వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండలికి తాగి వచ్చారు:ఆర్డినెన్స్ ఎలా తెస్తారు: యనమల కొత్త ఫిట్టింగ్..!

|
Google Oneindia TeluguNews

రాజధానుల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా..సెలెక్ట్ కమిటీ నివేదిక వచ్చే దాకా ఆగాల్సిందేనని మండలిలో ప్రతిపక్ష నేత యనమల స్పష్టం చేసారు. మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లుల పైన చర్చ సమయంలో శాసనమండలికి పలువురు వైసీపీ సభ్యులు మద్యం తాగి వచ్చారని ఆరోపించారు. లోకేష్‌పై దాడికి ప్రయత్నించారని ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించిందని ఆయన స్పష్టం చేశారు. సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్ళాక ఆర్డినెన్స్ ఇవ్వడం అసాధ్యమని యనమల తేల్చి చెప్పారు. మండలి రద్దుకు మేం ఎప్పుడూ బాధపడం.. భయపడమని స్పష్టం చేసారు.

మంత్రులు ఇష్టానుసారం వ్యవహరించారు..
మూడు రాజధానుల బిల్లుల పైన మండలిలో చర్చ సమయంలో.. కొంతమంది మంత్రులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. మండలి రద్దుకు ఎప్పుడూ బాధపడమని.. భయపడమని తేల్చి చెప్పారు. సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్ళాక ఆర్డినెన్స్ ఇవ్వడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తం చేసారు. సుప్రీంకోర్టు నిబంధనలకు ఇది విరుద్ధమని వివరించారు. తాము సభలో అడిగిన సెలెక్ట్ కమిటీ మండలికి సంబంధించి మాత్రమేనని.. జాయింట్ సెలెక్ట్ కమిటీ అడగలేదన్నారు.

Yanamala clarified that Ordinance is not possible when bills in under select committee consideration

జాయింట్ సెలెక్ట్ కమిటీ అడిగి ఉంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందులో సభ్యులుగా ఉంటారని వివరించారు. తాను సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్‌గా పని చేసిన విషయాన్ని గుర్తు చేసారు. సెలెక్ట్ కమిటీ ప్రక్రియ ముగియటానికి 3 నెలల కంటే ఎక్కువే సమయం పట్టొచ్చు. సెలెక్ట్ కమిటీ నిర్ణయానికి కనీస సమయం 3నెలని యనమల చెప్పుకొచ్చారు.

నిర్ణయం ఎంత కాలమైనా పట్టవచ్చు..
మూడు రాజధానులు.. సీఆర్డీఏ బిల్లులపై సెలక్ట్‌ కమిటి నిర్ణయం ఏళ్లు కూడా పట్టవచ్చని యనమల రామకృష్ణుడు చెప్పారు. సెలెక్ట్‌ కమిటీ కాలపరిమితి కనీసం మూడు నెలలని..అవసరమైతే పొడిగించవచ్చని తెలిపారు. సెలెక్ట్‌ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు. బిల్లు సెలెక్ట్‌ కమిటీలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్‌ ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. గతంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్‌లను తిరస్కరించార ని .. సుప్రీం తీర్పు ఇచ్చిందని యనమల గుర్తుచేశారు. మండలిని ప్రోరోగ్‌ చేయకుండా ఆర్డినెన్స్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ఆర్డినెన్స్‌ ఇచ్చినా కోర్టులో నిలబడదన్నారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు రూల్‌ 71పై అవగాహన లేదని అన్నారు. రూల్‌ 154 కింద చైర్మన్‌ విచక్షణాధికారాలను కోర్టులు ప్రశ్నించలేవని ఆయన పేర్కొన్నారు. సెలెక్ట్‌ కమిటీ మండలి వరకే పరిమితమని.. అందులోనూ మెజార్టీ తమదే అన్నారు. శాసనమండలి రద్దు జగన్‌ వల్ల కాదని స్పష్టం చేశారు. మండలి రద్దుపై తీర్మానం మాత్రమే చేయగలరని పార్లమెంట్ ఆమోదించాలి... రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇవ్వాలని యనమల వివరించారు.

English summary
council LOP Yanamala clarified that Ordinance is not possible when bills in under select committee consideration. He syas state govt not finalised the decision on abolish of council.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X