వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ స్కీమ్ మరో జగన్మాయ ... జగనన్న వసతి దీవెనపై యనమల

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించిన జగనన్న వసతి దీవెనపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఉన్న పత్కానికే పేరు మార్చి జగన్ తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు . ఇక జగనన్న వసతి దీవెన మరో జగన్మాయే తప్ప కొత్త స్కీమ్ కాదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.

Recommended Video

3 Minutes 10 Headlines | #MeToo | Namaste Trump | Anti CAA Row | Oneindia Telugu

గతంలో తాము డైట్ ఛార్జీల కింద నెలకు 1400 రూపాయలు చొప్పున 10 నెలలకు కలిపి 14 వేల రూపాయలు ఇచ్చామని పేర్కొన్న యనమల వైసీపీ పథకాలన్నీ నాడు టీడీపీ అమలు చేసినవే అని వాటికి పేర్లు మార్చి జగన్ కొత్త పథకాలుగా ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఇస్తున్నట్లు సీఎం జగన్‌ ఫోజులు కొడుతున్నారన్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేస్తున్నారని యనమల ఆరోపించారు.

yanamala criticised jagan about his jagananna vasathi deevena

రాష్ట్రానికి 9 నెలల్లో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయనడం పచ్చి అబద్ధమని యనమల పేర్కొన్నారు . అదే నిజమైతే ఈ 9 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన కంపెనీల పేర్లు బయట పెట్టాలని సవాల్‌ చేశారు యనమల. టీడీపీ సర్కార్ 19000 రూపాయలు ఇస్తే జగన్‌ సర్కార్‌ వేయి రూపాయలు కలిసి ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాగేసుకుంటోందని యనమల విమర్శించారు. 75 శాతం హాజరు ఉండాలని కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని అభ్యంతరాలు పెడుతున్నారని ఆరోపించారు యనమల రామకృష్ణుడు .

English summary
TPP leader Yanamala Ramakrishnan criticized AP CM Jagan Mohan Reddy for his jagananna vasthi deevena scheme . He said that tdp schemes are using in ycp government with tha name change . TDP leader Yanamala Ramakrishnudu said that this is not a new scheme .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X