వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయసాయి ట్వీట్ పై యనమల కౌంటర్ .. ఊరికొకటి విలాసవంతమైన భవనాలు ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసు

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇష్టారాజ్యంగా విమర్శలు గుప్పించిన వైనంపై టీడీపీ సీనియర్ నేత ఎనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన విజయసాయి రెడ్డి కి కౌంటర్ ఇచ్చారు

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్లలో చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు లేఖపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఎం జగన్‌కు చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందని భావించామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నాయకుడికి ప్రజా సమస్యలు పట్టవని , అమరావతిలోని విలాస భవనంపై చంద్రబాబుకు చింత పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తానని అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేదా అంటూ విజయ సాయి వ్యాఖ్యలు చేశారు.

Yanamala Counter on Vijayasai Tweet .. Everyone knows who has luxurious buildings

ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖ మొదటిది కాదని యనమల స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు సీఎం జగన్ కు లేఖ రాశారని తేల్చిచెప్పారు. ఇక ఆ విషయం చెప్పకుండా అధికారంలోకి వచ్చినా, వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పడం మాత్రం మానలేదని చురకలు అంటించారు.

అంతే కాదు విజయసాయి చంద్రబాబుకు విలాసవంతమైన భవనాల చింత పట్టుకుందా అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా విలాసవంతమైన భవనాలు ఊరికి ఒకటి చొప్పున ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసని విజయసాయి చెప్పనవసరం లేదని ఆయన విజయ సాయిని టార్గెట్ చేసి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పై విజయసాయి చేసిన అనుచిత వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

English summary
Yanamala made it clear that the letter written by Chandrababu to Chief Minister Jagan about the praja vedika was not the first letter . Chandran Babu had written a letter to the Jagan seeking to work on the welfare of the poor while Jagan was sworn in as chief minister.Even though it came to power without mentioning that, the YCP leaders have been told the lies only. Vijayasai comments on Chandra Babu's luxurious buildings aspects yanamala commented that everyone knows who have luxurious buildings in each place. that there is no need to say that Vijay Sai was targeted and gave reverse counter. Repulsed comments made by Vijayasai on Chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X