వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోతుగా చూడాలి: పెదవి విరిచిన జగన్, 'అర్థం కావొద్దని ఇంగ్లీష్‌లో బడ్జెట్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ పైన వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పెదవి విరిచారు. బడ్జెట్ ఓ అభూత కల్పన అన్నారు. గతంతో పోలిస్తే అంకెల్లో పెద్దగా తేడా లేదన్నారు. రైతులకు ప్రాధాన్యం అంటూ ఎంత ఇచ్చారని విమర్శించారు. వ్యవసాయ రంగానికి సరైన నిధులు కేటాయించలేదన్నారు.

రైతులకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని కానీ అది కాలేదన్నారు. దీంతో రైతులకు గత ఏడాది రూ.25వేల కోట్ల అప్పులు ఉంటే, ఇప్పుడు 39 కోట్ల అప్పులు అయ్యాయన్నారు. కానీ బడ్జెట్‌లో రూ.3500 కోట్లే కేటాయించారన్నారు.

ఎస్టిమేట్ మాత్రమే మార్చి చూపారన్నారు. బడ్జెట్ పైన ఇంకా లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. కాపులకు రూ.మూడు వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఇంటికో ఉద్యోగం, లేదంటే భృతి చెప్పారని, దాని ఊసు ఏదన్నారు.

ఈ రెండేళ్లలో నాలుగు లక్షల పింఛన్లు చంద్రబాబు కట్ చేశారన్నారు. బడ్జెట్‌లో బీసీలకు న్యాయం జరగలేదన్నారు. జిడిపి ఎక్కువ చూపించడం ద్వారా ఎక్కువ అప్పులు చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు. రైతులకు వడ్డీ లేని రుణాల రూ.177 కోట్లు సరిపోతాయా అన్నారు.

Yanamala budget disappoints YS Jagan

అర్థం కాకుడదని ఇంగ్లీష్‌లో చదివారు: వైసిపి

బడ్జెట్ అంకెల గారడి అని వైసిపి సభ్యులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులు విమర్శించారు. బడ్జెట్లో అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. అంకెలకు వాస్తవాలకు పొంతన లేదన్నారు. రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కనీసం రూ.10వేల కోట్లు అవసరమవుతాయని, బడ్జెట్లో చాలా తక్కువ కేటాయించారన్నారు.

నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. మహిళలకు మొండిచేయి చూపారన్నారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. ప్రజలకు ఎక్కడ అర్థమవుతుందోనని బడ్జెట్‌ను యనమల ఇంగ్లీషులో చదివారన్నారు. ఇది నయవంచన బడ్జెట్, ప్రజలను ద్రోహం చేసిన బడ్జెట్ అన్నారు.

రూ.16,250కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌

శాసన సభలో 2016-17 వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురువారం ప్రవేశపెట్టారు. వ్యవసాయాన్ని తక్కువ వ్యయంతో లాభసాటిగా మార్చడం, రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.

- వ్యవసాయ బడ్జెట్‌ రూ.16,250.58 కోట్లు
- వ్యవసాయ శాఖ ప్రణాళిక వ్యయం రూ.1,311 కోట్లు
- వ్యవసాయశాఖ ప్రణాళికేతర వ్యయం రూ.4,474 కోట్లు
- ఉచిత విద్యుత్‌కు రూ.3 వేల కోట్లు
- ఉపాధి హామీకి రూ.5,094 కోట్లు
- రైతు బజార్లు, ఉద్యాన యాంత్రీకరణకు రూ.102 కోట్లు
- తుంపర సేద్యానికి రూ.369కోట్లు
- ఆయిల్‌ఫాం మినీ మిషన్‌కు రూ.55 కోట్లు
- పట్టు పరిశ్రమలో ప్రణాళికేతర వ్యయం రూ.125 కోట్లు
- వడ్డీలేని రుణాలకు రూ.177 కోట్లు
- వాతావరణ ఆధారిత బీమా పథకానికి రూ.344కోట్లు
- శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.139కోట్లు
- సూక్ష్మ పోషకాల సరఫరాలకు రూ.80కోట్లు
- సేంద్రీయ, సహజ వ్యవసాయం కోసం రూ.68.67 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.161.25కోట్లు
- సమగ్ర కరవు నివారణ చర్యలకు రూ.50కోట్లు
- వ్యవసాయ శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది సామర్ధ్యం పెంపు, విస్తరణ కార్యక్రమాలకు రూ.61.71కోట్లు

English summary
Yanamala Ramakrishnudu budget disappoints YSRCP chief YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X