శి సెల‌వు పైన వెళ్ల‌టం మ‌రింత చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది.

ఎన్నిక‌ల ముందు నిర్ణ‌యాల పైన‌..

ఎన్నిక‌ల ముందు నిర్ణ‌యాల పైన‌..

ఏపిలో అర్దిక ప‌రిస్థితి పైన రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం స‌మీక్షించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏకంగా అయిదు వేల కోట్ల వ‌ర‌కు రుణం తీసుకురావ‌టం పైన అధికారుల‌ను ప్ర‌శ్నించారు. కొత్త‌గా ఏర్ప‌డే ప్ర‌భుత్వం ఖాళీ ఖ‌జానాతో కొద్ది కాలం నెట్టుకురావాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌ట్లో అప్పు కూడా దొర‌క‌ని ప‌రిస్తితి ప్ర‌భుత్వానికి ఏర్ప‌డింది. ఇదే విష‌యం పైన ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం అధికారుల పైన ఒకింత సీరియ‌స్ అయ్యారు. ఇదే స‌మ‌యంలో ఆర్దిక ముఖ్య కార్య‌ద‌ర్శి ముద్దాడ ర‌విచంద్ర సెల‌వు పైన వెళ్లారు. వ‌చ్చే నెల 16వ తేదీ వ‌ర‌కు ఆయ‌న సెల‌వు కోరిన‌ట్లు తెలుస్తోంది. ఆర్దికంగా తీసుకుంటున్న నిర్ణ‌యాల ఒత్తిడి కార‌ణంగానే ఆయ‌న సెల‌వు పెట్టార‌నే చ‌ర్చ మొద‌లైంది. ఏపి ఆర్దిక ప‌రిస్థితి ఇబ్బంది క‌రంగా మార‌టం పైన ఇప్పుడు అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

ఎల్వీ నియ‌మాకం నుండే ఆరోప‌ణ‌లు..

ఎల్వీ నియ‌మాకం నుండే ఆరోప‌ణ‌లు..

ఎన్నిక‌ల సంఘం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న పుతీన‌ను త‌ప్పించి ఆయ‌న స్థానంలో ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంను ఏపి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించింది. దీనిని ముఖ్య‌మంత్రితో స‌హా మంత్రులు త‌ప్పు బ‌ట్టారు. సాధార‌ణంగా సీయ‌స్ ను తప్పించి..మ‌రొక‌రిని నియ‌మించాలంటే ముగ్గురు అధికారుల పేర్లు రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి తెప్పించుకొని వారిలో ఒక‌రికి అవ‌కాశం ఇస్తారు. అయితే, ఎన్నిక‌ల సంఘం ఏక‌ప‌క్షంగా ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం నియ‌మకాన్ని త‌ప్పు బ‌ట్టారు. ఆయ‌న కోవ‌ర్టు అంటూనే..జ‌గ‌న్ కేసుల్లో స‌హ ముద్దాయి అని అరోపించారు. ఇక‌, సీయం స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తే అందులో సీయ‌స్ పాల్గొన లేదు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న స‌మ‌యంలో తాను స‌మీక్ష‌ల‌కు హాజ‌రు కాలేన‌ని చెప్పుకొచ్చారు.

మంత్రి య‌న‌మ‌ల ఫైర్‌..

మంత్రి య‌న‌మ‌ల ఫైర్‌..

అర్దిక శాఖ‌లో నిదుల స‌మీక‌ర‌ణ‌..ఖ‌ర్చు పైన ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం చేసిన వ్యాఖ్య‌ల పైన ఆర్ధికశాఖలో వ్యవహారాలపై మంత్రి యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధుల సమీకరణ, విడుదలలో కేబినెట్‌ నిర్ణయమే ఫైనల్ అని, కేబినెట్‌ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఎస్‌కు లేదన్నారు. అప్పులు, వడ్డీరేట్లపై సీఎస్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమని యనమల వ్యాఖ్యానించారు. సీఎస్‌ సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారన్నారని ఆయన ఆరోపించారు.
సీఎస్‌ మంత్రివర్గానికి సబార్డినెట్‌ అని అలాంటిది ఆయన మంత్రివర్గ నిర్ణయాలను ఎలా ప్రశ్నిస్తారనే వాదనను య‌న‌మ‌ల లేవ‌నెత్తారు. దీంతో..ఇప్పుడు ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ఇంకా నెల రోజుల‌కు పైగా స‌మ‌యం ఉంది. ఈ స‌మ‌యంలో ఇంకా ఎటువంటి ప‌రిణామాలు చోటు చేసుకుంయానే ఉత్కంఠ నెల‌కొని ఉంది.

English summary
AP Cabinet minister yanamala Ramakrishnudu fire on Chief secretary LV Subramnyam review and comments on state finance situation. Yanamala says CS also cabinet subordinate and he must follow the cabinet orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X